India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.
యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల మండల పరిధిలోని కొత్తపాలెంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులకు నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్ విడుదల చేశారు. ఫలితాలను విశ్వ విద్యాలయ వెబ్ సైట్ నుంచి పొందవచ్చని తెలియజేశారు. మొత్తం 9679 మంది పరీక్షలు రాయగా 6494 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. సందేహాలుంటే రీవాల్యుయేషన్‌కు ఈనెల 30వ తేదీలోగా ఒక్కో పేపర్‌కు రూ. 1240లను చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ భారీ మార్పులు చేసింది. ఉమ్మడి గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా 9 స్థానాలకు అభ్యర్థులను మార్చింది. తాడికొండ, మంగళగిరి, వేమూరు, పొన్నూరు, రేపల్లె, పత్తిపాడు, చిలకలూరిపేట, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. మాచర్ల, నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి, వినుకొండలో పాత అభ్యర్థులనే పోటీకి ఉంచింది.
మండలంలోని బొప్పూడి వద్ద నేడు జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు ప్రధానమంత్రి మోదీ హాజరవుతారు. ఆదివారం సాయంత్రం 4. 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7:00 గంటలకు హైదరాబాద్ వెళతారు.
నేడు చిలకలూరిపేటకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా, గుంటూరు రేంజ్ ఐజి పాలరాజు పర్యవేక్షణలో వీవీఐపి కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. ప్రజాగళం సభకు 3900 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీరిలో ఆరుగురు ఎస్పీలు, 11 మంది అడిషనల్ ఎస్పీలు, 27 మంది డిఎస్పీలు ఉన్నారన్నారు. పోలీసులకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా మెలగాలని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల కోడ్ శనివారం నుంచి అమలులో ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం కమీషనర్ తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీల నిర్వహించే ప్రచారాలలో పాల్గొన్నా.. ఎన్నికల నిబంధన ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రేపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరగనున్న గ్రూప్-1 అభ్యర్ధుల స్క్రీనింగ్ టెస్ట్‌కు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తుషార్ డూడి శనివారం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం గుంటూరు రైల్వేస్టేషన్ తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద, ఆర్టీసీ బస్టాండ్, హిందూ కాలేజ్ జంక్షన్ల వద్ద పోలీస్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గమనించాలన్నారు.
రేపు చిలకలూరిపేట సభ జరగనున్న నేపథ్యంలో వాహనాల దారి మళ్లింపు చేపట్టినట్లు ఐజి పాలరాజు తెలిపారు. చెన్నై నుంచి కలకత్తా NH-16 పై వెళ్లే వాహనాలు ఒంగోలు -దిగమర్రు NH214-Aపై రేపల్లె, మచిలీపట్నం మీదగా విశాఖపట్నం వెళ్ళాలని, నార్కెట్‌పల్లి NH36 పై హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి మీదగా వెళ్ళాలన్నారు. NH 16పై వెళ్లే వాహనాలు విశాఖపట్నం, హనుమాన్ జం, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్ళాలన్నారు.
చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.
Sorry, no posts matched your criteria.