India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని DRO పెద్ది రోజా అధికారులను ఆదేశించారు. టెట్ పరీక్షల నిర్వహణపై తన ఛాంబర్లో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144సెక్షన్ అమలు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని చెప్పారు. రవాణా శాఖ అధికారులు అన్ని రూట్‌లలో సకాలంలో బస్సులు నడపాలని స్పష్టం చేశారు.
వైసీపీ నేతల అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు చంద్రబాబు అమరావతిలో శనివారం టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జగన్ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని చెప్పారు. అలాగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపైనా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీడీపీ శ్రేణులకు తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థనాథ్ సింగ్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు, ప్రజలకు అందించిన సహకారంపై చర్చించారు. అలాగే, పోలవరం, అమరావతికి ఇస్తున్న సహకారానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు గృహాలు కల్పించడం అనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన అంశమని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శనివారం బాపట్ల మూలపాలెం రహదారిలోని లే అవుట్‌లో గృహ నిర్మాణా లబ్ధిదారులతో మన ఇల్లు-మన గౌరవం అనే కార్యక్రమం ద్వారా ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. మార్చి 2025 నాటికి పెండింగ్‌లో ఉన్న గృహాలు మొత్తం పూర్తి చేయాలని సూచించారు. గృహాల పురోగతి కోసం ప్రత్యేకంగా సచివాలయాల సిబ్బందిని నియమిస్తామన్నారు.
రూ.11 లక్షల రుణం తీసుకుంటే రూ.43 లక్షలు కట్టమంటున్నారని కాకినాడ (D)కు చెందిన ఓ మహిళ మంత్రి నారా లోకేశ్‌కు ప్రజా దర్బార్‌లో వినతిపత్రం అందజేశారు. కుటుంబ అవసరాల కోసం రూ.11 లక్షల రుణం తీసుకున్నామని డాక్యుమెంట్ తనకా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి సేల్ డీడీ రిజిస్ట్రేషన్ చేసి మోసం చేశారని మహిళ కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడు వడ్డీతో సహా రూ.43 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని మంగళగిరి రూరల్ సీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దాడి జరిగిన సమయంలో సురేశ్ అక్కడే ఉన్నట్లు నిర్ధారించి దాడికి కుట్ర పన్నిన వారిలో ఆయనను కీలక వ్యక్తిగా పోలీసులు నివేదిక అందించారు. సురేశ్ పాత్రతో పాటు ఇతర నిందితుల పాత్రలు తేల్చాల్సి ఉన్న నేపథ్యంలో బెయిల్ కొట్టేయాలని కోరారు.
ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు విద్యాశాఖమంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఉండవల్లిలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఎన్ సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
నూతనంగా ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలలో హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ నూతన కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ బాపట్ల జిల్లాలోని పలువురు అభినందనలు తెలియజేశారు.
గుంటూరులో రోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్‌పేటకు చెందిన మారెళ్ల రేవతి(52) అనారోగ్యంతో రోడ్డున మృతి చెంది పడి ఉంది. స్థానికులు గమనించి కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సదరు మహిళ మృతదేహాన్ని గుంటూరు GGH మార్చురీకి తరలించారు. ఆమె వివరాలు తెలిసినవారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాల్సిందిగా పోలీసులు కోరారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు యువతులను నరసారావుపేట పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నరసరావుపేట మండలం లలితాదేవి కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇద్దరు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.