Guntur

News June 4, 2024

భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న పెమ్మసాని

image

గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. సమీప ప్రత్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 19,207 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తాజా ఓట్ల లెక్కింపు ప్రకారం పెమ్మసానికి 41,909 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రోశయ్యకు 22,702 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

Breaking: పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యం

image

గుంటూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 3971 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా పెమ్మసానికి 8027 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు 4056 ఓట్లు పోలయ్యాయి.

News June 4, 2024

లావు కృష్ణదేవరాయలు ఆధిక్యం

image

పల్నాడులో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 509 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. మొత్తంగా లావుకు 4,103 ఓట్లు, అనిల్‌కు 3,594 ఓట్లు పోలయ్యాయి.

News June 4, 2024

తెల్లవారుజామున యూనివర్సిటీ వద్ద తనిఖీలు చేసిన ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ తుషార్ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అక్కడ బందోబస్తు, సిబ్బంది పనితీరు తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద సిబ్బందికి సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోనికి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని ఆదేశించారు.

News June 4, 2024

కాసేపట్లో గుంటూరు వెస్ట్ ప్రజల తీర్పు.!

image

గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ప్రజలు ఎవరికి ఓటేశారో కాసేపట్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సిద్ధమవగా.. అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ TDP నుంచి గల్లా మాధవి, YCP నుంచి విడదల రజిని బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో మద్దాలి గిరి 4,289 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఈ సారి ఎవరు గెలవనున్నారో లైవ్ అప్‌డేట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.

News June 3, 2024

కౌంటింగ్‌కి 1047 మంది ఉద్యోగులు: గుంటూరు కలెక్టర్

image

జూన్ 4న కౌంటింగ్‌కు నాగార్జున యూనివర్సిటీలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. 1047 మంది ఉద్యోగులను కౌంటింగ్‌కి నియమించి శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజవర్గ ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్, పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 14 టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్స్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు.

News June 3, 2024

బెదిరింపులకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు: డీజీపీ

image

సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంత మంది, మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ.. ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అన్నారు. వారిపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, PD ACT ప్రయోగించడం జరుగుతుందన్నారు.

News June 3, 2024

RTV ఎగ్జిట్ పోల్స్: గుంటూరు జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లంటే?

image

గుంటూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా టీడీపీ-6, జనసేన – 1 స్థానం విజయం సాధిస్తుందని RTV అంచనా వేసింది. ➢ తాడికొండ : తెనాలి శ్రావణ్ కుమార్ ➢ మంగళగిరి: నారా లోకేశ్ ➢ ప్రత్తిపాడు : బూర్ల రామాంజనేయులు ➢ తెనాలి: నాదెండ్ల మనోహర్ ➢ పొన్నూరు : ధూళిపాళ్ల నరేంద్ర ➢ గుంటూరు ఈస్ట్ : మొహ్మద్ నసీర్ ➢ గుంటూరు వెస్ట్: గల్లా మాధవి గెలుస్తారని తెలిపింది.

News June 3, 2024

మంగళగిరిలో లోకేశ్‌కు 20వేల ఓట్లకు పైగా మెజారిటీ: ఆరా మస్తాన్

image

మంగళగిరిలో నారా లోకేశ్‌కు 20వేల ఓట్లకు పైనే మెజారిటీ వస్తుందని ఆరా మస్తాన్ అంచనా వేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మొన్న ఎగ్జిట్ పోల్స్ సమయంలో లోకేశ్ గెలుస్తారని చెప్పిన ఆయన, తాజాగా భారీ మెజార్టీతో లోకేశ్ విజయం సాధిస్తారన్నారు. మంగళగిరిలో ప్రధాన పార్టీల నుంచి నారా లోకేశ్, మురుగుడు లావణ్య బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆరా మస్తాన్ వ్యాఖ్యలపై మీ COMMENT.

News June 3, 2024

నరసరావుపేట: ఓట్ల లెక్కింపు.. ట్రాఫిక్ మళ్లింపు

image

నరసరావుపేటలోని జేఎన్‌టీయూ కాలేజీలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నరసరావుపేట నుంచి వినుకొండకు రైల్వేస్టేషన్ రోడ్డు, లింగంగుంట్ల, ఇక్కర్రు, రొంపిచర్ల క్రాస్ రోడ్, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా వెళ్లాలి. నరసరావుపేట నుంచి ఒంగోలుకు, చిలకలూరిపేట, NH-16మీదుగా చేరుకోవాలి. నరసరావుపేటకు బయట వ్యక్తులు రాకూడదని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు.