Chittoor

News September 1, 2024

రేషన్ షాపులో కంది పప్పు ఎక్కడ..?

image

1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రేషన్ షాపులో బియ్యం, చక్కెర రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. దీనిపై ప్రజలు నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే బహిరంగ మార్కెట్ లో నిత్యవసర సరుకులు పెరిగిన నేపథ్యంలో రేషన్ షాపులో గతంలో అందించే కందిపప్పు సరఫరా చేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి గతంలో ఇచ్చే అన్ని సరుకులను అందించాలని కోరుతున్నారు.

News September 1, 2024

పుత్తూరు: రిటైర్డ్ ఎంఈఓ మృతి

image

పుత్తూరు పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ ఆదివారం మృతి చెందారు. తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు పుత్తూరు పట్టణంలోని గుడ్ షెఫర్డ్ చర్చి కాంపౌండ్ ఆవరణంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. పరిసర ప్రాంతాల ఉపాధ్యాయులు, స్థానికులు ప్రముఖులు ఆయన భౌతికాయానికి ఘన నివాళులు అర్పించారు.

News September 1, 2024

చిత్తూరు: 30 మండలాల్లో వర్షం

image

అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని 30 మండలాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. విజయపురం మండలంలో 21.8 మి.మీటర్లు, చిత్తూరు 18. 2, పూతలపట్టు 16.6, సదుం 16.4, పులిచెర్ల 15, సోమల 14.8, నగరి 14.2, నిండ్ర, ఎస్ ఆర్ పురం 13.6, తవణంపల్లె 12.2, గంగాధర నెల్లూరు 12, కుప్పం 10.6 మి.మీటర్లు కురవగా.. మిగిలిన మండలాల్లో చిరుజల్లుల నుంచి తేలికపాటి వర్షపాతం నమోదైంది.

News September 1, 2024

మదనపల్లెలో యువకుడి మృతి.. ఆచూకీ లభ్యం

image

మదనపల్లె బెంగుళూరు రోడ్డులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించినట్లు తాలూక ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు. నిమ్మనపల్లె మండలం చౌకిల్లపల్లెకు చెందిన శివ(30) బెంగళూరు నుంచి బైకుపై స్వగ్రామానికి వస్తుండగా, మదనపల్లె చిప్పిలి వద్ద లారీ ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు. మృతునికి భార్య జ్యోతి, పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

News August 31, 2024

మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

మదనపల్లె బెంగళూరు రోడ్డులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. కర్ణాటక నుంచి మదనపల్లికి బైకుపై వస్తుండగా స్థానిక బెంగళూరు రోడ్డులోని చిప్పిలి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.  సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చరీకి తరలించారు.

News August 31, 2024

రేపటి నుంచి అందుబాటులోకి రానున్న స్వామి పుష్కరిణి

image

మరమ్మతు పనులు పూర్తైన సందర్భంగా స్వామి పుష్కరిణిలోకి భక్తులను ఆదివారం నుంచి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు

News August 31, 2024

చిత్తూరు జిల్లాలో 88% పింఛన్ల పంపిణీ

image

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను శనివారం ఇప్పటివరకు 88.8% మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్టు అధికారులు చెప్పారు. నగిరి 93. 85%తో ప్రథమ స్థానం, 93. 47%తో యాదమరి రెండవ స్థానం, 93. 18 శాతంతో విజయపురం మూడవ స్థానంలో ఉన్నాయి. 77 26%తో రామకుప్పం ఆఖరి స్థానంలో నిలిచింది. ఈరోజు పింఛన్ అందుకొని వారికి సోమవారం అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

News August 31, 2024

తిరుమలలో కూలిన భారీ వృక్షం.. మహిళకు తీవ్ర గాయాలు

image

శ్రీవారి దర్శనార్థం తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమలకు వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఎస్ఎంసి కాటేజ్ ప్రాంతంలోని 305 గదిని తీసుకున్నారు.  ఆరు బయట వారు సేద తీరుతున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విపరీతమైన గాలులు వీయడంతో అక్కడే ఉన్న భారీ వృక్షం కూలి ఉమామహేశ్వరి (44) అనే మహిళపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అశ్విని హాస్పిటల్ నుంచి వెంటనే తిరుపతి సిమ్స్ కు తరలించారు.

News August 31, 2024

ఆంధ్రా క్రికెట్ జట్టుకు యువకుడి ఎంపిక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా యువకుడు తన ప్రతిభతో సత్తా చాటాడు. రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వల్లాల దర్శన్ రాజు ఆంధ్ర అసోసియేషన్ టీ20 క్రికెట్ మ్యాచ్ జట్టుకు ఎంపికయ్యారు. నేపాల్(పొక్రా)లో సెప్టెంబర్ 18న జరగనున్న టీ20లో పాల్గొంటారు. దర్శన్ రాజును కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాకారులు అభినందిస్తున్నారు.

News August 31, 2024

కుప్పం : కవలలకు జన్మనిచ్చి..తల్లి సూసైడ్..ఎందుకంటే

image

పెద్దబంగారునత్తం చెరువులో శుక్రవారం మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. శ్రీదేవికి(48) 2020లో మదనపల్లె వాసితో పెళ్లైంది. మూడేళ్లైనా పిల్లలు లేకపోవడంతో వైద్య చికిత్సతో గర్భం దాల్చి ఈనెల 3న ఆడ,మగకు జన్మనిచ్చింది. బాలింతగా ఉన్న ఆమెకు సపర్యలు చేసేందుకు బంధువులు రాలేదు. దీంతో అనారోగ్యానికి గురై మనస్తాపం చెంది, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.