Guntur

News May 15, 2024

చిలకలూరిపేట: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

image

చిలకలూరిపేట బస్సు ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం నీలాయిపాలెంకు చెందిన ఉప్పుగుండూరు కాశీ (65), లక్ష్మి (55), చిన్నారి సాయిశ్రీలు(8) మృతి చెందారు. ఒకేసారి కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

News May 15, 2024

చిలకలూరిపేట: బస్సులోనే మృతదేహాలు

image

చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద బస్సును టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బస్సులో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి అస్తిపంజరాల స్థితిలో ఉన్నట్లు సమాచారం. వైద్యులు వచ్చి పంచనామా నిర్వహించిన అనంతరం వాటిని ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఘటనాస్థలిని ఎస్పీ పరిశీలించారు. ఐజీ కూడా ప్రమాద స్థలానికి రానున్నట్లు తెలుస్తోంది.

News May 15, 2024

గుంటూరు: ఈవీఎంల స్ట్రాంగ్ రూములకు సీల్

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూములకు మంగళవారం అధికారుల సమక్షంలో సీలు వేశారు. పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు నీరజ్ కుమార్, కార్తిక, ఆర్వోలు కీర్తి చేకూరి రాజ్యలక్ష్మి తదితరుల సమక్షంలో సీల్ వేశారు.

News May 15, 2024

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎన్నికల అధికారి లోతేటి శివశంకర్‌కు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.

News May 14, 2024

వేమూరు మండలంలో రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి

image

మండలం పరిధిలోని బూతుమల్లి వద్ద రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్ళితే బూతుమల్లికి చెందిన గోగినేని వెంకటేశ్వరరావు(58) ప్రమాదవశాత్తు తెనాలి నుంచి రేపల్లె వెళ్లే రైలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యా కుమారుడు ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 14, 2024

మహిళలంతా సీఎం జగన్‌కే ఓటు వేశారు: అంబటి

image

జగన్‌ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారన్నారు. పోలింగ్‌ శాతం పెరగడం అంటే అది పాజిటివ్‌ ఓటింగ్‌ అని, మహిళా సాధికారత కోసం జగన్‌ కృషి చేశారన్నారు. మహిళలంతా సీఎం జగన్‌కే ఓటు వేశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించిందని అంబటి అన్నారు.

News May 14, 2024

తెనాలి ఘటన.. సుధాకర్‌కు జీజీహెచ్‌లో చికిత్స

image

నిన్న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తెనాలి ఘటనలో ఓటరు సుధాకర్‌కు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే ఇతడిని కొట్టడం, తిరిగి ఇతను ఎమ్మెల్యేను కొట్టడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా, సుధాకర్ సివిల్ ఇంజినీర్. హైదరాబాద్, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేసి.. ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్నారు. ఓటు వేయడానికి ఆయన సోమవారం బెంగళూరు నుంచి వచ్చినట్లు తెలిసింది.

News May 14, 2024

మాదలలో ఇరువర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులు

image

ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి వరకు వైసీపీ, టీడీపీ వర్గాలు దాడులకు దిగాయి. పోలింగ్ బూత్‌లో నెలకొన్న వివాదంతో పోలింగ్ ముగిశాక ఇరు వర్గాలు పెట్రోల్ బాంబులతో ఘర్షణకు దిగాయి. ఇరు వర్గాలు సోడాసీసాలు, రాళ్లు రువ్వుకుంటూ గ్రామంలో అలజడి సృష్టించాయి. ఈ క్రమంలో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

News May 14, 2024

పెదకాకాని: స్ట్రాంగ్ రూములకు ఈవీఎంల తరలింపు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. సోమవారం రాత్రి భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పోలింగ్ సిబ్బంది నుంచి ఈవీఎంలను తీసుకునే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ దూది, మంగళగిరి ఆర్వో జి.రాజకుమారి పాల్గొన్నారు.

News May 14, 2024

కారంచేడు: భర్త మృతి.. ఆ బాధలోనూ ఓటేసిన భార్య

image

బాపట్ల జిల్లా కారంచేడులో ఓ మహిళ ఓటు విలువను చాటారు. గర్నెపూడి చిట్టెమ్మ గ్రామంలో వీవోఏగా పని చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో సోమవారం ఆమె భర్త సింగయ్య(62) మృతిచెందారు. కాగా, ఆ బాధలోనూ ఆమె ఓటు వేయాల్సిన బాధ్యతను మరవలేదు. 178వ పోలింగ్ కేంద్రంలో ఓటేసి పలువురికి ఆమె ఆదర్శంగా నిలిచారు.