India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
☞ లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అధికారి
☞ ఐకానిక్ టవర్ల నుంచి నీరు తోడివేత
☞ గుంటూరు: రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యం
☞ చిలకలూరిపేటలో అమెరికన్ డైమండ్స్‌తో వినాయక విగ్రహం
☞ పులిచింతల వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం
☞ మిస్సింగ్ కేసులను ఛేదించాలి: ఎస్పీ
☞ ఈవీఎంల భద్రత పక్కాగా ఉండాలి : కలెక్టర్
☞ అంబటి మురళీ ధూళిపాళ్లపై బురద జలుతున్నారు
☞ మంగళగిరిలో ఫోన్ దొంగల అరెస్ట్
అమరావతిలో గ్రీనరీ అభివృద్ధి పనులను APCRDA, ADCL లు ప్రణాళికాయుతంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. పర్యాటకం, పర్యావరణ పరిరక్షణలతో కూడిన అనేక ప్రాజెక్టులను చేపట్టి, అమరావతిని భవిష్యత్తు తరాలకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే దిశగా సమగ్ర కృషి జరుగుతోంది. 4,716 హెక్టార్ల విస్తీర్ణంలో అమరావతిలో పర్యాటక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వం, వినోదానికి కేంద్రంగా నిలుస్తుంది.
పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, నాన్ బెయిలబుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని ఎస్పీ సతీశ్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన జులై నెలకు సంబంధించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, మహిళలపై నేరాలు, శారీరక దాడులకు సంబంధించిన కేసుల్లోని నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలన్నారు. మిస్సింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉందని, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే, పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఆయన ప్రజలను హెచ్చరించారు.
తెనాలిలో ఒంటరి మహిళలే లక్ష్యంగా దారుణాలు జరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. రెండు నెలల క్రితం పరిమి రోడ్డులో వృద్ధులను హత్య చేసి ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన మరువక ముందే, మంగళవారం అత్తోటలో మరో వృద్ధురాలిపై దాడి జరిగింది. దుండగులు ఆమెను దారుణంగా కొట్టి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. వరుస ఘటనలతో మహిళలు భయాందోళన చెందుతున్నారు.
తిరుపతి నుంచి భూమన కరుణాకర రెడ్డిని తరిమి కొట్టడం ఎవరి వల్లా కాదని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘పాపాల భైరవుడు బిఆర్ నాయుడుని మాత్రం స్వామి వారే తరిమి కొడతారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. టీటీడీ స్థలాన్ని పర్యాటక శాఖకు బదలాయించడంపై భూమన కరుణాకర రెడ్డి ఘోరమైన అపచారం జరిగిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ విధంగా స్పందించారు.
గుంటూరులో రైల్ వికాస్ భవన్లో మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో రైల్వే డీఆర్ఎం సుధేష్ణ సేన్ మాట్లాడారు. ప్రధాన మంత్రి విక్సిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకం యజమానులను కొత్త ఉద్యోగులను నియమించడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పథకం కింద కేంద్రం నిర్దిష్ట కాలం వరకు ఉద్యోగులకు, యజమానులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుందని చెప్పారు. దీతో యజమానుల భారం తగ్గి, కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయని అన్నారు.
గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ అభివృద్ధి సూచికపై శిక్షణా కార్యక్రమం జరిగింది. జెడ్పీ ఛైర్పర్సన్ హెనీ క్రిస్టీనా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల పురోగతిని అంచనా వేసి, డేటా ఆధారిత పాలనకు ఈ సూచిక దోహదం చేస్తుందని తెలిపారు. సీఈఓ వీర్ల జ్యోతిబసు మాట్లాడుతూ.. స్థానిక స్థాయిలో 9 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పనితీరు కొలవడంలో ఇది కీలకమని, పారదర్శకత పెరగటంతో ప్రజలకు స్పష్టత లభిస్తుందన్నారు.
గుంటూరు కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ రైతుల నుంచి పొగాకు కొనుగోలు నిరంతరం సాగాలని ఆదేశించారు. జిల్లాలో 3,895 మంది రైతులు పొగాకు సాగు చేయగా, వారిలో 3,370 మంది సీఎం యాప్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు 1,614 మందికి షెడ్యూల్ ఇచ్చి, మార్కెఫెడ్ ద్వారా 2,200 టన్నులు, ప్రైవేటు కంపెనీలు 3,500 టన్నులు కొనుగోలు చేశాయని ఆయన వివరించారు.
గుంటూరు AC కళాశాలలో గురువారం DSC సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. జిల్లా విద్యాధికారిణి రేణుక వివరాల మేరకు.. అభ్యర్థులు తమ DSC లాగిన్ ద్వారా కాల్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్లో సర్టిఫికెట్లను ముందుగా అప్లోడ్ చేసి, తర్వాతే పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. సంబంధిత ఒరిజినల్స్‌తో పాటు, మూడు సెట్ల అటెస్టెడ్ కాపీలు, 5 పాస్‌పోర్ట్ ఫొటోలు, కుల, వికలాంగ ధృవపత్రాలను తీసుకురావాలన్నారు.
Sorry, no posts matched your criteria.