India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాఖీ పండుగ సందర్భంగా రాజమండ్రికి విచ్చేసిన మాజీ హోం మంత్రి తానేటి వనిత శనివారం ఎయిర్పోర్ట్లో పోలీసు, సీఐఎస్ఎఫ్ అధికారులకు ఆప్యాయంగా రాఖీలు కట్టారు. శ్రావణ మాసంలో సోదర, సోదరీమణుల అనుబంధాన్ని రాఖీ పౌర్ణమి గుర్తు చేస్తుందని ఆమె అన్నారు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కొవ్వూరు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెరవలి మండలం కానూరు అగ్రహారానికి చెందిన దవులూరి సుబ్రహ్మణ్యం (44), లంకే ప్రసాద్ (26) మృతి చెందారు. కడియపులంకలో పనికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా విజ్జేశ్వరం-సీతంపేట వద్ద వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. మృతదేహాలను కొవ్వూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేశ్ ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
నాటు తుపాకులు, లైసెన్స్ లేని మారణాయుధాలు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా అటువంటి ఆయుధాలు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా కలిగి ఉన్న తుపాకులను వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఆయన సూచించారు. లేని పక్షంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
చిన్న వయసులో తల్లి దండ్రులను కోల్పోయిన రాజానగరం మండలం, నందరాడ గ్రామానికి చెందిన మేడిశెట్టి నీరజ, MSc (Zoology) పూర్తి చేసి డెహ్రాడూన్లో GATE కోచింగ్ చేయాలనే కలతో ఉన్నారు. ఆమె అన్న హరికృష్ణ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితిని పీజీఆర్ఎస్ ద్వారా తెలుసుకున్న కలెక్టర్ పి. ప్రశాంతి వెంటనే స్పందించారు. ఆమెకు డెహ్రాడూన్లో కోచింగ్ కోసం రూ.40,000 చెక్కును అందజేశారు
గోకవరం మండలంలోని కామరాజుపేటకు చెందిన రాంబాబు కుటుంబం బైక్పై రాజమండ్రి నుంచి తిరిగి వస్తుండగా బావజీపేట–వీరలంకపల్లి మధ్య ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడగా, కుమార్తె వెంకట దుర్గా తీవ్రంగా గాయపడి మృతి చెందింది. వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాటు తుపాకులు, లైసెన్సు లేని ఆయుధాలు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి. నరసింహాకిషోర్ హెచ్చరించారు. ఎవరూ ఇటువంటి ఆయుధాలు వాడరాదని, ఎవరైనా పట్టుబడితే ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి. ప్రశాంతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజమండ్రిలో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆమె తెలిపారు. 2026 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను అనుసరించి, వారికి సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అసాంఘిక కార్యకలాపాలను అణిచివేసేందుకు మంగళవారం తూ.గో జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జోనల్ డీఎస్పీలు, సిబ్బంది టీములుగా ఏర్పడి తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల నాటు సారా, నంబర్, రికార్డులు లేని 193 ద్విచక్ర వాహనాలనుస్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నరసింహకిశోర్ హెచ్చరించారు.
అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం జీవో నంబర్ 134 ద్వారా అవకాశం కల్పించిందని కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి తెలిపారు. అనధికార లేఅవుట్లలో జూన్ 30, 2025 నాటికి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకు సులభతరంగా స్వీయ ధ్రువీకరణ అంగీకార పత్రం సమర్పించి భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉందన్నారు.
ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ తన కార్యాలయంలో మాట్లాడారు. 2029 నాటికి పేదరిక నిర్మూలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
Sorry, no posts matched your criteria.