Chittoor

News March 25, 2026

నియంత్రణకు చర్యలు చేపట్టాలి: చిత్తూరు కలెక్టర్

image

జిల్లాలోని అన్ని విద్యాసంస్థల వద్ద డ్రగ్స్, పొగాకు ఇతర నిషేధిత వస్తువులు నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. చిత్తూరు కలెక్టరేట్లో బుధవారం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంపై ఎస్పీ తుషార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.

News March 25, 2026

చిత్తూరు: భర్త కళ్లెదుటే బావిలో దూకిన భార్య

image

పెనుమూరు మండలంలోని అతిమాకులపల్లి గ్రామానికి చెందిన సుకన్య భర్తతో గొడవపడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త బాబు ఎదుటే బావిలోకి దూకినట్లు తెలుస్తోంది. అతనికి ఈత రాకపోవడంతో గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులను తీసుకొచ్చే సరికి భార్య నీటిలో మునిగిపోయింది. దీంతో గ్రామస్థులు ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

News March 25, 2026

చిత్తూరు: అందుకోసమే కలపలేదా.?

image

జిల్లాల పునర్విభజన సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపలేదు. అలాగే నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలనూ తిరుపతిలో కలపాలని పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్ ఉన్నా అలా జరగలేదు. అసెంబ్లీ స్థానాల పునర్విభజన సమయంలో ప్రక్రియ సులువుగా సాగేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు.

News March 25, 2026

ఉద్యోగ క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

image

జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీలలో ప్రతిభ చూపిన జిల్లా ఉద్యోగుల క్రీడాకారులను కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. మంగళవారం రాత్రి తన ఛాంబర్‌లో వారికి పతకాలను అందజేశారు. ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు పూణేలో జరిగిన జాతీయ స్థాయి సివిల్ సర్వీస్ ఖోఖో పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు విశేష ప్రతిభ కనబరచి కాంస్య పతకాన్ని సాధించింది.

News March 25, 2026

చిత్తూరు: మామిడి దిగుబడిపై అధికారులు అంచనా

image

జిల్లాలో మామిడి దిగుబడి అంచనాను ఉద్యాన శాఖ అధికారులు పూర్తి చేశారు. తోతాపురి 40024 హెక్టార్లకు 483981 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చునని అంచనా వేశారు. అలాగే బేనీషా 6856 హెక్టార్లకు 42242 టన్నులు, కాదర్ 2702 హెక్టార్లకు 18834 టన్నులు, నీలం 5178 హెక్టార్లకు 42242 టన్నులు, మల్లిక 1349 హెక్టార్లకు 10444 టన్నులు, ఇతర రకం 3217 హెక్టార్లకు 23509 టన్నుల దిగుబడి వచ్చే ఛాన్స్ ఉందని వివరించారు.

News March 25, 2026

కుప్పం: అంగన్వాడీలో పేలిన కుక్కర్

image

కుప్పం మున్సిపాలిటీ తంబిగానిపల్లి SC కాలనీ అంగన్వాడీ కేంద్రంలో కుక్కర్ పేలి అంగన్వాడీ కార్యకర్త సుమతి గాయపడ్డారు. మధ్యాహ్నం వంట చేసేందుకు స్టవ్ మీద కుక్కర్ పెట్టారు. కాసేపు తర్వాత కుక్కర్ విజిల్స్ రాగా స్టౌ ఆఫ్ చేసి కుక్కర్‌ను పక్కకు తీసి దాన్ని ఓపెన్ చేసే క్రమంలో పేలడంతో కుక్కర్‌లోని వేడి నీళ్లతో పాటు పప్పు ఆమె ముఖంపై పడింది. దీంతో సుమతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News March 24, 2026

పుంగనూరు: వివాహితపై అత్యాచారయత్నం

image

పుంగనూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కూలీ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో రామానుజులు దారిలో అడ్డగించి నీలగిరి తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. వాహనాల శబ్దం రావడంతో వివాహితను వదిలి పారిపోయాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా ఎస్సై అన్సర్ బాష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2026

చిత్తూరు DMHOగా నాగ శశిభూషణ్ రెడ్డి

image

చిత్తూరు డీఎంహెచ్ఓగా నాగ శశిభూషణ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇది వరకు అనంతపురం జిల్లా డీఐవోగా పని చేశారు. ఈ జీవోలో ప్రస్తుత డీఎంహెచ్ఓ సుధారాణిని ఎక్కడకు బదిలీ చేశారు పేర్కొనలేదు.

News March 24, 2026

చిత్తూరు: కన్నతండ్రిపై కుమారుడి దాడి

image

కన్న తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘటన పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. రాంనగర్‌కు చెందిన భాస్కర్ రాజు కుమారుడు గోవర్ధన్‌కు ఏడాది క్రితం వివాహం చేశారు. దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సామరస్యంగా ఉండాలని సూచించడంతో కుమారుడు తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. దీనిపై మళ్లీ పంచాయతీ పెట్టి, కోడలి పట్ల అనుకూలంగా మాట్లాడటంతో గోవర్ధన్ తండ్రిపై దాడి చేశాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.

News March 24, 2026

చిత్తూరు: సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. సమస్యలపై అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు.