Chittoor

News July 13, 2024

చంద్రగిరిలో కారు డ్రైవింగ్ పై ఉచిత శిక్షణ

image

యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో 30 రోజుల పాటు పూర్తి ఉచితంగా పురుషులు, మహిళలకు లైట్ మోటార్ వెహికల్ కారు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సంస్థ డైరెక్టర్ పి.సురేష్ బాబు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాల గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న నిరుద్యోగులు అర్హులని తెలిపారు.

News July 13, 2024

కుప్పం: వైసీపీ నేతల అరెస్ట్

image

కుప్పం(M)ఎన్ కొత్తపల్లికి చెందిన YCP నేత ఈశ్వర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొత్తపల్లి చెందిన YCP నేత ఈశ్వర్, అతని కొడుకులు పవన్, సతీశ్ తమ్ముడు బాలు, బంధువు నరసింహులు తనపై దాడి చేశారని జూన్ 1న TDP నేత సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఐదుగురిపై అప్పట్లోనే కుప్పం పోలీసులు కేసు నమోదు చేయగా.. శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు.

News July 13, 2024

మదనపల్లె: వేడి నీళ్లు మీద పడి చిన్నారికి గాయాలు

image

వేడి నీళ్లు ఒంటి మీద పడి ఓ చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. కోళ్లబైలు పంచాయతీ మేకలవారిపల్లెకు చెందిన శివ, సుగుణ దంపతుల కుమార్తె నాన్విక(3) ఇంట్లో ఆడుకుంటూ ఉండగా.. స్టవ్ దగ్గరకు వెళ్లింది స్నానం చేయించడానికి సిద్ధంచేసిన వేడినీళ్లు ప్రమాదవశాత్తు మీదపడి చిన్నారి తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News July 13, 2024

తిరుపతి: ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడి

image

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. CI శ్రీరామ శ్రీనివాసులు కథనం ప్రకారం.. ఏర్పేడు మండలానికి చెందిన బలరామయ్య గౌడ్(61) ఆరేళ్ల చిన్నారిపై గత ఆదివారం లైంగిక దాడి చేశాడు. బాలిక నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానికంగా చికిత్స అందించగా నొప్పి తగ్గకపోవడంతో రేణిగుంటలోని వైద్యశాలకు తీసుకుపోగా విషయం తెలిసింది. బాలిక తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 13, 2024

శ్రీవారి మెట్టు వద్ద నేడు పార్వేట ఉత్సవం

image

శ్రీనివాసమంగాపురం సాక్షాత్కార వైభవోత్సవాలు ముగిసిన మరుసటి రోజూ పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలో ఈ ఉత్సవాన్ని శనివారం నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వేడుక జరుగుతుంది. దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లేని ప్రయోగిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం చేప‌డ‌తారు.

News July 13, 2024

తిరుపతి: 14న UPSC పరీక్ష

image

తిరుపతి జిల్లాలో ఈనెల 14న జరగనున్న యూపీఎస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.ఎస్ మురళి ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లాలో 3 పరీక్ష కేంద్రాల్లో 1199 అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు.

News July 12, 2024

పెద్దిరెడ్డి తీరుపైనే అందరి విమర్శలు..!

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పుంగనూరులో వరుస షాక్‌లు తగులుతున్నాయి. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ ఆలీం బాషా, కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. తాజాగా పులిచెర్ల ZPTC మురళీధర్‌తో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు YCPకి గుడ్ బై చెప్పేశారు. పుంగనూరు అభివృద్ధికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ సహకరించ లేదని ఆలీం బాషా అప్పుడు చెప్పగా.. ఇవాళ మురళీధర్ కూడా పెద్దిరెడ్డి తమకు అండగా ఉండకపోవడంతో రాజీనామా చేశామని చెప్పారు.

News July 12, 2024

బోయకొండలో ప్రతి శుక్రవారం అన్నదానం

image

చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహిస్తామని ఈవో, ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు. ఈవో స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు. అన్నదానం గురించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. బోయకొండకు వచ్చే భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 12, 2024

చిత్తూరు: ఫైరింగ్ ప్రాక్టీస్ తనిఖీ

image

గన్‌మెన్లకు జీడీ నెల్లూరు సమీపంలోని చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఫైరింగ్ రేంజ్‌లో ప్రాక్టీస్ ఇస్తున్నారు. సంబంధిత ఫైరింగ్ ప్రాక్టీసును ఎస్పీ మణికంఠ శుక్రవారం తనిఖీ చేశారు. వీఐపీల వద్ద విధులు నిర్వహిస్తున్నప్పుడు.. అత్యవసర సమయాల్లో ప్రాణ రక్షణకు సంసిద్ధులై ఉండాలని సూచించారు. అధికారుల సూచనల మేరకు ప్రాక్టీస్ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

News July 12, 2024

తిరుపతిలో 15న ఇంటర్వ్యూలు

image

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో (RARS) కాంట్రాక్ట్ ప్రాతిపదికగా అగ్రోమెట్ అబ్జర్వర్ (Agromet Observer)-1 పోస్ట్‌కు 15న ఉదయం 10 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://angrau.ac.in/ వెబ్‌సైట్‌ను చూడగలరు.