India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పనులకు వారం రోజుల్లో, పెద్ద పనులకు రెండు వారాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించనున్నారు. రైతుల సమస్యలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, భూముల దోపిడీ వంటి అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

అమరావతికి మరో ప్రముఖ సంస్థ వస్తుంది. రూ.200 కోట్లతో అమరావతిలో 4 ఎకరాల్లో వివాంత (తాజ్ గ్రూప్) 5-స్టార్ హోటల్ నిర్మాణం కానుంది. మందడం సమీపంలో సీడ్ ఆక్సిస్ రోడ్డు పక్కన CRDA స్థలం కేటాయించగా ప్రస్తుతం చదును చేస్తున్నారు. 2028 నాటికి ఈ 5-స్టార్ హోటల్ ప్రారంభం అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. అమరావతి ఆతిథ్యం, పెట్టుబడి రంగానికి ఇది ఒక పెద్ద ప్రోత్సాహం అని పలువురు అంటున్నారు

తక్కెళ్లపాడు రోడ్డులో సోమవారం ఓ వృద్దురాలు దీనస్థితిలో పడి ఉండటం స్థానికులను కలిచివేసింది. గుర్తుతెలియని వ్యక్తులు వృద్దురాలిని వదిలి పెట్టి వెళ్లడంతో స్థానికులు పాతగుంటూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ టీమ్ ఆ వృద్దురాలికి సపర్యలు చేసి పొన్నూరు గోతాలస్వామి ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో వైద్యులు లేకపోవడంపై Way2Newsలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై DMHO సుహాసిని స్పందించారు. సోమవారం ఇద్దరు వైద్యులను దుర్గగుడికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేట ఏరియాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సురేశ్ బాబు, కృష్ణలంకలో పనిచేస్తున్న డాక్టర్ ఉదయ్ కృష్ణలను డిప్యూటేషన్‌పై దుర్గగుడిలో పనిచేయాలని ఆదేశాలు అందాయి. దీంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

గుంటూరు భారతపేట ప్రాంతానికి చెందిన ఓ కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే క్లియరెన్స్ కోసం రూ.62.25 లక్షలు కట్టాలనడంతో నగదు చెల్లించాడు. అయినా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూనే ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాపట్ల పరిధిలోని నగరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితులతో కలిసి ఈనెల 1వ తేదీ రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత మత్తులో తనకు నానమ్మ వరుసయ్యే 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. బంధువులు గమనించి వృద్ధురాలిని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తరఫున నగరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందగా ఎస్ఐ భార్గవ్ కేసు నమోదు చేశారు.

గుంటూరు జీజీహెచ్‌లో మాతా, శిశు వైద్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.86 కోట్లతో నిర్మిస్తున్న 500 పడకల బ్లాకులో వైద్య పరికరాల కొనుగోలుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ చర్యలతో గర్భిణులు, నవజాత శిశువుల మరణాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రముఖ తెలుగు నటుడు జయప్రకాశ్ రెడ్డిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. దాదాపు 300 సినిమాల్లో నటించిన ఈయన ఎక్కువగా విలన్, కమెడియన్ పాత్రలను పోషించారు. ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి చిత్రాలతో ఆయన ప్రాముఖ్యత పొందారు. 2020, సెప్టెంబరు 8న గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీప్రసాద్ తెనాలిలో జన్మించారు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, వరూధినిలకు జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేసారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సెప్టెంబరు 8, 2012 న ముంబైలో మరణించారు.
Sorry, no posts matched your criteria.