Chittoor

News April 5, 2026

చిత్తూరు: ఇలా అయితే కొత్త ఇళ్లు కట్టినట్లే.!

image

యుద్ధం నేపథ్యంలో గృహ నిర్మాణ వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. చిత్తూరు జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఇనుము టన్నుకు రూ.10 వేలు, సిమెంటు బస్తా రూ.30 మేర పెరిగింది. అలాగే కేబుల్ ధరలు పెరిగిపోయాయి. పీవీసీ పైపుల ధరలు సుమారు 30 శాతం మేర పెరిగాయి. పెయింటింగ్ ధరలను కంపెనీలు పెంచేశాయి. వేసవిలో నిర్మాణ పనులు అధికంగా చేపడతారు. పెరిగిన ధరలు వారిపై భారం మోపునున్నాయి.

News April 5, 2026

హాజరుకాని వారికి నోటీసులు: ZP ఛైర్మన్

image

చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జడ్పీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరవడంతో నోటీసులు పంపించాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేరుశెనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలన్నారు. మామిడి రైతులకు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

News April 5, 2026

చిత్తూరు: రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఉదయం 11 గంటలకు యాదమరిలో ఏఈ కార్యాలయంలో యాదమరి, బంగారుపాళ్యం మండలాలకు సంబంధించిన సమస్యలు తెలుపవచ్చన్నారు. అలాగే చిత్తూరు గాంధీ రోడ్డులోని ఈఈ కార్యాలయంలో మధ్యాహ్నం 3గంటలకు చిత్తూరు, పూతలపట్టు మండల వినియోగదారులు సమస్యలను ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 5, 2026

చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలు

image

జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతోంది. శనివారం నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో 40.4, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్, గుడిపాలలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాల వారీగా.. వి.కోటలో 39.6, పలమనేరులో 39.5, పెనుమూరు, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పంలో 39.4, పాలసముద్రంలో 39.3, గంగాధర నెల్లూరులో 39.2, తవణంపల్లె, బంగారుపాళ్యంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

News April 5, 2026

చిత్తూరు: రూ.273 కోట్ల బకాయిల విడుదల

image

జడ్పీ పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యనిధి (పీఎఫ్)కి సంబంధించి మార్చి నెలాఖరు వరకు ఉన్న బకాయిలు రూ.273 కోట్లను వారి ఖాతాలో జమ చేసినట్టు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు తెలిపారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రుణాలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి అందజేసే తుది మొత్తాల పూర్తి బకాయిలను ప్రభుత్వం జమ చేసిందన్నారు. ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు పరిష్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు.

News April 5, 2026

CM పిలుపు.. అమరావతికి TDP నేతలు

image

కుప్పం TDP నేతలకు CM కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆగమేఘాలపై TDP నేతలు అమరావతికి పయనమయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసంలో CM చంద్రబాబు కుప్పం TDP నేతలతో సమావేశం కానున్నారు. కుప్పంకు సంబంధించి సుమారు 40మంది TDP నేతలకు CM కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఇటీవల కుప్పం టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో CM కార్యాలయం నుంచి కొంతమంది TDP నేతలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.

News April 5, 2026

CM పిలుపు.. అమరావతికి TDP నేతలు

image

కుప్పం TDP నేతలకు CM కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆగమేఘాలపై TDP నేతలు అమరావతికి పయనమయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసంలో CM చంద్రబాబు కుప్పం TDP నేతలతో సమావేశం కానున్నారు. కుప్పంకు సంబంధించి సుమారు 40మంది TDP నేతలకు CM కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఇటీవల కుప్పం టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో CM కార్యాలయం నుంచి కొంతమంది TDP నేతలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.

News April 4, 2026

PHC సేవల్లో చిత్తూరు జిల్లాకు చివరి స్థానం

image

2026 ఫిబ్రవరిలో PHC పనితీరుకు ప్రభుత్వం ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో చిత్తూరు జిల్లాకు 28వ స్థానం వచ్చింది. జిల్లాలో 42 PHCలు ఉండగా A గ్రేడ్‌లో-0, B గ్రేడ్‌లో 3, C గ్రేడ్‌లో 23, D గ్రేడ్‌‌లో 15 సాధించాయి. అయితే రాష్ట్రంలోనే ఆరోగ్య సేవల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. OP, IP సేవలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న PHCల రికార్డుల ఆధారంగా ర్యాంకులు కేటాయించినట్లు తెలుస్తోంది.

News April 3, 2026

చిత్తూరు: గ్యాస్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

గ్యాస్ సిలిండర్ల సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్టు చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. ఇప్పటివరకు 50 సమస్యలపై ఫిర్యాదులు రాగా.. ఏజెన్సీలతో చర్చించి 46 సమస్యలు పరిష్కరించామని చెప్పారు. గ్యాస్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ 08572-242734కు కాల్ చేయాలని సూచించారు. గుడిపాలలో గ్యాస్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు.

News April 3, 2026

చిత్తూరు జిల్లాలో స్పెషల్ ఆఫీసర్ల నియామకం

image

సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 27 మండలాల్లో 621 పంచాయతీలు ఉన్నాయి. వీటికి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, జలవనరులు శాఖ ఏఈలు, డిప్యూటీ డీఈఈలు, ఎఫ్ఎవోలు, పశు, ఉద్యానశాఖ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు.