Guntur

News July 14, 2024

మంగళగిరి వద్ద ప్రమాదం.. బాలుడి మృతి

image

మంగళగిరిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు.

News July 14, 2024

టీడీపీ నేత మృతికి మంత్రి లోకేశ్ సంతాపం

image

టీడీపీ నేత, ఓటర్ రామకృష్ణగా అందరికి సుపరిచితులైన అన్నే రామకృష్ణ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.‌ టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించిన రామకృష్ణకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. TDP ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఎనలేని సేవ చేశారని రామకృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని తన ట్విటర్ (X)లో ట్వీట్ చేశారు.

News July 14, 2024

గుంటూరు: వ్యక్తి మృతి.. హత్యా? ఆత్మహత్యా?

image

గుంటూరు నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాస శివయ్య(39) అనే వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య రాస సామ్రాజ్యం ఫిర్యాదు మేరకు ఎస్సై సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకి పాల్పడ్డాడని మృతుని భార్య వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News July 14, 2024

బాపట్ల: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి

image

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో ఈనెల 5వ తేదీన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సోదరుడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. బాపట్ల జిల్లాకు చెందిన కంపిరి సురేశ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అతనికి ఇద్దరు కూమారులు. వారిలో పెద్దవాడు గంజాయికి బానిసై డబ్బు ఇవ్వాలని లేందటే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించేవాడు. అన్న తల్లిదండ్రులను చంపేస్తాడని భావించి తమ్ముడే హత్య చేశాడని SI తెలిపారు.

News July 13, 2024

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా సతీశ్ కుమార్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా సతీశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా ఎస్పీగా పని చేసిన తుషార్ డూడిని బాపట్ల ఎస్పీగా నియమించారు. కాగా త్వరలోనే గుంటూరు జిల్లా ఎస్పీగా సతీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.  

News July 13, 2024

పల్నాడు, బాపట్ల ఎస్పీలు బదిలీ

image

పల్నాడు, బాపట్ల జిల్లా ఎస్పీలు మలికా గర్గ్, వకుల్ జిందాల్‌ను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్‌, విజయనగరం APSP బెటాలియన్‌ కమాండెంట్‌గా మలికాను నియమించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు అప్పుడు పల్నాడు ఎస్పీగా మలికా గర్గ్ వచ్చారు. బాపట్ల కొత్త జిల్లాగా ఏర్పాటైనప్పటి నుంచి వకుల్ జిందాల్ అక్కడ ఎస్పీగా పని చేస్తున్నారు.

News July 13, 2024

కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు మహర్దశ: ఎంపీ లావు

image

మంగళగిరి మండలం కొలనుకొండలోని శ్రీ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా సీఎం చంద్రబాబు చేపట్టిన పూజా కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు మహర్దశ రానుందని చెప్పారు.

News July 13, 2024

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

image

సీఎం చంద్రబాబు శనివారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఉంటారు. ఈ సాయంత్రం 4:30 గంటలకు ముంబై వెళ్లనున్నారు. ముకేశ్ అంబానీ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో అక్కడికి బయలుదేరుతారు. రాత్రికి ముంబైలోనే బస చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి తిరిగి చంద్రబాబు చేరుకోనున్నారు.

News July 13, 2024

గుంటూరు మిర్చి యార్డుకు 21,027 టిక్కీలు

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 21,027 టిక్కీల మిర్చి రాగా పాత నిల్వలతో కలిపి 25,626 టిక్కీలు విక్రయించారు. ఇంకా 12,347 టిక్కీలు నిల్వ ఉన్నాయి. నాన్ ఎసి కామన్ వెరైటీలు సగటున కనిష్ట ధర రూ.8వేలు పలకగా గరిష్టంగా రూ.16 వేలు పలికింది. నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలు కనిష్టంగా రూ.8 వేలు, గరిష్టంగా రూ.18,600 లభించాయి. ఏసీ కామన్ వెరైటీలు సగటు కనిష్ట ధర రూ.8500, గరిష్ట ధర రూ.16,500 పలికింది.

News July 13, 2024

గుంటూరు: ప్రభుత్వ బంగ్లాలో YCP ప్రచార సామగ్రి.. TDP నేతల ఆగ్రహం

image

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ట్రావెలర్స్ బంగ్లా మాజీ సీఎం జగన్ ప్రచార పుస్తకాలకు నిలయంగా మారిందని గుంటూరు టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు ప్రచారం కోసం ‘ఆంధ్రప్రదేశ్ ‌కు జగనే ఎందుకు కావాలి? ‘అనే పుస్తకాలను పెద్దఎత్తున ముద్రించి, నిల్వ చేశారన్నారు. వైసీపీ ఓడిపోయినా ఆ బంగ్లాలోని 2 గదుల్లో పుస్తకాలు భద్రంగా ఉంచారని, వాటిని తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.