EastGodavari

News September 7, 2024

పైలట్ ప్రాజెక్ట్‌గా పిఠాపురం

image

పర్యావరణహితంగా వినాయక చవితి చేపట్టాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 2 నెలల క్రితం ప్రత్యేకంగా మట్టివిగ్రహాల తయారీపై పలువురికి శిక్షణ ఇప్పించారు. కాగా 2 నెలల్లో 5 అడుగుల మట్టి వినాయక ప్రతిమలు 50, మూడు అడుగులవి 80 తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా శిక్షణ కేంద్రం ఏర్పాటుచేసి రాష్ట్రమంతటా విగ్రహాల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు.

News September 7, 2024

ఖైరతాబాద్ గణేష్ తయారీలో మన కాకినాడ వాసులు

image

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ భారీ వినాయకుడి విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దేది కాజులూరు మండలం గొల్లపాలెంకి చెందిన ‘సత్యఆర్ట్స్’ సభ్యులే. 20 ఏళ్లుగా ఖైరతాబాద్ వినాయకుడికి రంగులు వేసే పనిని వీరే చూస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాగణపతి అవతారంలో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సత్యఆర్ట్స్ బృందం 15 రోజులు శ్రమించి రంగులు దిద్ది పని పూర్తిచేశారు.

News September 7, 2024

పంచరామ క్షేత్రంలో 7 నుంచి గణపతి నవరాత్రులు

image

కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్ర భీమేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 7 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడో తేదీన ఉదయం 8:30 గంటలకు మహాగణపతి స్వామికి ప్రత్యేక హోమ పూజలు, కలశ పూజలు నిర్వహిస్తామని అన్నారు. స్వామి వారి గ్రామోత్సవం, తదితర ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈవో నీలకంఠం కోరారు.

News September 6, 2024

లవ్ మ్యారేజ్ చేసుకొని కట్నం కోసం వేధింపులు

image

మామిడికుదురు మండలం నగరంలో నివాసముంటున్న రేణుక ఫిర్యాదు మేరకు ఆమె భర్త భానుప్రసాద్, మామ సత్యనారాయణ, అత్త మణికుమార్‌తో పాటు మరో ఏడుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామని ఎస్సై చైతన్యకుమార్ శుక్రవారం తెలిపారు. పి.గన్నవరం మండలం నాగుల్లంకకు చెందిన రేణుకకు, అదే గ్రామానికి చెందిన భానుప్రసాద్‌తో 2021లో ప్రేమ వివాహం జరిగిందన్నారు. వివాహం ఇష్టం లేని అత్త, మామ భర్తతో కలిసి వేధిస్తున్నట్లు తెలిపారు.

News September 6, 2024

తాగుడుకు బానిసైన భర్త.. భార్య తిట్టిందని సూసైడ్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మెర్ల సత్తయ్య(53) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన సత్తయ్య రోజూ తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. కోపంతో గురువారం పురుగు మందు తాగిన సత్తయ్య.. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై తెలుపారు.

News September 6, 2024

ఘోరం: బైకు-ట్రాక్టర్ ఢీ.. తెగిపడిన యువకుడి చేయి

image

తూ.గో జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెంలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బైక్, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి శరీరం నుంచి చేయి తెగిపోయి దూరంగా పడింది. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2024

రాజమండ్రిలో యాక్సిడెంట్.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి

image

రాజమండ్రిలోని దివాన్ చెరువు వైపునకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లాకు చెందిన కార్తీక్ (19)గా గుర్తించారు. మృతులు గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 6, 2024

కాకినాడ: ఇద్దరు యువకులు అనుమానాస్పద మృతి

image

కాకినాడ జిల్లా కరప మండల సమీపంలోని కోళ్లఫారం ఫారం షెడ్డులో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. పెదపూడి మండలం అచ్యుతాపురానికి చెందిన కిషోర్, విశాక్ ఉరేసుకొని ఉన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కరప పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 6, 2024

వరద బాధితులకు MLA బత్తుల రూ.25 లక్షల విరాళం

image

విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. కృష్ణా జిల్లాలో వచ్చిన వరదల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకుంటారని పేర్కొన్నారు.

News September 6, 2024

పిఠాపురంలో జిల్లా కోర్టు నూతన భవనం ప్రారంభం

image

పిఠాపురంలో జిల్లా కోర్టు నూతన భవనాన్ని ప్రారంభించారు. వర్చువల్ విధానంలో హైకోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ శిలాఫలకం ఆవిష్కరించారు. కోర్టు సమూహాన్ని జిల్లా జడ్జి గంధం సునీత ప్రారంభించారు. సర్వమత గురువులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కోర్టు హాల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.