India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గురువారం 2.19 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 12,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.20 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తెలంగాణకు (హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి) చెందిన రంజిత్ రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనికి కుదిరాడు. అక్కడే పనిచేస్తున్న సీతానగరం మండలం చిన్నకొండపూడికి చెందిన చంద్రకళతో 2011లో పరిచయం ఏర్పడింది. 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జులై 9న ఇంటికి వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో చంద్రకళ అబ్బాయి ఇంటికెళ్లి ప్రశ్నించగా కుటుంబీకులు మభ్యపెడుతూ వస్తున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
తూ.గో. జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన ఓ అమ్మాయి అనారోగ్యానికి గురవడంతో ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ వైద్య సహాయం అందించారు. బుర్రిలంకలో ఉన్న ‘హర్షదీప్ మొక్కల కుండీల సంస్థ’లో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజ్ కుమార్ పాండే కుమార్తె ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఈ విషయం నాయకులు ద్వారా బాలకృష్ణకు చేరడంతో ఆయన హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు సిఫార్సు చేశారు
రష్యాలో ఎత్తైన ఎల్‌బ్రస్ శిఖరాన్ని కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి ఎస్.భరణి అధిరోహించారు. ఈ సందర్భంగా ఆమె శిఖరాన్ని అధిరోహించిన తర్వాత సగర్వంగా మన దేశ మువ్వన్నెల జెండాను ఎగురవేసి అభివాదం చేశారు. గత కొన్నేళ్లుగా భరణి పర్వతారోహకురాలుగా కీర్తి గడించారు. గతేడాది కిలిమంజారో శిఖరం ఎక్కారు.
78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ఉపాధ్యాయుడు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సామర్లకోట అయోధ్య రామాపురంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ అంకెలతో మ్యాజిక్ స్క్వేర్ రూపొందించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటు నుంచి యాడ్ చేసినా మొత్తం 78 వచ్చేలా దానిని రూపొందించారు.
రాజమహేంద్రవరానికి చెందిన బీటెక్ విద్యార్థి నూజెండ్ల శశాంక్ (20) మంగళగిరి మండలంలోని ప్రైవేట్ యూనివర్సిటీలో బుధవారం ఉరి వేసుకుని మృతి చెందాడు. మంగళగిరి గ్రామీణ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలో శశాంక్ సీఎస్ఈ విభాగంలో రెండో ఏడాది చదువుతున్నాడు. మొదటి సంవత్సరం ఫలితాలలో బ్యాక్ లాగ్ ఉండటంతో వసతి గృహంలోని తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
కాకినాడ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. అనకాపల్లి వ్యక్తికి కాకినాడ జిల్లా కిర్లంపూడి మహిళతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె ఉంది. ఉపాధి కోసం భార్య వేరే ప్రాంతంలో ఉండగా.. భర్త, కుమార్తె అనకాపల్లిలో ఉంటున్నారు. తండ్రి తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో కిర్లంపూడిలోని అమ్మమ్మ ఇంటికి కుమార్తె వచ్చేసింది. అయినా తండ్రి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పొక్సో కేసు నమోదైంది.
రాష్ట్ర ప్రజానీకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పొందడానికి ప్రాణాలర్పించిన మహనీయులు అందరిని స్మరించుకోవాలన్నారు. వారి త్యాగాల పునాదులపై దేశ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన పండుగలా నిర్వహించికుందామని పిలుపునిచ్చారు. కాకినాడలో గురువారం మువ్వన్నెల జెండాను ఎగరవేయనున్నారు.
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 4 సంవత్సరాల బీఎస్సీ(హానర్స్) కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుంతో ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.angrau.ac.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
ఇది మాములు సూసైడ్ కాదు. చాలా ఘోరం. కాకినాడ జిల్లాకు కరపకు చెందిన ఇంజరపు సత్యనారాయణ(52) స్థానికంగా వెల్డింగ్ వ్యాపారం చేస్తున్నాడు. షాపు నడపటం కష్టతరంగా మారింది. పనులు రాకపోగా అప్పులు పెరిగిపోయాయి. వీటిని తీర్చలేనని కుమిలిపోయాడు. బాధలు తట్టుకోలేక తన షాపులోనే ఉన్న చిన్న ఇనుము కణతులను మింగేశాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చనిపోయాడు.
Sorry, no posts matched your criteria.