India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డిజిటల్ అరెస్టు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడీ సోమవారం సూచించారు. మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్, మెసేజ్, వీడియో కాల్ ద్వారా మోసగించేందుకు ప్రయత్నిస్తారని ఆయన వివరించారు. ఎటువంటి దర్యాప్తు సంస్థలు వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయవని SP స్పష్టం చేశారు. వారు నగదు డిమాండ్ చేస్తే చెల్లించరాదని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. SHARE IT.

డిజిటల్ అరెస్టు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడీ సోమవారం సూచించారు. మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్, మెసేజ్, వీడియో కాల్ ద్వారా మోసగించేందుకు ప్రయత్నిస్తారని ఆయన వివరించారు. ఎటువంటి దర్యాప్తు సంస్థలు వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయవని స్పష్టం చేశారు. వారు నగదు డిమాండ్ చేస్తే చెల్లించరాదని సూచించారు.

డిజిటల్ అరెస్టు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడీ సోమవారం సూచించారు. మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్, మెసేజ్, వీడియో కాల్ ద్వారా మోసగించేందుకు ప్రయత్నిస్తారని ఆయన వివరించారు. ఎటువంటి దర్యాప్తు సంస్థలు వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయవని స్పష్టం చేశారు. వారు నగదు డిమాండ్ చేస్తే చెల్లించరాదని సూచించారు.

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 35 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 5, ఆస్తి తగాదాలు 3, భూతగాదాలు 14 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 1100కు కాల్ చేయడంతో పాటు Meekosam.ap.gov.inకు మెయిల్ చేసి కూడా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావచ్చని సూచించారు.

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆహార శుద్ధి రంగ అభివృద్ధికి సమన్వయం అత్యంత అవసరమని సూచించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ సౌత్ జోన్ ఛైర్మన్‌గా రెండోసారి ఎన్నికైన కట్టమంచి బాబీని సత్కరించారు. పరిశ్రమలు, రైతుల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలన్నారు. కార్యక్రమంలో తలుపులపల్లి బాబురెడ్డి, శివకుమార్, శివారెడ్డి మరియు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలు ఉన్నవారు https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. వినతుల స్థితిని 1100 నెంబర్ లో తెలుసుకోవచ్చని చెప్పారు.

జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల పంపిణీని ప్రభుత్వం నియంత్రించింది. ఈ నేపథ్యంలో హోటల్లు, టీ అంగళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్లను తమ వ్యాపారం కోసం పలుచోట్ల వినియోగిస్తున్నారు. ఇటీవల వీ.కోటలో నిర్వహించిన దాడుల్లో హోటల్లలో డొమెస్టిక్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు.

బంగారుపాలెం పరిధిలో మురళీకృష్ణ రైల్వే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని లోకేశ్ వద్ద రూ.3.15 కోట్లు తీసుకొని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై లోకేశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసరావు తెలిపారు.

హోటల్ యాజమాన్యాలకు అవసరమైనమేర కమర్షియల్ సిలిండర్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గత ఆరు నెలల కాలంలో వారు వినియోగించిన గ్యాస్ సిలిండర్ల వివరాలను లెక్కించి.. నెలకు అవసరమైన కమర్షియల్ సిలిండర్ కోటా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో గృహ అవసర గ్యాస్ సిలిండర్లకు కొరతలేదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.