India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి తనకు అవకాశం కల్పించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అలాగే మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కావాలని కోరారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరి మిథున్ రెడ్డి బెయిల్ వస్తుందో? లేదో? చూడాలి మరి.

సీఎం చంద్రబాబు కుప్పంలో నేడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు శాంతిపురం(M) శివపురంలోని తన ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో పరమసముద్రంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుంటారు. బస్సులోనే మహిళలతో మాట్లాడుతారు. 11:30 గంటలకు జలహారతి ఇస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులతో ఎంవోయూలు చేసుకుంటారు.

కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు. చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు శాంతిపురంలో చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం కుప్పం నియోజకవర్గ ప్రజలకు హంద్రీనీవా జలాలను అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పలువురు నేతలు పేర్కొన్నారు. కరువు తీరి పంటల సాగుకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

బైరెడ్డిపల్లి(M) విరూపాక్షపురం పక్షవాత ఆయుర్వేద వైద్యానికి ప్రత్యేకమని స్థానికులు పేర్కొన్నారు. తాజాగా ఇక్కడికి మందుకోసం నైజీరియా నుంచి నలుగురు వచ్చారు. వారు మాట్లాడుతూ.. తాము గత నెల 12న ఓ సారి మందు తీసుకున్నామని, రెండో విడత కోసం ఇవాళ వచ్చామన్నారు. మరోసారి మందు తీసుకోవాల్సి ఉందని, ఇప్పటికే ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి పెరాలిసిస్ రోగులు వస్తుంటారని స్థానికులు తెలిపారు.

సీఎం చంద్రబాబు 2 రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నేడు కుప్పం రానున్నారు. సాయంత్రం 6:30 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరు నుంచి శాంతిపురం (M) తుమిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. అనంతరం కడపల్లి సమీపంలోని సొంత ఇంటికి చేరుకొని రాత్రి 7:30 గంటల ప్రాంతంలో కడ అడ్వైజరీ కమిటీతో సమావేశం కానున్నారు. రేపు కుప్పంలో హంద్రీనీవా జనాలకు జలహారతితో పాటు బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.

అధికారులు సమిష్టిగా పనిచేసి సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సీఎం పర్యటనకు సంబంధించి కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, కడా పీడీ వికాస్ మర్మత్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గురువారం సమావేశమయ్యారు. సీఎం పర్యటనపై అధికారులతో చర్చించారు.

బోయకొండ గంగమ్మ ఆలయంలో నూతన పాలకమండలి(బోర్డు) కోసం 115 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఈవో ఏకాంబరం వెల్లడించారు. దరఖాస్తుల గడువు ఈనెల 27న ముగియడంతో చివరి దరఖాస్తును చిన్న ఓబునం పల్లికి చెందిన సుధాకర్ భార్య రాధమ్మ అందజేశారు. సెప్టెంబర్ 1న పరిశీలించి రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనకు అభ్యర్థులు కచ్చితంగా రావాలన్నారు.

బస్సుల్లో ప్రయాణికులను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఆ జిల్లా ఎస్పీ జగదీశ్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్.సుమతి, ఎస్.గీత, ఎస్.రంజిత్, ఎస్.బృందను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి నుంచి రూ.23 లక్షలు విలువైన 242.5 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

సీఎం చంద్రబాబు 29వ తేదీ సాయంత్రం 6:30 గం.తుమ్మిసి హెలిపాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి శివపురంలోని సొంతింటికి చేరుకుంటారు. రాత్రి 7:30 గం.కు కడ అడ్వైజరి కమిటీతో సమావేశం, రాత్రి సొంతింట్లో బస చేస్తారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ బస్సులో పరమసముద్రంకు వస్తూ వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో చర్చించనున్నారు. 11:30 గంటలకు హంద్రీనీవాకు జల హారతి, 11:55 గం.కు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు.

పుంగనూరులో బుధవారం జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో ఓ మహిళ మృతి చెందింది. సింగరిగుంట గ్రామానికి చెందిన భార్య,భర్తలు బోయకొండ, సుజాత పుంగనూరు నుంచి సింగరిగుంటకు బైక్‌పై వెళ్తున్నారు. రెడ్డివారి బావి వద్ద వాహనంపై నుంచి సుజాత జారి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రురాలను తిరుపతి రుయా ఆసుపత్రికి ఓ అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలోని రొంపిచర్ల వద్ద మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.