Guntur

News April 15, 2026

SO SAD గుంటూరు: నానమ్మ ఇంటికి వెళ్తూ.. అనంత లోకాలకు.!

image

మంగళగిరిలో నిన్న జరిగిన ప్రమాదంలో బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. 9 నెలల గర్భిణి అయిన తల్లి.. తన పెద్ద కుమార్తె విరోనిక (4)ను మేనమామతో నానమ్మ ఇంటికి పంపగా, మార్గమధ్యంలో కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరికొద్ది సేపట్లో నానమ్మ ఇంటికెళ్లి ఆడుకోవాల్సిన పాప విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

GNT: మహిళ హత్యకేసులో ఇద్దరి అరెస్ట్

image

తీసుకున్న డబ్బు చెల్లించమని అడిగిన మహిళను హత్య చేసిన లాయర్‌తో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతగుంటూరుకు చెందిన రమాదేవి(46)వద్ద లాయర్ సురేశ్ రూ.10లక్షలు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తానని ఇప్పించకుండా మోసంచేశాడు. తిరిగి చెల్లించమని అడిగితే డబ్బులు ఇస్తానని పిలిచి ఫిబ్రవరి 16న సంగజాగర్లమూడి వద్ద పంట కాలువలోకి తోసి చంపేశారు. సురేశ్‌తోపాటు అతని స్నేహితుడు శేఖర్‌ని అరెస్ట్ చేశారు.

News April 15, 2026

మద్దతు ధర దక్కక గుంటూరు రైతుల ఆవేదన

image

జిల్లాలో దిగుబడులు బాగున్నా మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ 79,200 ఎకరాల్లో మొక్కజొన్న, 48,465 ఎకరాల్లో శనగ సాగైంది. మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రైవేటు మార్కెట్‌లో రూ.1,700కే అమ్ముతూ క్వింటాల్‌కు రూ.700 నష్టపోతున్నారు. కంది మద్దతు ధర రూ.8 వేలు కాగా రూ.7 వేలకే ఇస్తున్నారు. శనగ రైతులకూ ఎకరాకు రూ.5 వేల నుంచి 7 వేల దాకా నష్టం వస్తోంది. నిల్వ సదుపాయాలు లేక దళారులకు తక్కువకి అమ్ముతున్నారు.

News April 15, 2026

నేడు అమరావతికి సీఎం.. షెడ్యూల్ ఇదే..!

image

పల్నాడు(D) అమరావతిలో CM చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ధరణికోటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకుంటారు. 2:15కు అన్న క్యాంటీన్ ప్రారంభించి లబ్ధిదారులతో CM భోజనం చేయనున్నారు. తిరిగి 2:45 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

News April 15, 2026

GNT: దొరకని రిమాండ్ ఖైదీ ఆచూకీ

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌) నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ పరారయ్యాడు. అనారోగ్య కారణాలతో రేపల్లె సబ్ జైలు నుంచి చికిత్స కోసం వచ్చిన ఇతడు, మూత్ర విసర్జన సాకుతో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఏలూరుకు చెందిన అజిత్‌పై గతంలో చీటింగ్ కేసులు ఉన్నాయి. ఎస్కార్ట్ ఉండగానే ఖైదీ చెక్కేయడం పోలీసులకు సవాల్‌గా మారింది.

News April 15, 2026

అంబటికి పోలీసుల నోటీసులు

image

కడప జిల్లా వేంపల్లి పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. 2026 ఫిబ్రవరి 1న సింగారెడ్డి రామ మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నోటీసులు అందిన వారం రోజుల్లోగా వేంపల్లి స్టేషనుకు హాజరై దర్యాప్తుకు సహకరించాలని అధికారులు ఆదేశించారు.

News April 14, 2026

GNT: ప్రతి ఏడాది ఆశాజనకంగా ఇంటర్ ఫలితాలు

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో గుంటూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. 2023లో ఫస్ట్ ఇయర్‌లో 67%, సెకండ్ ఇయర్‌లో 74% ఉండగా, 2024లో అవి వరుసగా 81%, 87%కు పెరిగాయి. 2025లో ఫస్ట్ ఇయర్‌లో 82% నమోదు కాగా, సెకండ్ ఇయర్‌లో 91%కు చేరింది. విద్యార్థుల ఫలితాల్లో ఈ పెరుగుదల విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని సూచిస్తోంది. ఈ సారి ఇంకా మెరుగ్గా ఫలితాలు వస్తాయని ఆశిద్దాం.

News April 14, 2026

GNT: రేపే ఇంటర్ ఫలితాలు.. 67,669 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. IPE 2026లో జిల్లాలో మొత్తం 67,669 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం 35,485 మంది, రెండో సంవత్సరం 32,184 మంది ఉన్నారు. 87 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు రేపు ఉదయం10:31కి విడుదల కానున్నాయి. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.