India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాదెండ్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వరకుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే చిలకలూరిపేట రిటర్నింగ్ అధికారి నారదమునికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న పోస్టల్ బ్యాలెట్‌కు బదులుగా ఈవీఎం పేపర్లను అధికారులు జారీ చేశారు. దీంతో ఇరువురిపై చర్యలు తీసుకున్నారు. 5న ఓటింగ్‌లో పాల్గొన్న 1,219మంది ఉద్యోగులు 8, 9 తేదీల్లో ఓటు వేయాలని సూచించారు.

రాజమండ్రిలో సోమవారం జరిగిన ప్రధాని మోదీ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మోదీని మంగళగిరి చేనేత కండువాతో నారా లోకేశ్ సత్కరించారు. ప్రధానిని చేనేత కండువాతో సత్కరించడంతో మంగళగిరిలోని చేనేత వర్గీయులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోకేశ్ కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పర్యటన చేస్తున్నారు. నేటి నుంచి తిరిగి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు.

సినీ హీరో నారా రోహిత్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం ఆయన పొన్నూరు, రేపల్లెలో పర్యటించనున్నట్లు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి అభ్యర్థులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, అనగాని సత్యప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నారా రోహిత్ ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు.

పల్నాడు జిల్లాలో మొత్తం 16,282 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా, రెండు రోజుల కాలంలో 9364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే గుంటూరు జిల్లాలో గత రెండు రోజుల కాలంలో 4,722 మంది ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 20,755 మంది దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు పశ్చిమలో అత్యధికంగా 5,751 మంది ఉన్నారు. గుంటూరు తూర్పులో 2,778 మంది ఉన్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్(35) దంపతులు గుంటూరులో నివాసం ఉంటున్నారు. అతని భార్య సమోసాలు తయారు చేసే పనికి వెళ్తూ, షాపు యజమానికి దగ్గరైంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించాలనుకొని ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ప్రియుడి తమ్ముడు, మరో వ్యక్తి ప్రేమ్‌ను కొర్నెపాడులోని జగనన్న కాలనీ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి కొట్టి చంపేశారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కేసును ఛేదించారు.

చిలకలూరిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమావేశం భావోద్వేగభరితంగా సాగింది. ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా తరలివచ్చిన మహిళల సమక్షంలో కొంగుపట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నా అంటూ పుల్లారావు సతీమణి వెంకటకుమారి కన్నీటి పర్యంతమయ్యారు. పాతికేళ్ల ప్రస్థానంలో ప్రతిక్షణం చిలకలూరిపేట ప్రజల కోసమే ఆయన ఆలోచించారన్నారు. మంచి మనిషిపై గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలతో అభాండాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం బాపట్ల జిల్లాలోని కర్లపాలెం, చందోలు గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. గత ఎన్నికల పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం ఓటర్లతో మాట్లాడి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా ఉంటుందన్నారు.

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో తొలిసారి 1952వ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎల్.వి.ఎల్ లక్ష్మీ నరసింహం, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా ఎన్.జి రంగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నరసింహం 17,517 ఓట్ల మెజారిటీతో గెలుపొంది గుంటూరు లోక్ సభ స్థానానికి ఎన్నికయ్యాడు. ఆ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనని భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఈయనకు మద్దతిచ్చింది.

భర్తను హత్య చేయించిన భార్యను, <<13183665>>ఆమె ప్రియుడిని<<>> సోమవారం కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. ప్రేమ్ కుమార్ పండ్ల వ్యాపారం చేస్తుండేవాడు. అతని భార్య భారతి సమోసాలు తయారీకి వెళ్లి యజమాని గౌస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రేమ్ కుమార్ ఆమెను మందలించగా.. తమకు అడ్డుగా ఉన్న భర్తను చంపాలని ప్రియుడు సూచించాడు. గౌస్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రేమ్‌కు మద్యం తాగించి హత్య చేశారు.

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీజీపీగా పనిచేసిన రవీంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేయడంతో నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయ పోలీస్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.