India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్ ఐఏఎస్ అధికారిగా ప్రవీణ్ కుమార్‌ను తూ.గో.జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం కేటాయించింది. జోనల్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ జైన్‌ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. ఈ మేరకు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు కోర్టు ఇచ్చిన బెయిల్ గడువు నిన్న సాయంత్రం 5గంటలతో ముగిసింది. మరో గ్రేస్ పీరియడ్‌తో జైలు అధికారులు ఎదురుచూసినా అనిల్ రాకపోవడం గమనార్హం. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
తూ.గో.జిల్లా ఇవాళ వేడెక్కనున్నది. ముఖ్యంగా భానుడు తన ప్రతాపాన్ని జిల్లాలోని సీతానగరం 38.6, తాళ్లపూడి 38.5, గోపాలపురం 38.4, గోకవరం 38.3, కోరుకొండ 38.3, రాజమండ్రి 37.9, రాజానగరం 37.5, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కాబట్టి వృద్ధులు, పిల్లలు జాగ్రతగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రాజానగరం నియోజకవర్గ మండలం ప్రధాన కేంద్రమైన కోరుకొండలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో వైకుంట ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాత్రి పూట విద్యుత్ దీపా అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు ఈ గిరి ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
రాజానగరం హైవేని ఆనుకుని ఉన్న బ్రిడ్జ్ కౌంటీలోని ఒక విల్లాలో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాజానగరం పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 12మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 26 మొబైల్స్, 7 ల్యాప్‌ట్యాప్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీపై ఈ బెట్టింగ్స్ జరిగాయి.
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఇకపై ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటన విడుదల చశారు. ఈ మేరకు గతంలో మాదిరిగానే ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలియచేశారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఈ పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎత్తైన గిరిపై కొలువై ఉంది. ఇది రాజమండ్రికి 20 కిలోమీటర్ల దగ్గర్లో ఉంటుంది. నరసింహస్వామిని దర్శించుకోవటానికి నడకమార్గంలో సుమారు 615 మెట్లు ఎక్కాలి. చుట్టూ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్లారా.. కామెంట్ చేయండి.
రాగితీగలు, BSNLకు చెందిన వస్తువులు చోరీ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు చిన్న బజార్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇటీవల జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేయగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాంతానికి చెందిన రమణయ్య, దుర్గారావు, సింహాద్రి, నరసయ్యను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆటో ఢీకొని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజమండ్రిలోని స్వరూప్ నగర్‌కు చెందిన విశ్రాంత ఏఆర్ SI త్రిమూర్తులు (65) శనివారం మృతిచెందాడు. బొమ్మూరు ఎస్ఐ ప్రియకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆయన స్కూటీపై వెళుతుండగా శ్రీరామ్‌పురం ఫారెస్టు రోడ్డులో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన త్రిమూర్తులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు.
మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో గోకవరం(M) రాంపయర్రంపాలెం గ్రామానికి చెందిన రాయుడు శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. రాజమండ్రి కోర్టులో శుక్రవారం హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, ప్రేమ పెళ్లి పేరుతో మైనర్ బాలికను అపహరించినట్లు తేలడంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.