Guntur

News November 13, 2024

ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్డు

image

వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని, తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.

News November 12, 2024

బడ్జెట్‌లో ఉమ్మడి గుంటూరుకు అగ్రతాంబూలం

image

ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి..
➤ NG రంగా వర్సిటీకి రూ.507 కోట్లు
➤ AP CRDA సహాయనిధి కింద రూ.1053.70 కోట్లు
➤ ఉమ్మడి GNTలో యంత్ర పరికరాలకు రూ.11 కోట్లు
➤ అమరావతిలో మెట్రోరైలుకి రూ.50 కోట్లు
➤ కృష్ణా డెల్టాకు రూ.138 కోట్లు
➤ పులిచింతల నిర్వహణకు రూ.29.45 కోట్లు
➤ గుండ్లకమ్మకు రూ.13 కోట్లు
➤ GNT శంకర్ విలాస్ ROB విస్తరణకు రూ.115 కోట్లు

News November 11, 2024

గుంటూరు జిల్లాలో 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్: కలెక్టర్

image

రాష్ట్ర బాలల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభం కానుంది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టర్ నాగలక్ష్మి , జేసీ భార్గవ్ తేజ‌ ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారి ఎదుగుదల లోపాలను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు‌.

News November 11, 2024

2022-23 ఉమ్మడి గుంటూరు జిల్లా తలసరి ఆదాయం ఇదే.!

image

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాల వారీగా తలసరి ఆదాయ లెక్కలను డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాకు 2,32,024 ఉండగా, పల్నాడు జిల్లాకు 1,70,807, బాపట్ల జిల్లాకు 1,96,853గా ఉంది. ఈ లెక్కల ప్రకారం విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో కృష్ణా జిల్లా, మూడవ స్థానంలో ఏలూరు జిల్లా ఉంది. 

News November 11, 2024

గుంటూరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు వినిపిస్తారా?

image

నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి గుంటూరు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, తోటపల్లి ఎత్తిపోతల పథకం కాలువ పనులు, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

News November 11, 2024

ప్రత్తిపాడు: జూద శిబిరంపై పోలీసుల దాడి

image

ప్రత్తిపాడులోని ఓ పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. CI శ్రీనివాసరావు వివరాల మేరకు.. రాబడిన సమాచారం మేరకు పేకాట స్థావరాలపై దాడి చేసి 38మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.96,300 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

News November 11, 2024

ANU దూరవిద్య MBA, MCA ఎంట్రన్స్ ఫలితాలు విడుదల

image

ANU దూరవిద్య కేంద్రంలో MBA, MCA కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 9 నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కో ఆర్డినేటర్ రామచంద్రన్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 201 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 188 మంది పరీక్షకు హాజరయ్యారని, 184 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారికి ఈ నెల 15లోగా ప్రవేశాలు కల్పిస్తామని అన్నారు. 

News November 10, 2024

కేసుల నుంచి తప్పించుకోడానికి జగన్ ప్రయత్నం: MLA జీవీ

image

ఐదేళ్లపాటు శాంతిభద్రతలను రౌడీ మూకల చేతుల్లో పెట్టిన ఫ్యాక్షన్ నాయకుడు జగన్ అని వినుకొండ MLA జీవీ ఆంజనేయులు ఆరోపించారు. కేసులు, అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి జగన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడన్నారు. సోషల్ మీడియాలో ఉన్మాదం, విషం నింపి ఒక తరం భవిష్యత్తునే జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. తల్లి, చెల్లిపై కూడా తప్పుడు పోస్టులు పెట్టించిన ఘనుడు జగన్ అని తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు.

News November 10, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డులు వీరికే!

image

➤ చెన్నంశెట్టి రమేశ్ (SA లెక్కలు, మామిళ్లపల్లి, MPUPS) ➤ పి.మృత్యం జయరావు (SGT. కొల్లిపర MPPS) ➤ గోనేళ్ళ శేష వరలక్ష్మి (SA. ఇంగ్లీష్, ఈపూరు పాలెం ZPHS) ➤ పవని భాను చంద్ర మూర్తి (SA. భౌతిక శాస్త్రం, పేరాల చీరాల మండలం) ➤ కర్పూరపు బిజిలి కుమార్ (SGT. బలుసుపాలెం చెరుకుపల్లి మండలం) ➤ కె. వెంకట శ్రీనివాసరావు (HM. గ్రేడ్ – 2 చక్రాయ పాలెం అద్దంకి(M)

News November 10, 2024

నేడు గుంటూరుకి రానున్న డిప్యూటీ సీఎం 

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరుకు రానున్నారు. నగరంలోని అరణ్య భవన్లో ఉదయం 11 గంటలకు అటవీ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని అటవీ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం రాక కోసం ఏర్పాట్లు చేపట్టారు. తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ గుంటూరు నగరానికి రానున్నారు.