Chittoor

News November 18, 2024

నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం.వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News November 17, 2024

గుర్రంకొండ ASI మోసెస్‌పై కేసు నమోదు

image

గుర్రంకొండ ASI మోసెస్‌పై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రెండో పట్టణ SI రవి కుమార్ తెలిపారు. ఏఎస్ఐ మోసెస్ 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ తనను పట్టించుకోకపోవడమే కాకుండా అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడని ఆయన భార్య ఎస్తర్ రాణి శనివారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రామచంద్ర ఆదేశాలతో ఎస్ఐ విచారణ చేపట్టి ఏఎస్ఐపై కేసు చేశారు. 

News November 17, 2024

నేడు నారావారిపల్లెకు CM రాక.. వివరాలు ఇవే 

image

చంద్రగిరి మాజీ MLA నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు వస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 9.20కు హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి 9.25కు బేగంపేట ఎయిర్పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి 10.10గంటలకు తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన 10.50 గంటలకు నారావారిపల్లెకు చేరుకుని అంత్యక్రియలలో పాల్గొననున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

News November 16, 2024

బి.కొత్తకోట: క్షుద్రపూజలు చేస్తున్న వైసీపీ నేతలు అరెస్ట్

image

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో క్షుద్ర పూజలు నిర్వహించిన ఇద్దరు వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినట్లు మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. అరెస్టైన వారిలో ఒకరు మదనపల్లె చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యుడు ఏ.వీ సుబ్బారెడ్డి కాగా మరొకరు కదిరికి చెందిన వజ్ర భాస్కరరెడ్డి ఉన్నారు. బి.కొత్తకోట మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ పురాతన ఆలయంలో పూజలు నిర్వహించగా అరెస్టుచేశామని తెలిపారు.

News November 16, 2024

తిరుపతి: 15ఏళ్ల బాలికపై అఘాయిత్యం

image

తిరుపతి జిల్లా BN కండ్రిగ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. SI విశ్వనాథనాయుడు వివరాల ప్రకారం.. కల్లివెట్టు గ్రామానికి చెందిన శివ(23) ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో ఓ గ్రామం వద్ద ఇంటి ముందు మంచంలో నిద్రపోతున్న 15 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది గమనించి బాలిక తల్లిదండ్రులు శివని పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.

News November 16, 2024

ఆపరేషన్ నార్కోస్ ను ప్రారంభించిన తిరుపతి RPF

image

రైల్వే రక్షణ దళం (RPF) ఆపరేషన్ నార్కోస్ ను ప్రారంభించింది. శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో RPF, GRP భద్రతా బలగాలు లగేజ్ కౌంటర్లు, పార్శిల్ ఆఫీస్, ప్లాట్‌ఫారమ్‌ల పై విస్తృత తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో ఆర్పీఎఫ్‌కు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలం ప్లాట్‌ఫారంపై నిర్లక్ష్యంగా వదిలిపెట్టబడిన ట్రాలీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్‌లలో నిషేధిత గంజాయిని గుర్తించింది. దీని విలువ సుమారు రూ.3,78,100 ఉంటుంది.

News November 16, 2024

SVU : డిసెంబర్ 4 నుంచి డిగ్రీ పరీక్షల ప్రారంభం

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో డిగ్రీ (UG) 3, 5 సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 4వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్నట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News November 16, 2024

తిరుపతి: ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV)లో ఎంటెక్ (M.Tech) విభాగంలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో 17వ తేదీలోపు కళాశాలలో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడగలరు.

News November 15, 2024

తిరుపతి: డిగ్రీ విద్యార్థిని మృతికి కారణం అదేనా..?

image

తిరుపతి శ్రీపద్మావతి డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్థిని స్వగ్రామంలో ఆమె స్నేహితుడు 2 రోజుల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురైంది. ఈక్రమంలో స్నేహితుడి మృతిని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ చెబుతున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News November 15, 2024

చిత్తూరులో పోసానిపై పోలీసులకు ఫిర్యాదు

image

ప్రముఖ సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై చిత్తూరు ఈస్ట్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో రిపోర్టర్ రాజేందర్ నాయుడు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడును కించపరచే విధంగా పోసాని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అతనిపైన చర్యలు తీసుకోవాలని ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశామన్నారు.