India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని పల్నాడు రోడ్డులో ఉన్న SSN కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం బయట టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఓ కారు ధ్వంసమైంది. దీంతో కేంద్ర బలగాలు ఇరువర్గాలను చెదరగొట్టగా.. పలువురు రాళ్లు రువ్వారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

జిల్లాలో హోం ఓటింగ్ ఎంచుకున్న వారికి సంబంధించి ఆదివారం మంగళగిరిలో 124, పొన్నూరులో 21 కలిపి 145 ఓట్లు పోలయ్యాయి. 3, 4 తేదీల్లో జరిగిన పోలింగ్లో 1,924 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 2348 మందికి హోం ఓటింగ్ ను ఎంచుకోగా ఇప్పటివరకూ 2069 మంది ఓటు వేశారు. ఇప్పటి వరకూ తాడికొండ నియోజకవర్గంలో 336, మంగళగిరి 440, పొన్నూరు 284, తెనాలి 344, ప్రత్తిపాడు 360, గుంటూరు వెస్ట్ 210, గుంటూరు ఈస్ట్ 95 మంది ఓట్లు వేశారు.

గుంటూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 97.6 శాతం హాజరు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 4029 మందికిగాను 3933 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే వేసవి తీవ్రత వల్ల అభ్యర్థులతోపాటు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు అసౌకర్యానికి గురయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

‘కొందరు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నేను సాయం చేసి బతికించిన వ్యక్తులు, నావల్ల పదవులు పొంది ఎదిగిన వారు,నాకు అవసరమైన సమయంలో నన్ను వదిలి మోసం చేసి వెళ్లారు’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ బాధ గుండెను పిండేస్తోందని చెప్పారు. ఆదివారం రాత్రి సత్తెనపల్లిలోని ఆవుల సత్రంలో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవేనా మానవ సంబంధాలు అంటూ ప్రశ్నించారు.

గుంటూరు జిల్లాలో తుది జాబితా ప్రకారం 17,91,543 మంది ఓటర్లు ఉన్నారని, ఆ జాబితాను గుర్తింపు పొందిన పార్టీలకు అందజేశామని కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా ఓటరు స్లిప్పులను సిబ్బంది ప్రతి ఓటరుకు అందించటానికి చర్యలు తీసుకున్నామన్నారు. 5, 6 తేదీల్లో పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఉన్నందున, శిక్షణ ముగిసిన తర్వాత 4 గంటల నుంచి ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు వేయొచ్చన్నారు.

సీఎం జగన్ సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఉదయం 10 గంటలకు రేపల్లెలో ఉన్న డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మాచర్ల శ్రీనివాస్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మచిలీపట్నం బయల్దేరి వెళతారు.

ఖాజీపేట- గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు కారణంగా ఈ నెల 10, 16, 22 తేదీలలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు డీఆర్ఎం ఎమ్.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు అయిన రైళ్ల వివరాలు: ట్రైన్ నం. 12705 గుంటూరు- సికింద్రాబాద్, 12706 సికింద్రాబాద్- గుంటూరు, ట్రైన్ నం.17201 గుంటూరు- సికింద్రాబాద్, ట్రైన్ నం.17202 సికింద్రాబాద్- గుంటూరు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కోరారు. ఆదివారం కలెక్టరేట్లో ఎస్పీ తుషార్‌తో కలిసి మాట్లాడారు. ఫారం 12 అందజేయకపోయినా ఉద్యోగుల ఆందోళన చెందవద్దన్నారు. మే 7, 8 తేదీలలో వారికి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలోని కేంద్రంలో ఫారం 12 ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కి సమీపంలో పెట్రోల్ బంకు దగ్గర పోలీస్ చెక్‌పోస్ట్‌కి సమీపంలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయారు. రూ.500 కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి మెడపై బ్లేడుతో కోసి గాయపరిచారు. ఘటనా స్థలానికి దగ్గర ఉన్న పోలీసులు గాయపడి కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి చెన్నైకు చెందిన వ్యక్తిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈనెల ఆరోతేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపల్లె వస్తున్నారని, రేపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేశ్ తెలిపారు. రేపల్లె తాలూకా సెంటర్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ అభిమానులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు సీఎం జగన్ పర్యటన విజయవంతం చేయాలని డాక్టర్ గణేశ్ కోరారు.
Sorry, no posts matched your criteria.