India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరుకు చెందిన అరిగెల భార్గవ్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్ డబుల్స్ విభాగంలో ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గొబ్బూరి విశ్వతేజతో కలిసి వరల్డ్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు భార్గవ్‌ను అభినందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహించబడిన జాతీయ లోక్ అదాలతో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ కేసులను పరిష్కరించామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. ఐపీసీ కేసులు 601, ఎక్సైజ్ కేసులు 473, స్థానిక చట్టాలు సంబంధించిన కేసులు 133 మొత్తం కలిపి 1,211 కేసులను పరిష్కరించామని తెలిపారు. డీసీఆర్బీ సీఐ నరసింహారావు, కోర్టు సిబ్బందిని అభినందించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని సోమవారం నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఫిర్యాదిదారులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో తిరిగి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఫిర్యాది దారులు ఈ విషయాన్ని గమనించి పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన చిరువ్యాపారి మృతిచెందాడు. పులివర్తి సురేశ్ (45) ద్విచక్ర వాహనంపై అరటిగెలలు పెట్టుకుని పరిసర గ్రామాల్లో ప్రజలకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం దుగ్గిరాల వెళుతున్నానని చెప్పి వెళ్లిన సురేశ్ పోస్టాఫీస్ సమీపాన బస్ షెల్టర్‌లో మృతిచెంది ఉన్నాడు. పోలీసులకు అందించిన సమాచారంతో కుటుంబసభ్యులు సురేశ్ మృతదేహాన్ని గుర్తించారు. వడదెబ్బకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజిత గుంటూరు జిల్లాలో 150 పరీక్షా కేంద్రాల్లో 30,140మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ పరీక్షలతోపాటు, మరో 21 పరీక్షా కేంద్రాల్లో దూర విద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. గుంటూరు గతేడాది 88.14 శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులు పనిచేస్తున్నారు.
తాడేపల్లి పరిధి వడ్డేశ్వరంలోని ఓ కళాశాలలో శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సంతోష్ అనే యువకుడిని విజయవాడకు చెందిన హరికృష్ణ గ్యాంగ్‌తో కలిసి దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన సంతోష్‌ని విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
జాతీయ లోక్ అదాలత్‌లో 49,056 కేసులు పరిష్కారం అయినట్టు న్యాయ సేవాధికార సంస్థ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాగూర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తెలహరి, హైకోర్టు న్యాయ సేవ కమిటీ చైర్మన్ రావు రఘునందన్ రావు శనివారం తెలిపారు. రెండో శనివారం హైకోర్టులో, రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో లోకదాలత్ నిర్వహించబడిందన్నారు. రూ.3,260 కోట్లు పరిహారం చెల్లించుటకు అవార్డులు జారీ చేసినట్టు కార్యదర్శి భబిత తెలిపారు.
నవమాసాల్లో మహిళలకు నవమోసాలను పరిచయం చేసిన కూటమి ప్రభుత్వానికి మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి ఆమె మాట్లాడారు. ఎన్నికలకు ముందు హామీలతో నమ్మించి, అధికారంలోకి రాగానే మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలోనే మహిళలు నిజమైన సాధికారితను అందుకున్నారన్నారు.
మహిళలే సృష్టికి మూలమని మాజీమంత్రి రోజా పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రతిభ కనబరుస్తూ, పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.
Sorry, no posts matched your criteria.