Guntur

News April 23, 2025

గుంటూరు యువకుడిపై కడప యువతి ఫిర్యాదు

image

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటున్నప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.

News April 23, 2025

24 నుంచి సెలవులు.. ఆదేశాలు పాటించాలి: DEO

image

గుంటూరు జిల్లాలోని పాఠశాలలన్నింటికీ ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని చెప్పారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోనోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాటించాలని సూచించారు.

News April 23, 2025

అమరావతి: ఒకప్పటి ధాన్యకటకం గురించి తెలుసా..?

image

అమరావతి ప్రాచీనంగా ధాన్యకటకం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో(సా.శ. 1వ శతాబ్దం) ఈప్రాంతం బౌద్ధ, జైన మతాలకు ప్రముఖ కేంద్రంగా మారింది. బౌద్ధ విశ్వవిద్యాలయం, బౌద్ధరామాలు, స్థూపాలు అమరావతిని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. శాతవాహన పాలకులు దీన్ని రాజధానిగా వాడారు. బౌద్ధుడి కాలచక్ర బోధనలకు కేంద్రంగా అమరావతి నిలిచింది. వజ్రయాన గ్రంథాల్లో అమరావతికి చారిత్రక ప్రామాణికత ఉంది.

News April 23, 2025

ANU: ఇంజినీరింగ్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొదటి సెమిస్టర్ 1/4 ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. ఎంబీఏ,ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ రీవాల్యూయేషన్ ఫలితాలను కూడా విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. బీటెక్ 4/1, 4/4 సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫలితాలు www.anu.ac.in లో అందుబాటులో ఉన్నాయన్నారు.

News April 23, 2025

గుంటూరు డాక్టర్ అరుదైన రికార్డు 

image

NTR హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో గుంటూరు GGH న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ గాజుల రామకృష్ణ కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ పీజీ పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీతో పాటు కార్డియాలజీ పీజీలు పూర్తిచేసిన ప్రపంచంలోనే తొలి డాక్టరుగా అరుదైన గౌరవం పొందారు. వేమూరు(M) చావలికి చెందిన రామకృష్ణ గుంటూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి, ప్రభుత్వ వైద్య సేవల్లో అనేక బాధ్యతలు చేపట్టారు

News April 23, 2025

గుంటూరు: టెన్త్ ఫలితాల కోసం ఎదురు చూపులు..!

image

గుంటూరు జిల్లాలో 30,410 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 29,459 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ కాగా, 2024లో పరీక్షలు తప్పినవారు, ప్రవేట్‌గా రాస్తున్న వారు 961 మంది ఉన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు SSC పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు పరీక్షల విభాగ డైరెక్టర్ KV శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వే2న్యూస్‌ ద్వారా వేగంగా పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చు.

News April 22, 2025

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం

image

మంగళగిరి మండలం నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) డీపీఆర్ తయారీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ పని కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి మే 14లోగా ఆర్ఎఫ్‌పీలు (ప్రతిపాదనలు) కోరుతూ ప్రకటన విడుదల చేసింది. విగ్రహం నిర్మాణంతో పాటు అక్కడి ప్రధాన రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ డిజైన్‌కు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నారు.

News April 22, 2025

పెదకూరపాడు: సివిల్స్‌లో సత్తా చాటిన రైతు బిడ్డ

image

పెదకూరపాడుకు చెందిన సామాన్య రైతు బిడ్డ చల్లా పవన్ కళ్యాణ్ సివిల్స్‌లో 146వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించాడు. పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించినట్లు పవన్ తెలిపాడు. పవన్ విజయం జిల్లాకే గర్వకారణమని స్థానికులు కొనియాడారు. మంచి ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News April 22, 2025

గుంటూరు వాహినిలో 25 వరకు తాగునీటి విడుదల

image

గుంటూరు జిల్లా తాగునీటి చెరువులను నింపాలని గుంటూరు వాహినికి ఈ నెల 25 వరకు తాగు నీటిని విడుదల చేస్తున్నామని, ఆయా తటాకాలను నీటితో నింపుకోవాలని డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ ఉప్పుటూరి సాంబశివరావు తెలిపారు. 25వ తేదీ తర్వాత మరమ్మతుల నిమిత్తం కాలువకు నీరు నిలిపివేస్తామని, రాబోయే రోజులలో పెదనందిపాడు మండల ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు.

News April 22, 2025

తుళ్లూరు: అక్కను హత్య చేసిన తమ్ముడికి యావజ్జీవ శిక్ష

image

తుళ్లూరు మండలం కొత్తూరు గ్రామంలో 2017లో జరిగిన ఆస్తి తగాదా హత్య కేసులో సోమవారం న్యాయస్థానం శిక్ష విధించింది. అక్కను హత్య చేసి, ఆమె కూతురిపై దాడి చేసిన షేక్ నాగుల్ మీరావాలికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.1000 జరిమానా, మరోసారి 307 సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణ చేసిన తుళ్లూరు మాజీ సీఐ సుధాకరరావు నేతృత్వంలోని బృందాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.