India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి(DCHS)గా డాక్టర్ పద్మాజలి దేవి బాధ్యతలు చేపట్టారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తూ జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారిగా ప్రమోషన్ పొందారు. ఇన్‌ఛార్జ్ డీసీహెచ్‌ఎస్ ప్రభావతి నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా పనిచేస్తానని చెప్పారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ దర్శకుడు మారుతి దర్శించుకున్నారు. సోమవారం ఆయన స్వామి వారి దర్శనానికి రాగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. మారుతి ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
సీడాప్ ఆధ్వర్యంలో DDUGKY పథకం ద్వారా చిత్తూరు, తిరుపతిలో ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు డీఆర్డీఎ పీడీ శ్రీదేవి తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18-28 ఏళ్లలోపు యువతీ యువకులు ఈనెల 9వ తేదీలోపు అడ్మిషన్లు చేసుకోవాలన్నారు. ఈ రెసిడెన్షియల్ కోర్సు మూడు నెలల పాటు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇతర వివరాలకు 9963561755 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. డీఆర్వో మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయ లక్ష్మి, అనుపమ, కలెక్టరేట్ ఏవో కులశేఖర్ తదితరులు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తామన్నారు.
చిత్తూరు నగరంలోని పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్న సీతారామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఎస్పీ మణికంఠ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, రాజశేఖర్ రాజు, డీఎస్పీ సాయినాథ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ.184లు ఉండగా, బ్రాయిలర్ స్కిన్ లెస్ కిలో రూ.210గా ఉంది. లేయర్ మాంసం కిలో రూ.178లకు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800 నుంచి 900 వరకు విక్రయిస్తున్నారు. మీ ప్రాంతాలలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
చిత్తూరు జిల్లా ప్రజలకు SP మణికంఠ చందోలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమిని చైత్రశుద్ధ నవమి రోజున ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. శ్రీరాముడు ధర్మానికి, న్యాయానికి ప్రతీక అని ఈ పండుగ మనకు ధర్మాన్ని ఆచరించాలనే సందేశం ఇస్తుందని SP అన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు వేడుకలు చేసుకోవాలని ఆయన సూచించారు.
గ్రూప్-2 పరీక్షలలో చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆదినారాయణ ఎంపికయ్యారు. విధి నిర్వహణలో చురుగ్గా పాల్గొంటూ.. అటు గ్రూప్-2లో ప్రతిభ చూపాడు. ఆయనను సీఐ రాంభూపాల్, ఎస్సై నాగేశ్వరరావుతో పాటు సహచర సిబ్బంది అభినందించారు.
SRపురం మండలం పాపిరెడ్డిపల్లెలో శ్రీనివాసులు (60)ను కొడుకు నాగరాజు బుధవారం హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తండ్రి తరచూ మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టేవాడు. అది సహించలేక నాగరాజు తండ్రి తలపై ఇటుకతో కొట్టాడు. తీవ్రంగా గాయపడి శ్రీనివాసులు మృతిచెందగా..మృతుని అన్న ఫిర్యాదుతో కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్సై సుమన్ నాగరాజుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
హుబ్లీ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహా కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ నియమితులయ్యారు. రాష్ట్ర శాసనసభ జనరల్ సెక్రటరీ సిఫార్సు మేరకు ఈ నియామకం చేసినట్లు నైరుతి రైల్వే డివిజనల్ మేనేజర్ అరవింద హెర్లె శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
Sorry, no posts matched your criteria.