Chittoor

News September 7, 2024

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న చిత్తూరు ఎస్పీ

image

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీసు క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయకుడి విగ్రహానికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎస్పీ మణికంఠ పోలీసు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, సకల విజయాలు అందించాలని కోరుకున్నట్టు చెప్పారు. సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ భాస్కర్ పాల్గొన్నారు.

News September 7, 2024

తిరుమల క్యూలైన్లో మహిళ మృతి

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గుండెపోటుతో మహిళ మృతి చెందింది. కడపకు చెందిన ఝాన్సీ (32) శనివారం ఉదయం సర్వదర్శనం క్యూలైన్ లో గుండెపోటుకు గురై చనిపోయింది. అయితే అంబులెన్స్ గంట ఆలస్యంగా వచ్చిందని..సకాలంలో అందుబాటులో ఉంటే తన బిడ్డ బతికేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.తమ కుమార్తె మృతికి టీటీడీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని బోరున విలపించారు.

News September 7, 2024

సత్యవేడు MLAపై అత్యాచార కేసు..UPDATE

image

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధిత మహిళను పోలీసులు శుక్రవారం ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ చేయడానికి చికిత్సలు చేయించుకోమన్నారు. అయితే ఆమె పరీక్షలకు నిరాకరించినట్లు సమాచారం. సాక్ష్యాలు తారుమారు అవుతాయని వైద్యులు, పోలీసులు చెప్పినా వినకుండా వెళ్లిపోయిందన్నారు. మరో రెండురోజుల్లో పరీక్షలకు వస్తానని చెప్పారన్నారు.

News September 7, 2024

చిత్తూరు: మీరు చూపించిన సేవా భావం అందరికీ ఆదర్శం: SP

image

హెడ్ కానిస్టేబుల్ చూపించిన సేవాభావం అందరికీ ఆదర్శమని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. శుక్రవారం ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ వరద బాధితులకు రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయాన్ని ఎస్పీకి అందజేయడంతో హెడ్ కానిస్టేబుల్‌ను అభినందించారు.

News September 6, 2024

క్యాన్సర్ పరీక్షలు త్వరగా నిర్వహించాలి: ఎంపీ

image

ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్ గుర్తించిన వారికి త్వరగా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఎంపీ గురుమూర్తి కోరారు. చిత్తూరు జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లాలో 190 మందికి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో తేలిందన్నారు. క్యాన్సర్ లక్షణాలు గుర్తించిన వారికి స్క్రీనింగ్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు.

News September 6, 2024

సత్యవేడు టీడీపీ ఇన్‌ఛార్జ్ రేసులో SCV నాయుడు

image

సత్యవేడు టీడీపీ ఇన్‌ఛార్జ్ రేసులో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితి రావడంతో అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన ట్రబుల్ షూటర్ ఎస్‌సీవీ నాయుడు వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

News September 6, 2024

లడ్డూ ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు: ఈవో

image

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో జే.శ్యామలరావు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు సమాచార కేంద్రాలలో లడ్డూ ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

News September 6, 2024

ఆగస్టు నెలలో రూ.125.67 కోట్ల హుండీ ఆదాయం

image

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఆగస్టు నెలలో రూ.125.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. గత నెలలోనే దాదాపు 22.42 లక్షల మంది భక్తులు కొండ గుడిలో పూజలు చేశారని ఈవో జే.శ్యామలరావు తెలిపారు. లడ్డూలు రూ.1.06 కోట్లకు అమ్ముడయ్యాయని చెప్పారు. 24.33 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించగా.. 9.49 లక్షల మంది తలనీలాలు సమర్పించారన్నారు.

News September 6, 2024

తిరుపతి: సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ కమ్యూనికేటివ్ అండ్ ఫంక్షనల్ సాన్‌స్క్రిట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ సితార్, సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ ట్రాన్స్లేషన్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రోజూ 2 గంటల పాటు తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు nsktuadmission.samarth.edu.inలో రిజిస్టర్ చేసుకోవాలి. చివరి తేదీ సెప్టెంబర్ 06.

News September 6, 2024

ఆదిమూలంపై ఆరోపణలు అవాస్తవం: మాజీ MPPలు

image

సత్యవేడు MLA ఆదిమూలంపై కుట్రపూరితంగా KVBపురానికి చెందిన మహిళతో ఆరోపణలు చేయించారని.. ఇది అవాస్తవమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. నారాయణవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ‘ఈ కుట్ర వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే హేమలత, చెరుకు గుర్తుతో పోటీ చేసిన రమేశ్ ఈ ప్లాన్ వేశారు’ అని మాజీ ఎంపీపీలు గోవిందస్వామి, భక్తవత్సలం, సుబ్రహ్మణ్యం ఆరోపించారు.