India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుజ్జనగుండ్లలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 25న జాబ్ మేళా జరగనుంది. ప్రముఖ సంస్థలు ఉద్యోగుల నియామకానికి ముందుకొస్తుండగా, పదోతరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి మంగళవారం తెలిపారు. తమ బయోడేటా, విద్యాసర్టిఫికెట్లు, ఆధార్, ఫోటోతో రావాలని ఆమె సూచిస్తున్నారు.
తెనాలి జిలేబికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 19వ శతాబ్దం చివరలో మొదలైన దీని తయారీని సుబ్బయ్య ఆధునిక రూపానికి తెచ్చారు. 1965లో తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా ఆయన ప్రారంభించడంతో ఈ ప్రాంతం ‘జిలేబి కొట్టు బజారు’గా మారింది. సాధారణ జిలేబిలకు భిన్నంగా, తెనాలి జిలేబిలో బెల్లం పాకం వాడతారు. దీనివల్ల ప్రత్యేక రుచి, ముదురు రంగు, సువాసన వస్తాయి. ఈ ప్రత్యేకతే తెనాలి జిలేబిని ప్రసిద్ధి చేసింది.
జీఎంసీ మేయర్ ఎన్నిక ఈ నెల 28న జరగనుంది. మేయర్ పదవి కోసం మొత్తం 63 మంది సభ్యుల్లో సగానికి పైగా ఓట్లు అవసరం. గతంలో టీడీపీ మేయర్‌గా ఉన్న కోవెలమూడి రవీంద్రకు మళ్లీ అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ ఎన్నికలో 56 కార్పొరేటర్లు, 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ ఓటు వేయనున్నారు. నామినేషన్ల గడువు 24 కాగా, 28న పోలింగ్ జరుగుతుంది. గుంటూరు రాజకీయాల్లో ఈ ఎన్నిక కీలకం కానుంది.
తెనాలి(M) సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన మద్దినేని మనోజ్ఞ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో చదువుతున్న మనోజ్ఞ 591 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచారు. సర్కార్ బడిలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన మనోజ్ఞను పలువురు అభినందించారు. మనోజ్ఞ తండ్రి మధుబాబు ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఐఐటీలో చదవాలన్నది తన లక్ష్యమని మనోజ్ఞ తెలిపారు.
గుంటూరు జిల్లా పదో తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించింది. రెగ్యులర్ విద్యార్థులలో 27,255 మంది పరీక్ష రాయగా, 24,169 మంది ఉత్తీర్ణత సాధించి 88.53 శాతంతో రాష్ట్రంలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఉత్తీర్ణత 86.69శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 4వ స్థానంలో నిలవడం విశేషం.
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్‌తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.
మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా గుంటూరులోని అధికార పార్టీ నేతల్లో డిప్యూటీ మేయర్ ఆశావాహుల సందడి మొదలైంది. మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి నాని పేరు ఇప్పటికే అధిష్టానం ఖరారు చేయగా, డిప్యూటీ మేయర్ విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు. బీసీ వర్గానికి చెందిన యల్లావుల అశోక్ పేరు గట్టిగా వినిపిస్తుండగా, ఇన్‌ఛార్జి మేయర్ సజీల మేయర్ ఎన్నిక తర్వాత పాత పదవిని కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్ నగర్లో ఉలవకట్టు ప్రవీణ్ దాస్ (21) మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే ప్రవీణ్ దాస్ మద్యానికి బానిసవ్వడంతో తల్లి మందలించింది. దీంతో క్షణికావేశంలో ఉరివేసుకున్నాడని తెలిపారు. మృతుని సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.
సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటున్నప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
గుంటూరు జిల్లాలోని పాఠశాలలన్నింటికీ ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని చెప్పారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోనోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాటించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.