EastGodavari

News March 6, 2025

రాజమండ్రి: రెవెన్యూ విభాగ సిబ్బందితో కమిషనర్ సమావేశం

image

రాజమండ్రి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నేడు రెవెన్యూ విభాగ సిబ్బందితో కమిషనర్ కేతన్ గర్గ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. 2024-2025 సంవత్సరానికి గాను నగర ప్రజలు ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి ఛార్జీల బకాయిలను వచ్చే వారంలోపు 100% వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News March 5, 2025

గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు ఆపాలని ధర్నా

image

గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ళ రాజు, ప్రగశీల కార్మిక సమాఖ్య (పికేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ కే మస్తాన్‌ ఆధ్వర్యంలో బొమ్మూరు కలెక్టరేట్‌ వద్ద ఇసుక కార్మికులతో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ ప్రశాంతికి వినతి పత్రం అందచేశారు.

News March 5, 2025

తూ.గో: ఈనెల 11న బహిరంగా వేలం

image

వివిధ 6A కేసులలో సీజ్ చేసిన 47.274 టన్నుల PDS బియ్యాన్ని ఈనెల 11వ తేదీన గోపాలపురంలోని MLS పాయింట్ వద్ద బహిరంగా వేలం వేయటం జరుగుతుందని తూ.గో JC చిన్నరాముడు ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు ముందుగా రూ.2 లక్షల ధరావత్తును జేసీ పేరునా డీడీ రూపంలో చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. కేజీ బియ్యానికి ప్రభుత్వం పాట రూ.30 అని చెప్పారు.

News March 5, 2025

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఉన్న 15 న్యాయస్థానాలలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజమండ్రి కేంద్రంగా ప్రకటించారు. రాజీమార్గమే రాజమార్గమని ఈ మేరకు జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగ్గ నేరాలలో విముక్తి పొందాలని సూచించారు.

News March 5, 2025

ఏలూరు: 1000 ఓట్లు కూడా దాటని ఎమ్మెల్సీ అభ్యర్థులు

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థులలో చాలా మందికి మూడంకెల స్కోరు కూడా దాటలేదు. మరికొందరికైతే 100 లోపు ఓట్లే పడ్డాయి. వేణుగోపాలకృష్ణకు 1017 ఓట్లు, హేమ కుమారికి 956, వానపల్లి శివ గణేష్ 772, అసన్ షరీఫ్ 759, బండారు రామ్మోహన్ 709, చిక్కాల దుర్గాప్రసాద్ 665, కాట్రు నాగబాబు 565 ఇలా చాలా మంది అభ్యర్థులు 1000 మార్క్ కూడా టచ్ చేయలేకపోయారు.

News March 5, 2025

పిడింగొయ్యి: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

పిడింగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 సంవత్సరాల వ్యక్తి మృతదేహాం ఉందని వీఆర్‌వో అప్పలనాయుడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హండ్రెడ్‌ఫీట్‌రోడ్డులో కల్వర్టు పక్కన గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బొమ్మూరు ఎస్సై సీహెచ్‌వి.రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 5, 2025

రాజమండ్రి: బోటింగ్, నది విహారం కార్యక్రమాలు నిర్వహణ

image

తూ.గో జిల్లా పరిధిలో చేపల వేట ద్వారా జీవనోధారంతో పాటు, పర్యటక అభివృద్ది పరంగా బోటింగ్, నది విహారం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. వీటికి సంబంధించిన నియమనిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో టూరిజం ఇన్‌ఛార్జ్ ప్రాంతీయ సంచాలకులు పవన్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.

News March 4, 2025

తూ.గో: ఇంటర్ పరీక్షకు 23,655 మంది విద్యార్థుల హాజరు

image

తూ.గో జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్-1 పరీక్షకు 23,655 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్‌ఐఓ ఎల్ నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 51 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించగా జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 795 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆర్‌ఐఓ, డీవీఈఓ, ఫ్లయింగ్, సెన్సింగ్ స్క్వాడ్లు, కస్టోడియన్లు ఈ పరీక్షలను పర్యవేక్షించారన్నారు.

News March 4, 2025

జర్మనీలో తూ.గో. మంత్రికి ఘన స్వాగతం

image

జర్మనీ డి బెర్లిన్ ఎక్స్‌పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు జర్మనీలో జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పర్యటక రంగంలో పెట్టుబడులు కోసం ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది. మంత్రితో పాటు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పాల్గొంటారు.

News March 4, 2025

MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ..!

image

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

error: Content is protected !!