Chittoor

News March 8, 2025

కష్టాలను ఎదిరించి నిలబడ్డ చిత్తూరు బిడ్డ.. అముద

image

ఊహతెలిసే సమయానికే తండ్రి మరణం. కోలుకునేలోపు తల్లి దూరం. అల్లారు ముద్దుగా పెరగాల్సిన సమయంలో కుటుంబ బాధ్యతలు. అయినా ఆమె ఏమాత్రం చెక్కు చెదరలేదు. కష్టపడి ముగ్గురు తోబుట్టువులను పోషించింది. వారి కోసం పెళ్లికి సైతం దూరం అయ్యారు. నిప్పులో కాలిస్తే ఇనుము పదునెక్కినట్లు కష్టాలను సైతం విజయానికి సోపానాలగా మార్చుకుని.. చిత్తూరు నగరాకి మొదటి మహిళగా ప్రశంసలు అందుకుంటున్న మేయర్ అముద విజయగాథ ఇది. #HappyWomensDay

News March 8, 2025

పదేళ్లకొకసారి జరిగే జాతర.. జగన్‌కు ఆహ్వానం

image

శాంతిపురం మండలం కదిరి ముత్తనపల్లి గ్రామంలో మార్చి 10 నుంచి సిద్ధేశ్వర స్వామి పెద్ద దేవర ప్రారంభం కానుంది. ఈ మేరకు దేవరకు హాజరుకావాలని YCP అధినేత జగన్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. పదేళ్లకొకసారి నిర్వహించే జాతర ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆహ్వానం పలికిన వారిలో ఎమ్మెల్సీ భరత్, మునిరత్నం, శ్రీరాములు, మంజునాథ్ తదితరులు ఉన్నారు.

News March 8, 2025

చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

ఈనెల 8వ తేదీ(శనివారం) చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవును DEO వరలక్ష్మి ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా ఉపాధ్యాయునిలు జరుపుకోవాలని ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

News March 7, 2025

చిత్తూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్యాంశాలు

image

☛ చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు
☛ పలమనేరు: 9న రైతు బజార్ ప్రారంభోత్సవం
☛ జిల్లా స్థాయిలో సత్తా చాటిన వెదురుకుప్పం విద్యార్థినులు
☛ పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
☛ పుంగనూరు: అప్పు అడిగినందుకు వ్యక్తిపై దాడి
☛ కాణిపాకం హుండీకి రూ.1.40కోట్ల ఆదాయం

News March 7, 2025

చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

ఈనెల 8వ తేదీ(శనివారం) చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవును DEO వరలక్ష్మి ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా ఉపాధ్యాయునిలు జరుపుకోవాలని ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

News March 7, 2025

చిత్తూరు జిల్లాలో పట్టపగలే పంజా విసురుతున్న దొంగలు

image

చిత్తూరు జిల్లాలో పట్టపగలే దొంగలు పంజా విసురుతున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా అందినకాడికి దోచుకుంటూ ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నారు. మంగళవారం కుప్పంలో ఓ ఇంటిపై దాడి చేసి బంగారం, నగదు అపహరించిన దొంగలు.. వీకోటలోనూ చేతివాటం చూపించి పోలీసులకు సవాల్ విసిరారు. దొంగల ధాటికి బయటకి వెళ్లాలంటే వణుకుతున్న ప్రజలు.. త్వరగా వారిని పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

News March 7, 2025

చిత్తూరు: 8వ తేదీ స్కూల్‌కు సెలవు లేదు

image

ఈనెల 8వ తేదీన రెండో శనివారం సెలవు లేదని జిల్లా విద్యాశాఖ అధికారిణి వరలక్ష్మి తెలిపారు. 2024-25 సంవత్సరానికి మొత్తం పని దినాలు 220 రోజుల కన్నా తక్కువగా ఉండడంతో రెండో శనివారం పని దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ యథావిధిగా పాఠశాలకు హాజరుకావాలని సూచించారు.

News March 7, 2025

చిత్తూరు: అయ్యో దేవుడా ఎంత పని చేశావు.!

image

ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కానీ విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు ప్రమాదంలో ఓకేసారి ఇద్దరు కుమారులను బలి తీసుకుంది. పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న మంజునాథ, లక్ష్మి దంపతుల దీనగాధ ఇది.

News March 7, 2025

దొరస్వామి నాయుడు మృతికి చిత్తూరు MP సంతాపం

image

కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొరస్వామి నాయుడు మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. గురువారం బెంగళూరులో దొరస్వామి నాయుడు మరణం పట్ల ఎంపీ ఢిల్లీలో ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుప్పంలో పీఈఎస్ మెడికల్ కళాశాల స్థాపించడం ద్వారా ఎంతో సేవ చేశారని కొనియాడారు.

News March 6, 2025

PES విద్యాసంస్థల అధినేత కన్నుమూత

image

పీఈఎస్ విద్యాసంస్థల అధినేత ప్రొఫెసర్ ఎంఆర్ దొరస్వామి నాయుడు(85) కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దొరస్వామి 1972లో బెంగళూరులో 40 మంది విద్యార్థులతో పీఈఎస్ విద్యాసంస్థను ప్రారంభించారు. కర్ణాటక ఎమ్మెల్సీగా, ప్రభుత్వ సలహాదారుడిగా విద్యారంగానికి విశేషంగా కృషి చేశారు. బెంగళూరులోని తన నివాసంలో గురువారం సాయంత్రం దొరస్వామి నాయుడు తుది శ్వాస విడిచారు.