India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ- గూడూరు, గూడూరు- విజయవాడ రైళ్లను పునరుద్ధరించారు. డబ్లింగ్, సిగ్నలింగ్ పనుల వల్ల ఇటీవల ఈ రైళ్లను రద్దు చేయగా.. వీటిని పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్‌కు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ఉదయం లేఖ పంపారు. స్పందించిన రైల్వే శాఖ రద్దయిన ఆ రైళ్లను పునరుద్ధరించింది. వీటి రద్దు సమయంలో ఒంగోలు-బాపట్ల-తెనాలి ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు గుంటూరులోని జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. అయితే అనారోగ్య కారణాలతో గిరి రాంబాబు అనే వ్యక్తికి మాత్రం బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో మరికొంతమంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
పల్నాడు జిల్లాకు నూతన ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం కలెక్టర్ పి. అరుణ్ బాబును కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలపై కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆయనకు సూచించారు.
జగ్గయ్యపేట మండలం బూదవాడ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య<<13582186>> ఇప్పటివరకు 4కి చేరింది. <<>>విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సిమెంట్ కర్మాగార ఉద్యోగి శ్రీమన్నారాయణ నేడు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతుని స్వస్థలం పల్నాడు జిల్లా మాచర్లగా అధికారులు వెల్లడించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బాపట్ల రూరల్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కథనం మేరకు.. బాపట్ల మండలం నందిరాజు తోట గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు దాడి నిర్వహించి ఒక జెసీబీ, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* CM చంద్రబాబు బయోపిక్ షూటింగ్ ప్రారంభం
* బాపట్ల: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి
* గుంటూరు: మహిళతో సహజీవనం..
* మంగళగిరిలో రోడ్డు ప్రమాదంలో.. బాలుడి మృతి
* అంబానీ పెళ్లి వేడుకల్లో గుంటూరు MP పెమ్మసాని
* గుంటూరులో వ్యక్తి మృతి.. హత్యా? ఆత్మహత్యా?
* రేపల్లేలో గంజాయి అమ్ముతున్న 10 మంది అరెస్ట్
* టీడీపీ నేత మృతి.. సంతాపం తెలిపిన మంత్రి లోకేశ్
* ఫిరంగిపురంలో 178 క్వింటాళ్ళ బియ్యం పట్టివేత
మంగళగిరిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు.
టీడీపీ నేత, ఓటర్ రామకృష్ణగా అందరికి సుపరిచితులైన అన్నే రామకృష్ణ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించిన రామకృష్ణకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. TDP ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఎనలేని సేవ చేశారని రామకృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని తన ట్విటర్ (X)లో ట్వీట్ చేశారు.
గుంటూరు నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాస శివయ్య(39) అనే వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య రాస సామ్రాజ్యం ఫిర్యాదు మేరకు ఎస్సై సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకి పాల్పడ్డాడని మృతుని భార్య వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.