Guntur

News April 14, 2026

GNT: రేపే ఇంటర్ ఫలితాలు.. 67,669 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. IPE 2026లో జిల్లాలో మొత్తం 67,669 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం 35,485 మంది, రెండో సంవత్సరం 32,184 మంది ఉన్నారు. 87 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు రేపు ఉదయం10:31కి విడుదల కానున్నాయి. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 14, 2026

అమరావతిలో అమృత వర్సిటీ క్యాంపస్

image

రాజధాని అమరావతిలో అమృత విశ్వవిద్యాపీఠం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన నూతన క్యాంపస్ మాస్టర్ ప్లాన్‌ సిద్ధమైంది. అమరావతిలో సుమారు 150 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక క్యాంపస్‌ను నిర్మించనున్నారు. రాజధానిలోకి ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల రాకతో ఇక్కడి విద్యార్థులకు మరింత మెరుగైన ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

News April 14, 2026

అన్ని వర్గాల హక్కుల ప్రదాత రాజ్యాంగ నిర్మాత: లోకేశ్

image

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి లోకేశ్ తన ఉండవల్లి నివాసంలో నివాళులర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, దేశాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని లోకేశ్ కొనియాడారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు.

News April 14, 2026

GNT: జపాన్ రాయబారితో నారా లోకేశ్ భేటీ

image

​ఢిల్లీ పర్యటనలో జపాన్ రాయబారి ఒనో కెయిచితో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీ, జపాన్ మధ్య ఉన్న అనుబంధంపై వీరు చర్చించారు. శ్రీసిటీలో ఇప్పటికే పలు జపాన్ కంపెనీలు ఉన్నాయని లోకేశ్ గుర్తుచేశారు. రాష్ట్రానికి మరిన్ని జపాన్ పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై ప్రధానంగా చర్చలు జరిపినట్లు ఆయన ‘X’ వేదికగా వెల్లడించారు.

News April 14, 2026

GNT: అమరావతిలో అగ్ని ప్రమాదాలకు చెక్!

image

అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ADCL దృష్టి సారించింది. ADCL 320కి.మీ. పరిధిలో జరుగుతున్న ట్రంక్ రోడ్లు,12 LPS జోన్ల పరిధిలోని కాంట్రాక్టర్లకు మార్గదర్శకాలు జారీచేసింది. నిర్మాణ సంస్థలు వారి క్యాంపు ప్రదేశాల్లో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి స్పష్టం చేశారు. అధికారులు అగ్ని ప్రమాదాల నివారణపై నిరంతరాయంగా క్యాంపులను సందర్శించి చర్యలు తీసుకోవాలన్నారు.

News April 14, 2026

గుంటూరు: దరఖాస్తు గడువు పొడిగింపు

image

గుంటూరు జిల్లాలో 38 బ్యాక్‌లాగ్ పోస్టుల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వెంకటరమణప్ప సోమవారం తెలిపారు. ఇందులో టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు సీపీటీ (CPT) పాసై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాల కోసం https://guntu-rap.in/dw2026 వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 14, 2026

GNT: రీ-సర్వే సమస్యల పరిష్కారానికి చర్యలు

image

భూముల రీ-సర్వేలో వచ్చిన లోపాలను సరిచేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. గురువారం రైతులకు మ్యుటేషన్, సబ్‌డివిజన్‌కు అవకాశం కల్పించారు. జూన్ 30 వరకు రాయితీ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సాధారణంగా రూ.550 ఉండే ఫీజు, గడువులో రూ. 50కే పరిమితం చేశారు. రీ-సర్వేలో ఎల్పీఎం నంబర్లు, భూమి వివరాలు తారుమారవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.

News April 14, 2026

GNR: ఈ నెల 16 నుంచి స్వీయ నమోదు ప్రారంభం

image

గుంటూరు జిల్లాలో 15 ఏళ్ల తర్వాత జనగణన డిజిటల్ విధానంలో ప్రారంభం కానుంది. ఈ వారంలో భాగంగా 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు అవకాశం కల్పించారు. మొత్తం 33 ప్రశ్నలతో కుటుంబ వివరాలు నమోదు చేయాలి. పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి సమాచారం ఇవ్వవచ్చు. మే 1 నుంచి గణకులు ఇంటింటికీ వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఆధార్ వంటి పత్రాలు అవసరం లేదు. వివరాల గోప్యతకు చట్ట పరిరక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.

News April 14, 2026

GNT: మిర్చి రాకలు తగ్గుదల.. యార్డుకు దెబ్బ

image

గుంటూరు మిర్చి యార్డులో ఈ సీజన్‌లో రాకలు గణనీయంగా తగ్గాయి. గతంలో రోజుకు 2 లక్షల టిక్కీలు వచ్చేవి. ఇప్పుడు సగటు 1.30 లక్షలకే పరిమితం అవుతున్నాయి. సాగు విస్తీర్ణం 1.60 లక్షల హెక్టార్ల నుంచి 90 వేల హెక్టార్లకు తగ్గింది. గత సీజన్‌లో ధరలు లేకపోవడం, వాతావరణ ప్రభావం కారణాలుగా చెబుతున్నారు. యార్డు ఆదాయం కూడా ప్రభావితమైంది. గత ఏడాది రూ.20 కోట్ల లోటు రాగా, ఈ ఏడాదీ అదే పరిస్థితి కొనసాగుతోంది.

News April 13, 2026

GNT: అక్రమ విద్యుత్.. రూ.12.93 లక్షల ఫైన్

image

విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగం సంయుక్తంగా సోమవారం విద్యుత్ సర్వీసుల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాయి. D13 సెక్షన్ పరిధిలోని ఆటోనగర్, నవభారత్ నగర్, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. 54 మంది అధికారులు, 158 మంది సిబ్బంది, 54 బృందాలుగా ఏర్పడి 4,489 సర్వీసులను తనిఖీ చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్దంగా ఉన్న 190 సర్వీసులపై రూ.12.93లక్షల అపరాధ రుసుం విధించారు.