India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటికీ సెలవు ప్రకటిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలకు తెలియజేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాళి కట్టే సమయంలో వివాహం నిలిచిపోయిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. తాడేపల్లిలోని ఓ చర్చిలో క్రైస్తవ పద్ధతిలో వివాహ కార్యక్రమం జరుగుతున్న సమయంలో HIV డిస్టిక్ ప్రాజెక్టు మహిళా ప్రతినిధులు చర్చి పాస్టర్‌కు వరుడికి HIV ఉందని తెలిపారు. దీంతో పాస్టర్ పెళ్లిని నిలిపివేశారు. అనంతరం వరుడి బంధువులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది.
తైవాన్‌లో చైనీస్ తైపీ రోలర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 24 నుంచి 30 వరకు జరిగే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు, ఇండియా నుంచి తాడేపల్లి దూలాస్ నగర్‌కు చెందిన మేరుగుపాల హశిశ్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్షులు లీయూ పు-త్సాయ్ ఉత్తర్వులను మంగళవారం పంపారు. హశిశ్ ఆర్టిస్ట్ స్కేటింగ్ విభాగంలో ప్రీ స్టైల్, ఇన్ లైన్, సోలో డాన్స్ పోటీలలో తలపడతాడు. కాబట్టి ఈ బుడతడికి కంగ్రాట్స్ చెబుదాం.
గుంటూరులోని గోరంట్లలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు తల్లీ, కూతురుగా పోలీసులు నిర్ధారించారు. అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న వింజమూరి నాగలక్ష్మి (38), చరణ్య (14) లు చిల్లీస్ రెస్టారెంట్ వద్ద రహదారిని క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు.
గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో లారీ ఢీ కొని ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. అమరావతి నుంచి గుంటూరు నగరంలోకి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం CBN చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి లోకేశ్ తెలిపారు. సోమవారం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా మిర్చి రైతులకు క్వింటా కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని మంత్రి అన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగిన విద్యుదాఘాతం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై సోమవారం ఓ ప్రకటనలో మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమర్ధవంతంగా నిర్వహించాలని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మీ ఆదేశించారు. కౌంటింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, పర్యవేక్షణ అధికారులకు సోమవారం కలెక్టరేట్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో అభ్యర్ధి విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక్క ఓటు అధికంగా రావాల్సి ఉందన్నారు. ఓట్లు లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జడ్పీలో భద్రపర్చిన పోలింగ్ కిట్లను రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం పరిశీలించారు. మెటీరియల్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల సీరియల్ నెంబర్లు వేసి వాటిని పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్దం చేయాలని చెప్పారు. 26 నుంచి ఏసీ కళాశాలలో కిట్ల పంపిణీ కోసం ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని చెప్పారు.
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. జగన్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని, టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని అన్నారు.
Sorry, no posts matched your criteria.