India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లాడ్జిలో వివాహితతో కలిసి ఉన్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి అతణ్ని కిడ్నాప్ చేశారు. లాడ్జి మేనేజర్ తిరుపతి ఫిర్యాదు మేరకు లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. పోలీసుల కథనం.. జిన్నాటవర్ సెంటర్లోని బాలాజీ లాడ్జిలో రామలింగేశ్వరరావు అనే వ్యక్తి ఓ వివాహితతో రూమ్ తీసుకున్నాడు. నలుగురు వ్యక్తులు వచ్చి రామలింగేశ్వరరావుపై దాడి చేసి అతణ్ని తీసుకెళ్లారని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యల విషయంలో ఎవరు అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు.

టీడీపీ తరఫున కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు పత్రాలు అందచేశారు. అభ్యర్థులకు మద్దతుగా నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, విష్ణుకుమార్ రాజు, రఘురామకృష్ణంరాజు, పితాని సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పల్లా శ్రీనివాస్, టీడీ జనార్దన్, కురుగొండ్ల రామకృష్ణ వచ్చారు.

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ప్రకటించారు. PPP మోడల్‌లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అందులో భాగంగా గుంటూరు బస్టాండ్‌ను పరిశీలించి, స్థల సేకరణ, ఎలక్ట్రికల్ వాహనాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

గుంటూరుకు చెందిన అరిగెల భార్గవ్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్ డబుల్స్ విభాగంలో ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గొబ్బూరి విశ్వతేజతో కలిసి వరల్డ్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు భార్గవ్‌ను అభినందిస్తున్నారు.

దేశవ్యాప్తంగా నిర్వహించబడిన జాతీయ లోక్ అదాలతో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ కేసులను పరిష్కరించామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. ఐపీసీ కేసులు 601, ఎక్సైజ్ కేసులు 473, స్థానిక చట్టాలు సంబంధించిన కేసులు 133 మొత్తం కలిపి 1,211 కేసులను పరిష్కరించామని తెలిపారు. డీసీఆర్బీ సీఐ నరసింహారావు, కోర్టు సిబ్బందిని అభినందించారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని సోమవారం నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఫిర్యాదిదారులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో తిరిగి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఫిర్యాది దారులు ఈ విషయాన్ని గమనించి పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన చిరువ్యాపారి మృతిచెందాడు. పులివర్తి సురేశ్ (45) ద్విచక్ర వాహనంపై అరటిగెలలు పెట్టుకుని పరిసర గ్రామాల్లో ప్రజలకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం దుగ్గిరాల వెళుతున్నానని చెప్పి వెళ్లిన సురేశ్ పోస్టాఫీస్ సమీపాన బస్ షెల్టర్‌లో మృతిచెంది ఉన్నాడు. పోలీసులకు అందించిన సమాచారంతో కుటుంబసభ్యులు సురేశ్ మృతదేహాన్ని గుర్తించారు. వడదెబ్బకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజిత గుంటూరు జిల్లాలో 150 పరీక్షా కేంద్రాల్లో 30,140మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ పరీక్షలతోపాటు, మరో 21 పరీక్షా కేంద్రాల్లో దూర విద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. గుంటూరు గతేడాది 88.14 శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులు పనిచేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.