Guntur

News March 19, 2025

రాజశేఖర్ టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం?

image

వైసీపీ MLC మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్ పెట్టిన ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశానికి సైతం హాజరు కాలేదు. విడదల రజనీకి చిలకలూరిపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పడమూ ఇందుకు ఓ కారణం. పల్నాడులో కీలక నేతను కోల్పోవడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

News March 19, 2025

వైసీపీకి మర్రి రాజశేఖర్‌ రాజీనామా

image

YCPకి MLC మర్రి రాజశేఖర్‌ రాజీనామా చర్చనీయాంశమైంది. 2004లో చిలకలూరిపేటలో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆయన 2010లో YCPలో చేరారు. 2014లో MLAగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం YCP జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2018లో జగన్‌ పాదయాత్రలో కీలకంగా పనిచేశారు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా విడదల రజనీ ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.

News March 19, 2025

గుంటూరు మేయర్ ఎంపికపై ఉత్కంఠ

image

కావటి మనోహర్ మేయర్ పదవికి రాజీనామా చేయడంతో గుంటూరులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో తాత్కాలిక మేయర్ రేసులో కోవెలమూడి, కొందరు సీనియర్ కార్పొరేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నవారిని తాత్కాలిక మేయర్‌గా నియమిస్తారు. దీంతో కూటమి తరఫున సజీలను నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె కంటే తానే సీనియర్‌ని అని డైమండ్ బాబు(YCP) అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.

News March 19, 2025

వట్టిచెరుకూరు: చిన్నారిపై అత్యాచారం.. వృద్ధుడిపై పోక్సో కేసు

image

బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడో వృద్ధుడు. వట్టిచెరుకూరు మండలంలో ఈ అమానుషం జరిగింది. సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కె.థామస్(55) ఇంటి పక్కనే ఉన్న చిన్నారిపై ఈ నెల 14న ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. అనారోగ్యంగా ఉన్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వృద్ధుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News March 19, 2025

గుంటూరు: వీఆర్‌కు పట్టాభిపురం సీఐ మదుసూదనరావు!

image

పట్టాభిపురం సీఐ వీరేంద్ర స్థానంలో నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన మదుసూదనరావుకు ఉన్నతాధికారులు ఝలక్ ఇచ్చారు. ఆదివారం రాత్రి ఈయన బాధ్యతలు చేపట్టగా తాజాగా వీఆర్‌కు పంపారు. ఓ ప్రజాప్రతినిధి సిఫార్సుతో ఈయనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో వీఆర్‌కు పంపినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. కాగా కేవలం 9 నెలల వ్యవధిలో ఈ స్టేషన్‌కు ముగ్గురు CIలు మారడం గమనార్హం.

News March 19, 2025

గుంటూరు: వడదెబ్బ తగిలి గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం నందివెలుగు రోడ్డు మణిహోటల్ సెంటర్ వద్ద డివైడర్ పై వడదెబ్బ తగిలి ఓ వ్యక్తి మరణించాడు. వార్డు సచివాలయ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకి చేరుకున్నారు. అనంతరం ఆ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లైతే స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

News March 19, 2025

బాలల సంరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో బాలల సంరక్షణ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు చేసి సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ నాగలక్ష్మీ చెప్పారు. ఇందుకు సంబంధిత శాఖలు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు స్థాయిలో బాలల సంక్షేమం, సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బాల, బాలికల రక్షణ, పునరావాసం, విద్యా , వైద్యం అంశాలపై పరిశీలన చేయాలన్నారు.

News March 18, 2025

ఒక్క హామీ నెరవేర్చితే బాధ్యత తీరిపోయినట్టు కాదు: మంత్రి లోకేశ్

image

ఒక హామీ నెరవేర్చితేనే నా బాధ్యత తీరిపోయినట్టు కాదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం చేనేతలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని నిలబెట్టుకున్న సందర్భంగా మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీ లక్షలాదిమంది ప్రజలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఎంతో దోహదపడుతుందని అందులోనే తనకు సంతోషం ఉందని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు.

News March 18, 2025

రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్

image

వైసీపీఅధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ బుధవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. ఉదయం 9.30కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ వైసీపీ పార్లమెంటరీ పార్టీనేత వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ (85) పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

News March 18, 2025

తెనాలిలో ఎన్నారై కుటుంబంలో విషాదం

image

అమెరికా నార్త్ కరోలినాలో తెనాలికి చెందిన ఎన్నారై కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తెనాలి అయితానగర్‌కు చెందిన గడ్డం థామస్ కుమార్తె షారోన్ సధానియేల్‌కు, అమెరికాకు చెందిన సథానియేల్ లివిస్కాతో 2007లో వివాహం కాగా అమెరికాలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తుఫాను కారణంగా భారీ వృక్షం కూలి వీరి ఇంటిపై పడటంతో ఇంట్లో నిద్రిస్తున్న కుమారులు మృతి చెందారు.