India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు తెలిపారు. శ్రావణమాసం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో ఏనుగులతో జరుగుతున్న నష్ట పరిహారాలను రైతులకు అందించేందుకు అటవీ శాఖ ‘గజ-ప్రజా’యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా ఏనుగులతో పంట నష్టం జరిగిందని రైతులు ఫిర్యాదు చేయగానే ఎఫ్‌బీవో యాప్‌లో ఫోటో, వివరాలు అప్ లోడ్ చేస్తారు. తర్వాత సంబంధిత అధికారులకు అలెర్ట్ వస్తుంది. వారు పరిశీలించి, నిధుల కోసం నివేదిక పెడతారు. దీంతో పరిహారం అందుతుంది. ప్రస్తుతం యాప్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. రామకుప్పానికి చెందిన కృష్ణనాయక్, రాజేంద్రనాయక్ గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని విచారించారు. కర్రిపల్లెకు చెందిన ఆనందప్ప అనే రైతు తన బీన్స్ పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి దాదాపు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
మాయమాటలు చెబుతూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న కేసులో నలుగురు నిందితులను మంగళవారం శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ నెల 22వ తేదీన పట్టణ పరిధిలో తల్లిదండ్రులు లేని మైనర్ బాలిక(13)పై తరచూ అఘాయిత్యానికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధు, సునీల్, చంద్రశేఖర్, అదిల్ (సన్నీ), కార్తీక్‌ను నిందితులుగా చేర్చారు.
‘సీఐ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు.. అత్యవసరంగా నగదు పంపండి’ అంటూ ఓ ఏఎస్సై పేరిట ఫోన్ చేసి వ్యాపారిని బురిడీ కొట్టించారు సైబర్ మోసగాళ్లు. వారు చెప్పిన విధంగా స్కానరుకు రూ. 95 వేల నగదు పంపి మోసపోయారు. ఈ ఘటన బంగారుపాళ్యంలో మంగళవారం వెలుగుచూసింది. ఇది మోసం అని గ్రహంచిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ చేపట్టారు.
AP CGST ఆడిట్ కమిషనరేట్ పరిధిలోని అనుమానస్పద వ్యాపార సంస్థల్లో చేపట్టిన ఆడిట్ తనిఖీల్లో రూ.1,040కోట్ల పన్ను ఎగవేతను గుర్తించినట్లు ఏపీ సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ పులపాక ఆనంద్‌కుమార్ తెలిపారు. వైజాగ్,గుంటూరు,తిరుపతి సర్కిళ్ల పరిధిలో ఈ ఏడాది జులై వరకు మొత్తం 370 అనుమానస్పద వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసి రూ.108కోట్లను రికవరీ చేశామన్నారు. తిరుపతిలోని సీజీఎస్టీ ఆడిట్ కార్యాలయాన్ని సందర్శించారు.
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ ఒక ప్రకటనలో సూచించారు. సమాజానికి అవి విపత్తుగా మారాయని తెలిపారు. మోసపూరిత ఫోన్ కాల్స్, డేటా చోరీ, ఫేక్ సైట్లు వంటి మోసాలతో పలువురు వాటి వలలో పడుతున్నట్టు చెప్పారు. మోసపూరిత మెసేజ్ లింక్స్ ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతాలోని మొత్తం చోరీకి గురవుతుందని తెలిపారు. ఎవరైనా మోసపోతే 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.
ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 30వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఏదేని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 215 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తానెప్పుడూ జగనన్న మనిషినే! జీవితాంతం నేను వైసీపీలోనే ఉంటానని తమిళ మీడియా ఇంటర్య్వూలో మాజీ మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. తమిళనాడులో సినీనటుడు విజయ్ కొత్తగా ఏర్పాటుచేసిన పార్టీలోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఆయనతో తనకు పెద్ద పరిచయాలు కూడా లేవని పేర్కొన్నారు. అప్పట్లో ఆంధ్రలో సినీనటుడు చిరంజీవి పెట్టిన పార్టీలోకే వెళ్లలేదని గుర్తు చేశారు.
తనను చంపేస్తామని పెద్దిరెడ్డి అనుచరులు బెదిరించారని ఓ రిటైర్డ్ టీచర్ వాపోయారు. బాధితుడి వివరాల మేరకు.. కార్వేటినగరం(M) సుద్దగుంటకు చెందిన రిటైర్డ్ టీచర్ జి.మురళి మదనపల్లెలో భూమి కొనుగోలు చేశారు. ఎన్నికలకు ముందు దీనిని పెద్దిరెడ్డి అనుచరులు ఆక్రమించి ఇల్లు కట్టారు. దీనిపై తాను ప్రశ్నించగా చంపేస్తామని బెదిరించారని మురళి వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.