India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకంలో మొదటి రోజు 97.22 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదు రూ.4వేలు చొప్పున అందజేశారు. జిల్లాలో 2,56,017 మంది పింఛన్ దారులకు రూ.109.19కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. కాగా 2,48,901 మందికి రూ.106.10కోట్లు పంపిణీ చేశారు.
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్టర్గా కొమ్మాలపాటి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు 3 జిల్లాల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐగా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన అక్కిశెట్టి శ్రీహరి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన సీఐను కార్యాలయ సిబ్బంది అభినందించారు.
రాజధాని అమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈఅ టెక్నాలజీ సెంటరును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తర్వులిచ్చింది. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీని సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సీఆర్డీఏ కమిషనరును కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సీఆర్డీఏ పరిధిలోని సుమారు 20ఎకరాల్లో టెక్నాలజీ సెంటరుకు త్వరలో పునాది పడనుంది.
గుంటూరు జిల్లా పరిధిలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.58గా ఉంది. మరోవైపు, డీజిల్ లీటర్ ధర రూ.97.42గా విక్రయిస్తున్నారు. పల్నాడు జిల్లా పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.45గా ఉంది. బాపట్లలో పెట్రోల్ లీటర్ ధర రూ.108.94, డీజిల్ ధర రూ.96.81గా విక్రయిస్తున్నారు.
జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా గత నెల 27న రిలీజై భారీ వసూళ్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలంలో అక్టోబర్ 3న ఫంక్షన్ ఏర్పాటుకు సోమవారం నిర్వహకులు స్థలాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ నిర్వహించనుండగా.. చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు సమాచారం.
కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. మాచర్లలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికలతో పాటు ఓటర్ లిస్టు ఉండదని అందరూ నూతనంగా తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రాడ్యుయేట్స్ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
తిరుమల లడ్డూ వివాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను నేడు సుప్రీం కోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ఆరోపణలు చేసి లడ్డులా దొరికిపోయిన బాబు!’ అంటూ ట్విట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్గా మారింది.
రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్ నానక్ రామ్ గుడ లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుపై హోం మంత్రి చర్చించారు. అమెరికా వెళ్లాలనుకునే వారు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని అన్నారు. వీసా అప్లికేషన్ సిస్టం సులభతరం చేయవలసిందిగా హోమ్ మంత్రి కోరగా యూఎస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారన్నారు.
గృహాలు నిర్మించుకునే వారికి సోమవారం నుంచి గంగా ఇసుక అందుబాటులో ఉండనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని నగదు చెల్లించి అప్లై చేసుకున్న వారికి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పారు. సొంత వాహనం కలిగిన వారికి స్లాట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనం లేని వారికి ప్రభుత్వమే సమకూరుస్తుందని, వినియోగదారులు రవాణా చార్జీలు చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న నైపుణ్య గణనను నైపుణ్యాభివృద్ధి సంస్థ సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. ఈ మేరకు సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత ఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఒక్కో గ్రామవార్డు సచివాలయం పరిధిలో 6గురు ఉద్యోగులు పనిచేస్తారని, వారు ఇంటింటికీ వెళ్లి 25 రకాల ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించి ట్యాబ్లో నమోదు చేస్తారు.
Sorry, no posts matched your criteria.