India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు హెల్మెట్ పెట్టు- బహుమతి పట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని నిర్ణయించారు. ముఖ్య ట్రాఫిక్ కూడళ్లలో పోలీసులు అందజేసే స్లిప్పులను పూర్తి చేసి వివరాలు నమోదు చేయాలి. వారాంత, నెలసరి బహుమతులు అందిస్తామని పేర్కొంటున్నారు. వాటితో పాట సర్టిఫికెట్లు, మెమెంటోలు అందిస్తామన్నారు.

చిత్తూరు-తచ్చూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి. వాహనాల ట్రయల్ రన్‌లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ మొత్తం దూరాన్ని ఒకటిన్నర గంటలోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

మెడికల్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లు, నార్కో టిక్ డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఔషధ నియంత్రణ, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశాలు నిర్వహించారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు విక్రయించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు.

లోన్ యాప్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. తెలియని యాప్‌ల ద్వారా రుణాలు పొందితే వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పెట్టినట్లేనని ఆయన హెచ్చరించారు. లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా మాత్రమే రుణాలు పొందాలని సూచించారు.

చిత్తూరు నగరం వేంగారెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులు 2 రోజులపాటు ఆందోళన చేపట్టారు. మామిడి పంట తరలించి ఏడాది గడుస్తున్నా.. ఇంత వరకు డబ్బులు చెల్లించలేదని రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్నారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం నిరసన స్థలానికి చేరుకొని ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతులతో చర్చించింది. ఏప్రిల్ 7లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించడంతో రైతులు నిరసనలను విరమించారు.

పాఠశాల విద్యార్థులకు ఈనెల 6 నుంచి 16 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 (వార్షిక) పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 1-5 తరగతులకు ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. 6-8 తరగతులకు ఈనెల 6 నుంచి 16వ తేదీవరకు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Sorry, no posts matched your criteria.