EastGodavari

News July 14, 2024

కోనసీమ: 2 రోజులకు రిజర్వాయర్‌లో తేలిన డెడ్‌బాడీ

image

మోతుగూడెం పవర్ కెనాల్‌లో <<13618391>>గల్లంతైన యువకుడు<<>> ఆదివారం శవమై దొరికాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరుకు చెందిన మురళీకృష్ణ(24) ఫ్రెండ్స్‌తో మోతుగూడెం వెళ్లాడు. పుష్ప బ్రిడ్జి వద్ద అతడు నీటిలో గల్లంతు కాగా ఫ్రెండ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. SI గోపాలరావు ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా ఫోర్ బై రిజర్వాయర్‌లో మురళి డెడ్‌బాడీ లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం బాడీని బంధువులకు అప్పగిస్తామన్నారు.

News July 14, 2024

అనిల్ అంబానీ, సంజయ్ దత్‌తో పవన్ కళ్యాణ్

image

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లికి డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీతో పవన్ చర్చించారు. సంబంధిత ఫొటోలను జనసేన ‘X’లో పోస్ట్ చేసింది.

News July 14, 2024

తూ.గో.: చెట్టుపడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

తూ.గో. జిల్లా పెరవలి మండలం ఖండవల్లి హైవేపై శనివారం చెట్టు పడి చాగల్లుకు చెందిన యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మల్లుల కువలేశ్ (25) మృత్యువాత పడ్డాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కువలేశ్ తల్లితండ్రులు సత్యనారాయణ, ధనలక్ష్మిని చూసేందుకు వారం రోజుల క్రితం సొంతూరు వచ్చాడు. ఇరగవరం మండలం పేకేరులోని అమ్మమ్మ తులసమ్మను చూసేందుకు వెళ్లి బైక్ పై తిరిగి వస్తుండగా హైవే పక్కన ఉన్న చెట్టు అతనిపై పడి మృతిచెందాడు.

News July 13, 2024

ఉమ్మడి తూ.గో జిల్లా నూతన ఎస్పీలు వీరే

image

☞ తూ.గో జిల్లా ఎస్పీ పి.జగదీశ్ బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో టీటీడీ CVSOగా ఉన్న డి.నరసింహ కిషోర్ ఎస్పీగా రానున్నారు.
☞ కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎస్పీ సతీష్ కుమార్ బదిలీపై గుంటూరుకు వెళ్లనున్నారు.
☞ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో బి.కృష్ణారావు ఎస్పీగా రానున్నారు.

News July 13, 2024

పిఠాపురంలో ఛత్తీస్‌గడ్ ప్రాజెక్ట్.. ఎలా చేస్తారంటే.??

image

పిఠాపురంలో ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణ<<13618937>> ప్రాజెక్ట్<<>> ఏర్పాటుచేయనున్న విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గంలో ఇళ్లు, దుకాణాలు, వ్యాపార, వాణిజ్యసంస్థల నుంచి నిత్యం చెత్త సేకరిస్తారు. అయితే ఇళ్లకు రూ.3, వ్యాపార సంస్థలకు రూ.5, ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.20 వసూలు చేస్తారు. నెలకు రూ.3కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. వీటితో చెత్త తరలింపునకు రిక్షాలు, ఇతర పనిముట్లు కొనుగోలు చేస్తారు. 150మందికి ఉపాధి లభించనుంది.

News July 13, 2024

తూ.గో.: ఈ నెల 18న పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండో సంవత్సరం డిప్లమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ చేపట్టనున్నట్లు కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జనార్దనరావు తెలిపారు. ఐవీసీ ఇంటర్ ఉత్తీర్ణత సాధించినవారు 16వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. 18న ప్రవేశాలు ఉంటాయన్నారు.

News July 13, 2024

పిఠాపురంపై స్పెషల్ ఫోకస్.. ఛత్తీస్‌ఘడ్‌ ప్రాజెక్ట్ ఇక్కడికి

image

ఛత్తీస్‌ఘడ్‌లో విజయవంతంగా అమలవుతున్న ఘన, ధ్రవ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో తొలుత పిఠాపురం నుంచే ప్రారంభించనున్నారు. ఈ నియోజకవర్గంలో గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి మండలాలు ఉండగా, 52 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ఉత్పత్తి అయిన చెత్తను సేకరించి అందులో ప్లాస్టిక్ వస్తువులను వేరుచేసి ‘రీసైక్లింగ్’కి విక్రయిస్తారు. ఇక తడిచెత్తతో తయారైన ఎరువును అటవీ నర్సరీలకు సరఫరా చేస్తారు.

News July 13, 2024

జాతీయస్థాయిలో మండపేట విద్యార్థి ప్రతిభ

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఆర్తమూరుకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి గుమ్మిడి అనిల్ కుమార్ తనయుడు గుమ్మడి ధీరజ్ జాతీయస్థాయి పరీక్షలో ఆల్‌ఇండియా ర్యాంక్ సాధించాడు. పదో తరగతి తర్వాత NTA శ్రేష్ట- 2024 పరీక్షలో ఆల్ ఇండియాలో 1330 ర్యాంక్ సాధించి, పఠాన్ కోట్‌లో సీటు పొందాడు. ఈ మేరకు విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.

News July 12, 2024

అమలాపురం: 10th అమ్మాయికి వేధింపులు.. వ్యక్తి అరెస్ట్

image

అమలాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 10వ తరగతి బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిషోర్ శుక్రవారం తెలిపారు. ఫిర్యాదు అందిన 36 గంటల్లో నిందితుడిని పట్టుకుని అమలాపురం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించిందని తెలిపారు. అతడిని కొత్తపేట జైలుకి పంపామన్నారు.

News July 12, 2024

కాకినాడ: రాయితీపై కందిపుప్పు, బియ్యం సరఫరా

image

కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కంది పప్పు, బియ్యం విక్రయాలను ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు.వైసిపి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఊరట కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ ఓ ప్రసాద్ పాల్గొన్నారు.