Chittoor

News August 27, 2024

మదనపల్లె ఘటనలో ట్విస్ట్

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం కేసులో కీలక ట్విస్ట్ వెలుగు చూసింది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి సీఐడీ అధికారులు నిన్న రంగంలోకి దిగారు. మదనపల్లెలోని పెద్దిరెడ్డి పీఏ శశికాంత్, ఆయన అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. ఈక్రమంలో నకిలీ మద్యానికి సంబంధించిన సీక్రెట్ ఫైళ్లు, నగదు లావాదేవీల పత్రాలు, బ్యాంకు చెక్కులు దొరికినట్లు సమాచారం. ఈక్రమంలో CID విచారణ ఆసక్తికరంగా మారింది.

News August 27, 2024

తిరుపతి: నిధులు వృధా చేయరాదు: మంత్రి నారాయణ

image

తుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో నిధుల వృధాను అరికట్టాలని మంత్రి నారాయణ సూచించారు. అభివృద్ధి పనులపై తుడా సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టనున్న పనులు, నిధుల పెండింగ్ తదితర అంశాలపై కమిషనర్ మౌర్య పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిధుల కొరత ఉందని కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నట్టు మంత్రి చెప్పారు.

News August 26, 2024

SVU : LLB ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది సెప్టెంబర్/ అక్టోబర్ నెలలో 3/ 5 LLB (CBCS) 4, 6, 8 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్ష విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 26, 2024

తిరుపతిలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్

image

తిరుపతి పట్టణంలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఘటన స్థానిక అలిపిరి లింక్ బస్టాండ్ సమీపంలో జరిగింది. రన్నింగ్ బస్సు టైర్ కింద తల పెట్టేందుకు ప్రయత్నించగా డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు అతనిని వారించి పక్కకు తీసుకెళ్లారు.

News August 26, 2024

అన్నమయ్య జిల్లాలో కాడెడ్లకు గుడి

image

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఓ రైతు తన కాడెడ్లపై ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు. మండలంలోని నరసాపురానికి చెందిన పెద్దప్పయ్య కాడెడ్లు 15 ఏళ్ల కిందట చనిపోయాయి. అప్పట్లో వాటికి అంత్యక్రియలు చేసి , గ్రామ పొలిమేరలో ఆలయం కట్టి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఏటా శ్రావణమాస మూడో శనివారం వాటి జ్ఞాపకార్థం అన్నదానం చేస్తామని తెలిపారు.

News August 26, 2024

మాన్యువల్ స్కావెంజెర్స్ ఫ్రీ జిల్లాగా చిత్తూరు

image

పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన నివేదిక మేరకు మాన్యువల్ స్కావెంజర్స్ ఫ్రీ జిల్లాగా చిత్తూరును ప్రకటించినట్లు సాంఘిక సంక్షేమ, సాధికారిత అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్, ఇన్- సానిటరీ లెట్రిన్స్ వివరాలపై ఆ శాఖ సర్వే నిర్వహించిందని పేర్కొన్నారు. ఆ నివేదిక మేరకు మాన్యువల్ స్కావెంజెర్స్ ఫ్రీ జిల్లాగా ప్రకటించామని, అభ్యంతరాలుంటే వచ్చే నెల 2వ తేదీలోపు తెలపాలని కోరారు.

News August 26, 2024

నేడు తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

image

శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల సందర్భంగా తిరుపతి నగరంలో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. నగరంలోని హరేరామ హరేకృష్ణ రోడ్‌లో గల ఇస్కాన్ దేవస్థానంలో కృష్ణాష్ణమి వేడుకలు నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు గమనించాలని సూచించారు. SHARE IT..

News August 26, 2024

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎస్పీ సమీక్ష

image

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సుబ్బారాయుడు సమీక్ష నిర్వహించారు. పార్కింగ్ ప్రదేశాలు, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలలో ఆయన విస్తృతంగా తనిఖీలు చేశారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కార్యాచరణ రూపొందించాలన్నారు.

News August 25, 2024

తిరుపతి జిల్లాలో ఏనుగు మృతి

image

తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం పులిబోనుపల్లి సమీప అటవీ ఏరియాలో ఆదివారం ఓ ఏనుగు మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పశువుల కాపరులు గుర్తించి సమాచారం ఇవ్వగా, అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆ ఏనుగుకు కొన్ని వైద్య పరీక్షలు చేయించారు. అనారోగ్యంతో మృతి చెందిందని వైద్యులు చెప్పినట్లు అధికారులు వివరించారు.

News August 25, 2024

మదనపల్లెలో విషాదం.. పాము కాటుతో మహిళ మృతి

image

పాము కాటుకు గురై ఓ మహిళా రైతు మృత్యువాత పడింది. ఈ విషాద ఘటన మదనపల్లె మండలంలో ఆదివారం జరిగింది. ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం ప్రకారం.. చీకలబైలు పంచాయతీ జమ్ముకుంటపల్లికి చెందిన బాపనపల్లి రాజశేఖర్-కవిత(33) దంపతులకు ఊరికి సమీపాన వ్యవసాయ పొలం ఉంది. కవిత రోజూ మాదిరిగానే పొలంలోకి పనికి వెళ్లగా ఆమెను పాము కాటేసింది. జిల్లా ఆస్పత్రికి తరలించేలోపే కవిత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.