India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు ఆశించిన మేర ధర లభించలేదు. గతంలో ప్రభుత్వం స్పందించి మద్ధతు ధర రూ.8గా నిర్ణయించింది. అన్ని మామిడి పల్ఫ్ కంపెనీలు(గుజ్జు పరిశ్రమలు) ఈ ధర చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికీ కొన్ని కంపెనీలు రూ.8 ఇవ్వడం లేదని చిత్తూరు MLA జగన్‌మోహన్ తెలిపారు. రూ.8 చొప్పున ఇవ్వన కంపెనీలకు తాళాలు వేస్తామని MLA హెచ్చరించారు. కంపెనీలు ఎలా స్పందిస్తాయో మరి.

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వివిధ మౌలిక వసతుల కల్పన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. బుధవారం చిత్తూరులోని జడ్పీ కార్యాలయంలో జిల్లాలో 15వ ఫైనాన్స్ నిధులపై వివిధ మండలాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారో సంబంధిత ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించారు.

చిత్తూరు జిల్లాలో ముగ్గురు టీచర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. నరహరిపేట జడ్పీ టీచర్ ఫిజిక్స్ టీచర్ నౌషద్ అలీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన 30 ఏళ్లుగా విద్యా రంగంలో సేవలు అందించారు. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ సైతం రూపొందించారు. పుంగనూరు మండలం రాంనగర్ స్కూల్ టీచర్ హేమలత, నక్కబండ కేజీబీవీ టీచర్ నౌజియా సైతం రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డులకు ఎంపికయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.

చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ వ్యభిచారం గృహంపై మంగళవారం సాయంత్రం పోలీసులు రైడ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. జయప్ప వీధిలో జ్యోత్స్న అనే మహిళ విటులును రప్పించి వ్యభిచారం చేయిస్తోందని పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు దాడి చేసి ఓ మహిళ, ఓ విటుడితో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిన్నర నుంచి ఆమె అద్దె ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం.

చిత్తూరు జిల్లాలోని RMP క్లినిక్‌లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 76 కేంద్రాలను పరిశీలించారు. 24 క్లినిక్‌లు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని DMHO సుధారాణి వెల్లడించారు.

SRపురం(M) పాతపాళ్యానికి చెందిన పూజ మృతి హత్య అని తేలింది. SI సుమన్ వివరాల మేరకు.. యాదమరి(M) వరదరాజులపల్లెకు చెందిన వ్యక్తితో పూజకు వివాహం జరగ్గా మూడేళ్ల కిందట అతను చనిపోయాడు. ఆ తర్వాత భాస్కర్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గతనెల 17న పూజను అతను కొట్టి చంపేసి ఉరేసుకున్నట్లు నమ్మించాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి ఆమెది హత్య అని నిర్ధారించారు. నిన్న రీపోస్ట్‌మార్టం చేశారు.

వాతావరణ మార్పుతో పాటు దోమలు ఎక్కువైపోయాయి. అటు పంచాయతీలు..ఇటు పట్టణాలు రెండు వైపులా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు ఫాగింగ్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు చిన్నపాటి క్లినిక్లు కూడా రోగులతో నిండిపోయాయి. ఆరోగ్య శాఖ ప్రకటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించి నేటితో 71 వసంతాలు పూర్తయింది. 1954 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చేతులమీదుగా వర్సిటీని ప్రారంభించారు. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. కాగా ఇవాళ సాయంత్రం యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో వర్సిటీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో జరిగింది. బొమ్మనపల్లికి చెందిన బాలాజీ (41) స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామ సమీపంలో ఉన్న ఆవుల షెడ్డులో పాలు పితకడానికి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. అక్కడ ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. అతని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పుంగనూరు (మం) బండ్లపల్లి సచివాలయ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు సోమవారం పంపిణీ చేయాల్సిన
రూ. 6.30 లక్షల పింఛను సొమ్ముతో పరారయ్యాడు. దీనిపై ఎంపీడీవో లీలా మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఎస్ఐ కెవి రమణ కేసు నమోదు చేశామన్నారు. కార్యదర్శిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.