India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం అన్నీ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. ఎస్పీ సతీశ్ కుమార్‌తో కలిసి సోమవారం డీఆర్సీ మీటింగ్ హాల్లో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి లోకేశ్ అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలో వైసీపీ తనకు పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేసిందని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2019లో రాజ్యసభ, గుంటూరు పార్లమెంట్, నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేసిన విషయం చాలా మందికి తెలియదని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన ఐడియాలజీకి సూట్ కానీ పార్టీ వైసీపీ అని తెలిపారు. తనకున్న విధేయత, ఓ కార్యకర్తలా చాలా రోజుల నుంచి కష్టపడ్డాను కాబట్టి తనకు టికెట్ దక్కిందన్నారు.

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు-పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి, చట్టపరమైన పరిమితులతో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సతీశ్ ఆదేశాలు ఇచ్చారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలపై ప్రజలు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువ శాతం సెల్ ఫోన్లో ఆటలకు పరిమితం అవుతున్నారు. కొంత మంది పిల్లలు మాత్రం క్రికెట్ మీద మక్కువతో మైదానాలలో, కొన్ని ప్రభుత్వ ప్రదేశాలలో ఆడుతూ ఉంటారు. అయితే అభివృద్ధి, మరికొన్ని కారణాల చేత అక్కడ పిల్లలు ఆడుకోవటానికి వీలు లేకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రీడలు కనుమరుగు అవ్వకుండా స్థానికంగా మైదానాలు ఏర్పాటు చెయ్యాలని క్రీడా కారులు కోరుతున్నారు. దీనిపై మీ COMMENT.

రైస్ కార్డుల కోసం గుంటూరు జిల్లాలో 52,447 దరఖాస్తులు అందగా, వీటిలో 90% సమస్యలు పరిష్కారం అయ్యాయి. కొత్తగా 8 వేలకుపైగా కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా పేర్ల చేర్పు దరఖాస్తులే రావడం గమనార్హం. తెనాలి, గుంటూరు డివిజన్‌లలో అధిక స్పందన కనిపించింది. పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కార్డు విభజనలపై కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 4,300లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్‌పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.

విభిన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు గుంటూరు జిల్లాలోని 18ఏళ్ల లోపు విద్యార్థుల నుంచి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కళలు, క్రీడలు, పర్యావరణం, సామాజిక సేవ, తదితర రంగాల్లో సామర్థ్యం చూపిన పిల్లలు జులై 31లోగా https://awards.gov.inలో అప్లై చేయాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి ప్రసూన తెలిపారు. కేంద్రం నిర్వహించే ఈ అవార్డు ప్రతిభకు గుర్తింపు కల్పించనుందన్నారు.

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ముత్యాల పందిరి వాహనం ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ధ్వజస్తంభం వద్ద ఊరేగింపుగా బయలుదేరిన క్రమంలో వాహనం ఒక్కసారిగా ఒరిగిపోయింది. దేవస్థాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, ఉత్సవ విగ్రహాలు కింద పడకుండా కాపాడారు. ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని గురువారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మత్స్య శాఖ సైంటిస్ట్ హీరా లాల్ మాట్లాడారు. మంచినీటిలో చేపలను పెంచడం ద్వారా ఉత్పత్తిలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తద్వారా ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఆక్వా రంగంలో ఎగుమతులు పెరిగే విధంగా అన్ని చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

స్తంభాల గరువుకు చెందిన కరిముల్లా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల మేరకు.. కరిముల్లా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో అతని భార్య కరిముల్లా వదిన వద్ద ఉంటుంది. అతని వదినకు స్థానికంగా ఉండే ఓ ఫైనాన్షియర్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై హత్యకు గురైన వ్యక్తి ఆ ఫైనాన్షియర్‌పై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఫైనాన్షియర్ మరో వ్యక్తి సహాయంతో అరటిగెల కోసే కత్తితో కరిముల్లాను హత్య చేయించాడని చెప్పారు.
Sorry, no posts matched your criteria.