India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏనుగుల దాడులు అరికట్టేందుకు పులిచెర్ల మండలంలోని అటవీ సరిహద్దులో ఏర్పాటుచేసిన కోలార్ కంచ సత్ఫలితాలను ఇస్తున్నట్టు అటవీ అధికారులు తెలిపారు. గత నెలలో ఐదు కిలోమీటర్ల పొడవుతో ప్రభుత్వం సోలార్ కంచ ఏర్పాటు చేసింది. మూడు రోజుల క్రితం భీమవరం అటవీ ప్రాంతం నుంచి కల్లూరు సమీపంలోని అడవి వద్దకు ఏనుగుల గుంపు చేరుకున్నాయి. సోలార్ కంచ దాటేందుకు ప్రయత్నించగా షాక్ కొట్టడంతో అక్కడి నుంచి అవి వెనుతిరిగాయి.

జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ శనివారం హెచ్చరించారు. ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందుకోసం పట్టిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా బెట్టింగ్లకు పాల్పడితే 112, 9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

చిత్తూరు జిల్లాలోని 811 పంచాయితీలలో ఏప్రిల్ 3 నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. దీంతో కూటమి నేతలు గత ఐదేళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. ఇది పార్టీల మధ్య కొత్త సమస్యకు దారి తీయనుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

జీడీ నెల్లూరు మండలానికి చెందిన తుమ్మలపల్లి వీరయ్య, మరో వ్యక్తితో కలిసి సబ్-రిజిస్ట్రార్‌ను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ దందాకు పాల్పడ్డాడు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా బెదిరింపులకు దిగుతూ, రూ.50 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మదనపల్లి పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమం ముగించుకుని రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు DFO పెద్దిరెడ్డి సూచించారు. ప్రమాదాలు జరిగితే వెంటనే స్థానిక అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని కోరారు.
చిత్తూరు: 08572-228101
కుప్పం: 08570-255099
నగరి: 08577-236122
పలమనేరు:08579-252399
పుంగనూరు: 08581-253101

చిత్తూరు టాప్ లైన్ పోలీస్ క్వార్టర్స్‌లోని సీతారామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్వామివారికి ఎస్పీ తుషార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. కలెక్టర్ శ్రీరామనవమి సందర్భంగా పంచెకట్టులో వచ్చి శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో విజయవాడ, అనంతపురంలో తలసీమియా సెంటర్లను ఏర్పాటు చేయునట్లు NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో బ్లడ్ బ్యాంక్స్ నిర్వహిస్తుండగా త్వరలో విజయవాడలోనూ ప్రారంభించడం జరుగుతుందన్నారు. మే 10న తలసీమియా బాధితుల కోసం హైదరాబాదులో రన్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.