India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు గుంటూరు, సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్, గుంటూరు (12706), గుంటూరు, సికింద్రాబాద్ (12705) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
భర్తపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. హనుమయ్య నగరకు చెందిన వెంకటరమణ అనే మహిళ తన భర్త వెంకటేశ్వర్లు తరచూ గొడవ పెట్టుకుని కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కూడా కేసు వెనక్కి తీసుకోమని గడ్డపార తీసుకుని తల పగలగొట్టాడని భార్య వెంకటరమణ పోలీసుల ఎదుట వాపోయింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (L.H.M.S)ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజల ఆస్థుల పరిరక్షణకు L.H.M.S రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని, ఈ యాప్‌ను అందరూ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రజల అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు చోరీలు జరగకుండా ఈ యాప్ ఉపకరిస్తుందని అన్నారు.
ప్రముఖ ఆలయ తిరుమల – తిరుపతి ఆలయ లడ్డూ ప్రసాదం విషయంపై సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గుంటూరు సౌత్ కొస్టల్ జోన్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీని సిట్ చీఫ్‌గా ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు కీలక పదవి దక్కింది. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పిళ్లి మాణిక్యరావుని నియమించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పిళ్లి మాణిక్యరావు చురుగ్గా పనిచేశారు. ఆయన పనితీరు తగిన విధంగా పదవి దక్కిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
స్వర్ణాంధ్ర విజన్@2047 ప్లాన్ ద్వారా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. స్మార్ట్ ఫోన్ నుంచి swarnandhra.ap.gov.in/Suggestions లింక్‌తో వచ్చే QR కోడ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. 1.పేరు, 2.ఫోన్ నంబర్ 3.OTP, 4.జిల్లా పేరు, 5.వయసు, 6.లింగం, 7.వృత్తి, 8.ఇ-మెయిల్ చిరునామాను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.
మంగళగిరికి చెందిన టీడీపీ నేత నందం అబద్ధయ్య పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు మంగళవారం ప్రకటించారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన అబద్ధయ్య తొలి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. గతంలో మంగళగిరి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్‌గా చేసి నేడు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. మంగళగిరిలో లోకేశ్ విజయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కీలం రామయ్య 41 అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున అద్దంకి-నార్కెట్ పల్లి రాష్ట్ర రహదారిపై చోటు చేసుకుంది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం తిరుగుతున్న సమయంలో మృతదేహాన్ని గమనించారు. కాగా మృతుడు పిడుగురాళ్లలోని సున్నం మిల్లులో పనిచేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెళ్లికి పిలవలేదని అడిగిన స్నేహితుడిని చితక్కొట్టిన ఘటనపై నగరంపాలెం పోలీసు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. వికలాంగుల కాలనీకి చెందిన సాయికుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన నాగరాజు స్నేహితుడు. కొద్దిరోజుల క్రితం నాగరాజు వివాహమైంది. తనను పెళ్లికి పిలవలేదని సాయికుమార్ ప్రశ్నించారు. బంధువులందరి ముందు అడుగుతావా అంటూ గొడవ పెట్టుకున్న నాగరాజు కర్రతో కొట్టాడని సాయి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం సంబంధిత శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష ఉన్నందున ఉండవల్లిలోని నివాసంలో ముందస్తుగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శాఖ చేపడుతున్న అనేక కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. స్కిల్ సెన్సెస్ యాప్ పై చర్చించిన లోకేశ్ పైలెట్ ప్రాజెక్టు కింద మంగళగిరి ప్రాంతాల్లో నైపుణ్యగణన చేపట్టాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.