EastGodavari

News October 9, 2024

రాజనగరం: లారీ ఢీకొని లీగల్ పారా వాలంటీర్ మృతి

image

జాతీయ రహదారిపై ఆటోనగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరొక మహిళ గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. లీగల్ పారా వాలంటీర్‌గా పనిచేస్తున్న రాజమండ్రికి చెందిన పెనుగుల బేబీ ప్రశాంతి (50), జీఎస్ఎల్ ఆసుపత్రిలో పని చేస్తున్న ఆకుమర్తి సత్యవతి స్కూటీపై రాజానగరం నుంచి రాజమండ్రి ఇద్దరూ కలిసి వెళ్తుండగా వెనకనుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రశాంతి అక్కడిక్కడే మృతి చెందిందని తెలిపారు.

News October 9, 2024

రాజానగరం: భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం

image

రాజానగరం మండలం భూపాలపట్నంలో ఓ బర్త్ డే పార్టీలో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం ఓ ఫంక్షన్ హాల్ వద్ద జరుగుతున్న బర్త్ డే ఫంక్షన్‌లో పాల్గొన్న ముగ్గురు యువకులు కారులో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. యువకులకు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్న కోణంలో కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.

News October 9, 2024

తూ.గో: దసరాకు 16 ప్రత్యేక రైళ్లు

image

దసరాకు విజయవాడ-శ్రీకాకుళం, శ్రీకాకుళం-విజయవాడకు 16 ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ మంగళవారం తెలిపారు. విజయవాడ-శ్రీకాకుళానికి ఈ నెల 9, 10,11,12,14,15,16,17 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. శ్రీకాకుళం-విజయవాడకు ఈ నెల 10,11,12,13,15,16,17,18 తేదీల్లో ప్రత్యేక రైలు తిరుగుతుందన్నారు. ఈ రైళ్లు నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, ద్వారపూడి స్టేషన్లో నిలుస్తాయన్నారు.

News October 9, 2024

తూ.గో: ఇన్‌స్టాలో పరిచయమై ఇంట్లో చెప్పకుండా వెళ్లారు..

image

దసరా సెలవులకు విశాఖకు వెళ్లి సరదాగా గడపాలనుకొన్న నలుగురు బాలికలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. రాజమండ్రి, రావులపాలేనికి చెందిన వారికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అందరూ మాట్లాడుకొని విశాఖకు బయలుదేరగా రాజమండ్రిలో షీ టీమ్స్ బాలికలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

News October 9, 2024

పిఠాపురం అత్యాచార ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు

image

పిఠాపురం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. కిడ్నాప్ సహ ఆరు సెక్షన్‌ల కింద పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.‌ బాధిత బాలిక మేనత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై విపక్ష నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

News October 9, 2024

తూ.గో జిల్లాలో TODAY TOP NEWS

image

➣ తూ.గో. పుష్కరాలకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపు
➣ ఎమ్మెల్యేలు దోచుకునేందుకే కొత్త మద్యం పాలసీ: భరత్
➣ తూ.గో: నేటి నుంచి ప్రత్యేక రైళ్లు..
➣ పిఠాపురంలో మద్యం తాగించి బాలికపై అత్యాచారం
➣ చేనేత పరిశ్రమ అభివృద్ధిపై సీఎంతో చర్చించిన ఎంపీ తంగేళ్ల
➣ పిఠాపురం బాలిక అత్యాచార నిందితుడిపై పోక్సో కేసు

News October 8, 2024

తూ.గో.జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపు

image

2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.100 కోట్ల నిధులను కేటాయించిందని టూరిజం అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాట్లకు, రాజమండ్రి నగరాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ దిశగా సంబంధిత అధికారులు పనులు ప్రారంభించారు.

News October 8, 2024

పిఠాపురంలో బాలికపై అత్యాచారం.. YCP ట్వీట్

image

పిఠాపురంలో జరిగిన బాలిక అత్యాచార ఘటనపై YCP ‘X’ వేదికగా స్పందించింది. ‘దళిత బాలిక‌కు మాయమాటలు చెప్పి ఆటో‌లో తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆటోలో తరలించేందుకు యత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకి రక్షణ కరవైంది. సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ?’అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేసింది.

News October 8, 2024

తూ.గో: నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఎప్పటివరకంటే?

image

శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని జిల్లా మీదుగా మంగళవారం నుంచి ఈ నెల 12 వరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ సోమవారం తెలిపింది. ఈ నెల 8,10,12 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్, 9, 11 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ రాకపోకలు సాగిస్తుందని చెప్పారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 8, 2024

పిఠాపురంలో మద్యం తాగించి బాలికపై అత్యాచారం

image

పిఠాపురంలో బాలికపై అత్యాచారం జరిగింది. కుటుంబీకుల వివరాలు.. స్టువర్టుపేటలో ఓ బాలిక నడిచివెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగినట్లు నటించి ఆటోలో మాధవపురం డంపింగ్ యార్డ్ తీసుకెళ్లారు. కాసేపయ్యాక ఆమెను ఆటోలో ఎక్కిస్తుండగా ఓ మహిళ చూసి నిలదీసింది. బాలిక బంధువులకు ఫోన్ చేయగా అక్కడికి చేరుకొన్నారు. మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదుచేయగా CI శ్రీనివాస్, SI మణికుమార్ కేసు నమోదుచేశారు.