India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పలమనేరుకు చెందిన రగ్బీ క్రీడాకారిణి అక్షయకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అభినందనలు తెలిపారు. బీహార్ వేదికగా ఈ నెల 9, 10 తేదీలలో జరిగిన ఏషియా రగ్బీ ఎమిరేట్స్ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో శ్రీనగర్ కాలనీకి చెందిన సురేష్, శ్రీదేవిల కుమార్తె అక్షయ భారత జట్టు తరఫున ఆడి కాంస్య పతకం సాధించింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చిత్తూరులో సోమవారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మిట్టూరులో ఛాయ్ పే చర్చ, 10 గంటలకు కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళి, అనంతరం వివేకానంద విగ్రహం నుంచి తిరంగా ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు నాయకులతో, సాయంత్రం 4గంటలకు మీడియా, మేధావులతో సమావేశం నిర్వహిస్తారు.
చిత్తూరు జిల్లాలోనే పులిగుండు ప్రముఖ పర్యాటక కేంద్రం. పెనుమూరుకు సమీపంలో రెండు ఎత్తైన కొండలు పక్కపక్కనే ఇలా ఉంటాయి. చాలా ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ పెద్ద కొండలపై నుంచి చూస్తే ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఇటీవల వర్షాలతో ఈ పరిసరాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. పులిగుండుకు మేఘాలే గొడుగులా మారినట్లు నిన్న కనిపించింది. రోహిత్ అనే యువకుడు తీసిన ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.
పులిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతున్నట్లు తహశీల్దార్ జయసింహ తెలిపారు. పులిచెర్ల, రొంపిచెర్ల మండల ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమంలో తెలియజేయవచ్చన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.
చిత్తూరు కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశం మందిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిరిజనులు వారి పిల్లలను విధిగా పాఠశాలకు పంపి విద్యావేత్తలు చేయాలని సూచించారు. గిరిజనులకు ఎలాంటి సేవలు కావాలన్నా నేరుగా తనను, జేసీని సంప్రదించవచ్చన్నారు. గిరిజనులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 75 సింగిల్ విండోల ద్వారా స్వల్ప, దీర్ఘ వ్యవసాయేతర రుణాలుగా రూ.100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు DCCB ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సింగిల్ విండోలకు ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌ల విజ్ఞప్తి మేరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం 10 సింగిల్ విండోలకు అన్ని రకాల రుణాల రూపేనా రూ.70 లక్షలు అందించినట్లు తెలిపారు.
సీఎం చంద్రబాబు ఈ నెలాఖరున కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు సమాచారం. హంద్రీనీవా జలాలను కుప్పానికి విడుదల చేసేందుకు సీఎం 29 లేదా 30 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఆగస్టు నెలాఖరికల్లా కుప్పానికి హంద్రీనీవా నీళ్లు విడుదల చేస్తామని ఇది వరకే సీఎం పేర్కొన్న నేపథ్యంలో హంద్రీనీవా చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
చిత్తూరు జిల్లాలో పోలింగ్ అధికారులు, సిబ్బంది వేతనాలు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, కౌంటింగ్, సీపీఎస్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, డిప్యూటీ డీఈవో, సెక్టార్ అధికారుల వేతనాలు పెంచారు. గతంలో ప్రిసైడింగ్ అధికారులకు రూ.350 ఇస్తుండగా ప్రస్తుతం రూ.500, పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్లకు రూ.250 నుంచి రూ.400, కౌంటింగ్ అసిస్టెంట్లకు రూ.450కు పెంచారు.
మరమ్మతుల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చిత్తూరు నగరం, చిత్తూరు రూరల్స్, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, ఐరాల, తవణంపల్లె ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
కాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పగడాలవారిపల్లెలోని ఓ కోళ్ల ఫామ్‌లో ఒడిశాకు చెందిన మహేశ్ దంపతులు పనిచేస్తున్నారు. అక్కడ పైప్‌లైన్ కోసం కాలువ తీశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు అందులో చేరింది. మహేశ్ కుమారుడు మంజు (2) ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. పుంగనూరు ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Sorry, no posts matched your criteria.