India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్లానింగ్ పూర్తయింది. 190 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ మార్గంలో యాక్సెస్ కంట్రోల్ కఠినంగా ఉంటుంది. వాహనాలు ఈ రోడ్డుపైకి రావడానికి, బయటకు వెళ్లడానికి కేవలం 19 చోట్ల మాత్రమే ఇంటర్ చేంజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నందివెలుగు, తెనాలి స్పర్ రోడ్, నారాకోడూరు, పుల్లడిగుంట, లింగాయపాలెం, మేడికొండూరు, కాజ తదితర 19 ప్రాంతాల్లో మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉండనున్నాయి.

పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు డీపీవోలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులతో కలిసి వకుల్ జిందాల్ ప్రజల ఫిర్యాదులను తెలుసుకొని వినతీ పత్రాలు స్వీకరించారు. మొత్తం 178 ఫిర్యాదులు అందాయని అన్నారు. నిర్ణీత గడువు లోపు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఈ సందర్బంగా ఎస్పీ ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణకు మొత్తం 9 మంది మంత్రులు హాజరుకానున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సుపరిపాలన అందించడం, ఆర్థికాభివృద్ధిలో నైపుణ్యాలు పెంపొందించడం, తదితర కీలక అంశాలపై నిపుణులు వారికి శిక్షణ ఇవ్వనున్నారు.

ఆచార్య నాగార్జున వర్సిటీలో గత పాలనలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిగినా స్పష్టత లేదు. ఇప్పుడు ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. నిధుల దుర్వినియోగం, నియామకాల్లో అక్రమాలు వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించినా నివేదిక బయటకు రాలేదు. వారం గడుస్తున్నా చర్యలు కనిపించకపోవడం విమర్శలకు దారి తీసింది. అదే వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీఎం చంద్రబాబు నాయుడు నేడు సచివాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 10:50 గంటలకు ఆయన తన కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆర్టీజీఎస్ (RTGS) పనితీరుపై అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష ముగిసిన తర్వాత సాయంత్రం 5:50 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ACB అధికారులు సహాయ కమిషనర్ శాంతిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 7న నిర్వహించిన తనిఖీల్లో రూ. 1.37 కోట్ల అక్రమాస్తులను గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. కోర్టు 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్నందున, ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దరఖాస్తులను ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని కలెక్టర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దరఖాస్తులను ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని కలెక్టర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-1 మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారతజట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అమెరికాపై 233-232తో విజయం సాధించారు. మన తెలుగమ్మాయి వెన్నల జ్యోతి సురేఖ తన సహచర జట్టు క్రీడాకారిణులు మధుర, ప్రగతీలతో కలిసి భారత్ స్వర్ణపతకం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జ్యోతి సురేఖ ప్రపంచ వేదికలపై 12 సార్లు స్వర్ణపతకాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు.

అమరావతి రాజధాని అభివృద్ధికి మరింత వేగం పెంచేలా సీఆర్డీఏ చట్టంలో కీలక సవరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. పాలనను సరళీకరించి, ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా పీపీపీ (PPP) విధానం, కొత్త ఆదాయ వనరుల అన్వేషణపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిపుణుల కమిటీ రూపొందిస్తున్న ముసాయిదా ఆధారంగా త్వరలోనే నూతన చట్టం రూపుదిద్దుకోనుంది.
Sorry, no posts matched your criteria.