EastGodavari

News July 23, 2024

కేంద్ర బడ్జెట్ ఆశాజనకం: ఎంపీ ఉదయ్

image

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజనకంగా ఉందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించడం, పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తికి నిధులు కల్పించడం సంతోషకరమన్నారు.

News July 23, 2024

కోనసీమ: వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సెలవు

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరదలకు సంబంధించి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో బుధవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వరద ప్రభావం లేని ప్రాంతాలలో విద్యాసంస్థలు యథావిధిగా నిర్వహించబడతాయన్నారు.

News July 23, 2024

కోనసీమ: 52 ఏళ్ల మహిళపై అత్యాచారయత్నం

image

మామిడికుదురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(52)పై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు గెడ్డం సత్యనారాయణమూర్తిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని నగరం SI సురేష్ తెలిపారు. వరుసకి మరిది అయిన నిందితుడు బాధితురాలు వంట గదిలో ఒంటరిగా ఉండగా అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నారు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయగా పరారయ్యాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుణ్ని అరెస్ట్ చేశామన్నారు.

News July 23, 2024

కోనసీమ: పీత శరీరంపై నరసింహస్వామి ముఖ కవళికలు

image

సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామానికి చెందిన కాగితం కృష్ణ మంగళవారం పీతలు కొనుక్కొని ఇంటికెళ్లాడు. కాగా ఓ పీత శరీరంపై నరసింహ అవతారంలో ముఖం గుర్తులు కనిపించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విషయం గ్రామస్థులకు తెలియడంతో పలువురు దానిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

News July 23, 2024

సఖినేటిపల్లిలో మునక్కాయ పొడవు 4 అడుగులు

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో రైతు చెల్లుబోయిన సత్యనారాయణ పెరట్లో మునగ చెట్టుకు కాచిన జంబో మునక్కాయ అబ్బుర పరుస్తోంది. హైబ్రిడ్ మొక్కకు కాచిన మునక్కాయ సుమారు 4 అడుగులు వరకు పెరగటం విశేషం. ఇంత పొడవు మునక్కాయ గతంలో ఎక్కడా చూడలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

News July 23, 2024

తూ.గో జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..!

image

గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని మంగళవారం అధికారులు తెలిపారు. గోకవరంలో అత్యధికంగా 21.6 మిల్లీ మీటర్లు, ఉండ్రాజవరంలో 0.8mm అత్యల్ప వర్షపాతం నమోదయిందన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ లో 9.2, తాళ్లపూడి 9.0, బిక్కవోలు 7.6, కొవ్వూరు 6.0, కడియం 5.2, రాజానగరం 4.8, అనపర్తి 4.8, కోరుకొండ 4.4, రంగంపేట 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది అని తెలిపారు.

News July 23, 2024

గోదావరి వరదలపై కలెక్టర్ మండల అధికారులతో సమీక్ష

image

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News July 23, 2024

స్పెషల్ ఆఫీసర్ల నియామకం: కోనసీమ కలెక్టర్

image

కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాలకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వరద పెరుగుతున్న దృష్ట్యా కొత్తపేట ఆర్డీవో కార్యాలయంలో సహాయం నిమిత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏ సమస్య ఉత్పన్నమైనా 08855-244299 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ఆర్డీవో కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.

News July 22, 2024

కోనసీమ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురంలోని కలెక్టరేట్‌ నుంచి సోమవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, వాగులు, చెరువుల వైపు వెళ్లనివ్వొద్దని కలెక్టర్ సూచించారు. SHARE IT..

News July 22, 2024

హృదయవిదారకరం.. డెడ్‌బాడీతో బైక్‌పై 5KM

image

రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం మిర్యాలవీధికి చెందిన అన్నపూర్ణ అనారోగ్యంతో జడ్డంగి PHCలో సోమవారం మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు. ఆమె కుటుంబీకులు అందుబాటులో లేకపోవడంతో గ్రామ యువకులు డెడ్‌బాడీని బైక్‌పై 5కిమీ దూరంలో ఉన్న స్వగ్రామానికి తీసుకెళ్లారు. నిరుపేద కుటుంబానికి చెందిన అన్నపూర్ణ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనాల వారు ముందుకు రాకపోవడంతో ఇలా చేసినట్లు యువకులు తెలిపారు.