India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
APSSSC, PMKVY సంయుక్త ఆధ్వర్యంలో చిత్తూరు ఇరువారంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC)లో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కోఆర్డినేటర్ నాగరత్న పేర్కొన్నారు. 8వ తరగతి పాసై, 15 నుంచి 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు ఇరువారం పీహెచ్ కాలనీ సమీపంలోని NAC కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 4.
తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC)లో నవంబర్ 4వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథరెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కాలేజీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు తొలిచూపులోనే సుధా రెడ్డిని చూసి ప్రేమలో పడినట్లు చంద్రగిరి MLA పులివర్తి నాని చెప్పారు. 4 ఏళ్లు కష్టపడి పెళ్లిచేసుకున్నామన్నారు ‘నా వల్లే నాని చదువుకోలేదు. మా క్లాస్ రూమ్ బయటే ఉండేవారు. కానీ నాకన్నా ఆయనకే ఎక్కువ మార్కులు వచ్చేవి. మాది వేరే క్యాస్ట్, పోలీసు కుటుంబం. అయినా నాని పట్టువదలకుండా నాకోసం ప్రయత్నించారు. అది నాకు ఇష్టం’ అని సుధా రెడ్డి చెప్పారు.
జాతీయ సంస్కృత యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య (ఆన్ లైన్) కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. సర్టిఫికెట్, డిప్లమా, యూజీ, పిజి, పీజీ డిప్లమా కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 05.
పలమనేరు మున్సిపల్ పరిధి గోరి తోట వెనుక పాడుపడిన బావిలో ఓ శవం కలకలం రేపింది. యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యా లేక ఆత్మహత్యా అనేది పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
తమిళనాడు ఊతుకోటకు చెందిన ధనశేఖర్ కుమారుడు దినేశ్‌ను 2 నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనశేఖర్ ఊతుకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవేడు మండలం దాసుకుప్పం పంచాయతీ చెన్నేరి వద్ద మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. సత్యవేడు సీఐ మురళి, ఊతుకోట డీఎస్పీ శాంతి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ వైద్యులు, తహశీల్దార్ సుబ్రహ్మణ్యం సమక్షంలో పోస్టుమార్టం చేశారు.
జాతీయ ఏక్తా దినోత్సవం సందర్భంగా నగరంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల వరకు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ ర్యాలీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీలు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయ్ గొప్పదనాన్ని ఎస్పీ తెలిపారు.
వినియోగదారుల కోసం గురువారం విద్యుత్తుశాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని తిరుపతి జిల్లా SE సురేంద్రనాయుడు తెలిపారు. బిల్లులు సకాలంలో చెల్లించి అపరాధ రుసుము పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మోసగించి బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పెద్దమడ్యం ఎస్ఐ పివి రమణ తెలిపారు. మండలంలోని దామ్లానాయక్ తండాకు చెందిన నాన్ కే నాయక్(24) అదే పంచాయతికి చెందిన 16ఏళ్ల మైనర్‌ను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నట్లు తెలిపారు. తంబళ్లపల్లె మల్లయ్య కొండకు తీసుకెళ్లి ఈనెల 21న మైనర్‌ను మోసగించి పెళ్లి చేసుకోవడంతో కుటుంబీకులు తెలుసుకుని ఫిర్యాదుచేయగా పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే స్కిల్ సెన్సస్ సర్వేకు ప్రజలు పూర్తి సమాచారం అందించి అధికారులకు సహకరించాలని జేసీ శుభం బన్సల్ తెలిపారు. బుధవారం స్కిల్ సెన్సస్ సర్వే గురించి జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలిసి జాగ్రత్తగా సర్వే చేయాలన్నారు. ఏ చిన్న తప్పిదం జరగకుండా బెస్ట్ క్వాలిటీ సర్వే జరగాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.