Chittoor

News July 12, 2024

పూర్వ వైభవం సంతరించుకోనున్న చంద్రగిరి కోట

image

జిల్లాలోని చారిత్రాత్మక చంద్రగిరికోట త్వరలోనే పూర్వ వైభవం సంతరించుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. రూ.100 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్ధరించనున్న పర్యాటక ప్రాంతాల్లో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఈ కోటకు ప్రాధాన్యం దక్కింది. కోటలోని రాజ మహల్, రాణి మహల్, పుష్కిరిణి, ఉద్యానవనం, పురాతన దేవాలయాలను అధికారులు సుందరంగా తీర్చిదిద్దనున్నారు.

News July 12, 2024

మదనపల్లె యువతికి 37వ ర్యాంకు

image

సీఏ ఫైనల్స్ ఫలితాల్లో మదనపల్లెకు చెందిన వై.హర్షిత రెడ్డి సత్తా చాటింది. ఆల్ ఇండియా స్థాయిలో 37వ ర్యాంకు సాధించింది. పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన ఆర్టీసీ కండక్టర్ సోమశేఖర్, నందిని దంపతుల కుమార్తె హర్షిత రెడ్డి. సీఏ ఫైనల్స్‌లో రెండు గ్రూపులకు కలిపి 428/700 మార్కులు సాధించింది.

News July 12, 2024

శ్రీవారి ఆరాధనకు మూలం అదే: రాఘవ దీక్షితులు

image

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆరాధనకు శ్రీవైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమే మూలమని వైఖానస ట్రస్ట్ అధ్యక్షుడు రాఘవ దీక్షితులు తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, శ్రీమరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాఘవ దీక్షితులు మాట్లాడుతూ.. వేల సంవత్సరాలుగా శ్రీవారికి పూజలు శ్రీవైఖానస ఆగమం ప్రకారం జరుగుతున్నాయని తెలిపారు.

News July 11, 2024

శ్రీకాళహస్తి సమీపంలో ముగ్గురు మృతి

image

శ్రీకాళహస్తి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన రాజాసింగ్, బాబూన్ సింగ్, శుక్రదేవ్ కేవీబీపురం(M) ఆళత్తూరు వద్ద ఉన్న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వీళ్లు బైకుపై శ్రీకాళహస్తికి బయల్దేరారు. పార్లపల్లి వద్దకు రాగానే శ్రీకాళహస్తి నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. ముగ్గురు అక్కడికి అక్కడే చనిపోయారు. మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారయ్యాడు.

News July 11, 2024

ధర్మారెడ్డిపై విచారణ.. ఆరోపణలు ఇవే

image

టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. శ్రీవారి నగదు, బంగారు డిపాజిట్లను ఆయనకు అనుకూలమైన బ్యాంకుల్లో పెట్టారని విమర్శలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్టుతో పాటు ఇతర దర్శన టికెట్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, తిరుపతిలో TTD నిధులతో అక్రమంగా రోడ్లు నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. తిరుమలకు వచ్చే బడాబాబుల పరిచయంతో YCPకి విరాళాలు సేకరించారని ఆరోపణలు ఉన్నాయి.

News July 11, 2024

కుప్పం: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు

image

కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 11, 2024

తిరుపతి లాయర్‌కు స్టేట్ 5th ర్యాంక్

image

వారిది సాధారణ రైతు కుటుంబం. చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లి, సోదరుడి ప్రోత్సహంతో మనుషా రాష్ట్ర స్థాయి PG లాసెట్‌లో ఐదో ర్యాంకు సాధించింది. పొదలకూరు(M) లింగంపల్లి గ్రామానికి చెందిన గుండ్రా మస్తాన్‌రెడ్డి, మాధవిల కుమార్తె పదో తరగతి వరకు పొదలకూరు బాలికల ZP హైస్కూల్లో చదివింది. తిరుపతి SVUలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ఇక్కడే న్యాయవాదిగా పనిచేస్తోంది. న్యాయమూర్తి కావడమే లక్ష్యమని మనుషా పేర్కొంది.

News July 11, 2024

శ్రీకాళహస్తి : స్కౌట్స్ విద్యార్థులను అభినందించిన కలెక్టర్

image

ఈ ఏడాదికి రాజ్య పురస్కార్ అవార్డులు పొందిన శ్రీకాళహస్తిలోని బాబూ అగ్రహారం మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు స్కౌట్స్ విద్యార్థులు శ్రీనివాసులు, వినోద్, యస్వంత్, మురళి, లోకేష్లను తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో DEO శేఖర్, స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీనివాసరావు, జిల్లా స్కౌట్స్ కమిషనర్ వంశీరాజా, స్కౌట్ గైడ్ డీటీసీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2024

నేటి నుంచి రాయితీ ధరకు బియ్యం కందిపప్పు

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు నేటి నుంచి రాయితీ ధరకు బియ్యం కందిపప్పు అందిస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ రోడ్డు లోని రైతు బజారులు, చిత్తూరు నగరంలోని రైతు బజారుతో పాటు కొన్ని ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బియ్యం రూ. 48కి, బియ్యం (స్టీమ్డ్) రూ.49కి, దేశవాళి కందిపప్పు రూ.160 కి సరఫరా చేయనున్నారు.

News July 11, 2024

టీడీపీలోకి కుప్పం మునిసిపల్ ఛైర్మన్?

image

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌, 9 మంది కౌన్సిలర్లతో అమరావతికి పయనమై వెళ్లినట్లు తెలిసింది. వైసీపీకి చెందిన ఛైర్మన్‌, టీడీపీలో చేరేందుకే బయలుదేరి వెళ్లినట్లు కుప్పంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నేడో, రేపో టీడీపీలో మునిసిపల్ ఛైర్మన్ సుధీర్, 9 మంది కౌన్సిలర్లు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.