EastGodavari

News October 27, 2024

తూ.గో: జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం

image

రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో బలహీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షాల ప్రభావం బుధవారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

News October 27, 2024

తూ.గో: TODAY HEADLINES

image

➣తూ.గో: బాధితుడికి మంత్రి లోకేశ్ హామీ
➣రాజానగరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
➣ఒక్క రోజులో ఆరు పుణ్యక్షేత్రాల సందర్శన: దుర్గేశ్
➣కాకినాడ: రెవెన్యూ అధికారిని సత్కరించిన కలెక్టర్
➣దేవీపట్నం: ‘రేపు అమ్మవారి దర్శనాలకు రావొద్దు’
➣రాజమండ్రి: ఆయుధాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన
➣పిఠాపురం: ‘కల్తీ నెయ్యిపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలి’
➣పెద్దాపురంలో అగ్ని ప్రమాదం.. మహిళ మృతి

News October 26, 2024

రాజమండ్రి: ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్పీ నరసింహ

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ స్మారకోత్సవాలలో భాగంగా రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ విద్యార్థులకు పోలీసు శాఖ వినియోగించే వివిధ ఆయుధాలు, అత్యాధునిక పరికరాలు, సాంకేతికత పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట సుబ్బరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

News October 26, 2024

తూ.గో: బాధితుడికి మంత్రి లోకేశ్ హామీ

image

తూ.గో.జిల్లా అనపర్తి మండలం మార్కండేయపురానికి చెందిన ప్రమీల అనే మహిళ పనికోసం కువైట్ వెళ్లింది. ఏజెంట్ మాటలు నమ్మి ఆమె వెళ్లగా వంటపని కాకుండా ఇతర పనులు చేయిస్తూ జీతం ఇవ్వట్లేదని ఆమె భర్త రాజాప్రసాద్ వాపోయారు. తన భార్యను స్వదేశానికి తీసుకురావాలని ఆయన మంత్రి లోకేశ్‌ను Xలో వేడుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానని ఎక్స్ ద్వారా లోకేశ్ హామీ ఇచ్చారు.

News October 26, 2024

రాజమండ్రి: ఆర్టీసీ బస్సులోనే కండక్టర్ మృతి

image

భీమవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్ కె.ఎస్.నారాయణ శుక్రవారం రాత్రి బస్సులోనే మృతి చెందారు. పెనుగొండ మండలం వడలి గ్రామంలోని శ్రీనివాస సర్వీసింగ్ సెంటర్ వద్దకు వచ్చేసరికి కండక్టర్ నారాయణకు గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఆయన కుటుంబం కొవ్వూరులో నివాసం ఉంటున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు.

News October 26, 2024

పి.గన్నవరంలో అత్యాచారం.. నిందితుడికి రిమాండ్

image

పి.గన్నవరం మండలంలోని లంకల గన్నవరంలో పక్షవాతం భారిన పడిన 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు సత్యనారాయణను శుక్రవారం అరెస్టు చేశామని సీఐ భీమరాజు తెలిపారు. అతన్ని రాజోలు కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది అన్నారు. దీంతో నిందితుడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించామని ఎస్సై శివకృష్ణ తెలిపారు.

News October 26, 2024

కొత్తపేట: యువతి కిడ్నాప్‌కు యత్నం

image

కొత్తపేట మండలం కోరుమిల్లికి చెందిన యువతిని అపహరించేందుకు ప్రయత్నించిన 10 మందిపై కేసు నమోదు చేశామని కొత్తపేట ఎస్సై సురేంద్ర శుక్రవారం తెలిపారు. కోరుమిల్లికి చెందిన వెంకటరత్నం ఈ నెల 20న తన కొడుకు, కూతుర్ని తీసుకుని ముక్కామల వెళ్లి వస్తుండగా కొత్తపేట సాయిబాబా గుడి వద్ద కోరుమిల్లికి చెందిన కృష్ణ, మరో 9 మంది యువతిని అపహరించేందుకు ప్రయత్నించారన్నారు. వెంకటరత్నం ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు.

News October 26, 2024

కాకినాడలో 28న జాబ్ మేళా

image

ఈనెల 28వ తేదీన కాకినాడలోని జిల్లా వికాస కార్యాలయం వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చరావు తెలిపారు. ఈ మేరకు కాకినాడలో ఆయన శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. పదవ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, బిటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాలలోపు అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులు అని తెలిపారు.

News October 26, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

*వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే, ఎంపీ
*ఆలమూరు: విద్యార్థిని మిస్సింగ్.. కేసు నమోదు
*తొండంగి: భర్త అనుమానస్పద మృతి.. భార్య, ప్రియుడు అరెస్టు
*రాజమండ్రి: జాబ్ మేళాలో 17 మందికి ఉద్యోగాలు
*పిఠాపురం: రైస్ మిల్లులో ప్రమాదం.. వ్యక్తి మృతి
*రేపటి నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం: మంత్రి దుర్గేశ్
*దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్
*పిఠాపురం: పట్టుబడిన 265 కిలోల జంతువుల కొవ్వు

News October 25, 2024

తొండంగి: భర్త అనుమానాస్పద మృతి.. భార్య, ప్రియుడు అరెస్టు

image

కాకినాడ జిల్లా తొండంగి మండలం AV నగరానికి చెందిన మధు(38) అనుమానాస్పద మృతి కేసులో శిరీష, ఆమె ప్రియుడు ప్రశాంత్‌ను ఎస్సై జగన్మోహన్రావు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. శిరీషకు10 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి కుమార్తె ఉంది. శిరీష ఆమె ప్రియుడు కలిసి మధును హత్య చేశారని చెప్పారు. గత శుక్రవారం మధు అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించి అంత్యక్రియలు జరిపారు. దీనిపై అనుమానాలు రావడంతో ఇద్దరిని అరెస్టు చేశారు.